AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అర్ధరాత్రి గిరిజన మహిళకు పురిటినొప్పులు.. ఆస్పత్రికి వెళ్లేదారిలేక అష్టకష్టాలు! చివరికి ఏం జరిగిందంటే

గిరిజన ప్రాంతాల్లో మహిళలు పురుడు పోసుకోవాలంటే అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. రవాణా సదుపాయంలేక పోవడంతో సకాలంలో ఆస్పత్రికి వెళ్లేదారిలేక నానాఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో అంబులెన్స్ సిబ్బందే అన్నీతామై పురుడు పోయాల్సి వస్తుంది. తాజాగా అటువంటి సంఘటనే శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది..

Andhra Pradesh: అర్ధరాత్రి గిరిజన మహిళకు పురిటినొప్పులు.. ఆస్పత్రికి వెళ్లేదారిలేక అష్టకష్టాలు! చివరికి ఏం జరిగిందంటే
Woman Gives Birth To Baby In Ambulance
S Srinivasa Rao
| Edited By: |

Updated on: Nov 14, 2024 | 4:58 PM

Share

పలాస, నవంబర్‌ 14: 108 వాహనాలు ఆరోగ్యసంజీవనిలు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రమాదాలు, విపత్తులు, తీవ్రమైన అనారోగ్య సమస్యల సంయమలో ఫోన్ చేసిన వెంటనే స్పందించి బాధితులను హాస్పిటల్ లో చేర్చి వారి ప్రాణాలను నిలబెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తప్పనిసరి సందర్భాలలో నిండు గర్భిణీలకు 108 వాహణంలోనే పుట్టింటి వారిలా పురుడు పోసి ప్రత్యేక రుణానుబంధాన్ని అందిస్తున్నారు 108 సిబ్బంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు మారుమూల పల్లెలలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అందుకోసమే గిరిజన ప్రాంతాలలో గర్భిణీలు డెలివరీ డేట్ కి కొద్ది రోజులు ముందే హాస్పిటల్ కి గాని లేదా సమీప పట్టణ ప్రాంతానికి గాని చేరుకుంటే అక్కడ వసతి సౌకర్యం కల్పించే దిశగా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కానీ అలా ముందస్తుగా తరలిరాడానికి చాలామంది చొరవ చూపటం లేదు. దీంతో చివరి నిమిషంలో నొప్పుల బారిన పడి ట్రాన్స్ పోర్ట్ సదుపాయం కూడా లేక 108లనే ఆశ్రయిస్తున్నారు. కొంతమంది గర్భిణీలకు తప్పనిసరి పరిస్థితుల్లో 108 సిబ్బంది వాహణంలోనే డెలివరీ చేస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో 108 వాహనంలోనే మహిళకు పురుడు

తాజాగా శ్రీకాకుళo జిల్లాలో బుధవారం అర్థరాత్రి ఇలాగే ఓ గర్భిణికి 108 అంబులెన్స్ లోనే ప్రసవం అయింది. జిల్లాలోని మందస మండలం కుడుమా సాయి గ్రామానికి చెందిన సవర విజయలక్ష్మి (21) అనే గిరిజన మహిళకు బుధవారం అర్ధరాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే కుటుంబసభ్యులు 108 అంబులెన్స్ కి ఫోన్ చేయగా.. కొంత సమయానికి పలాస నుండి 108 వాహనం గ్రామానికి చేరుకుంది. విజయ లక్ష్మిని పికప్ చేసుకొని, పలాస ప్రభుత్వ ఆసుపత్రికి డెలివరీ కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమెకు ప్రసవం అయ్యింది. ఆమె ప్రసవ వేదన చూసిన 108 సిబ్బంది ఇక చేసేదిలేక రెంటికోట గ్రామ సమీపంలో రోడ్డు పక్కన అంబులెన్స్‌ను నిలిపివేసి, వాహనంలోనే విజయలక్ష్మికి పురుడు పోశారు. విజయలక్ష్మి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. డెలివిరీ అనంతరం విజయలక్ష్మికి, ఆమె బిడ్డకి ప్రథమ చికిత్స అందించి అంబులెన్స్‌లో పలాసలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

తల్లి, బిడ్డ క్షేమం…

వివాహం అనంతరం విజయలక్ష్మికి ఇది మొదటి సంతానం. డెలివిరి అనంతరం బిడ్డ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్టు 108 సిబ్బంది తెలిపారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. విజయలక్ష్మికి పురుడు పోసిన 108 అంబులెన్స్ సిబ్బందికి ఆమె కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.