Andhra Pradesh: పెడనలో జరిగిన సీఎం సభకు హాజరైన మహిళ మృతి.. వెంటనే కుటుంబానికి చెక్ పంపిన జగన్
కృష్ణాజిల్లా పెడనలో నేతన్న నేస్తం నాలుగో విడత సాయాన్ని అందించారు ముఖ్యమంత్రి. అయితే ఈ పబ్లిక్ మీటింగ్‌లో అపశృతి చోటుచేసుకుంది. ముఖ్యమంత్రిని చూసేందుకు వచ్చిన ఓ మహిళ మృతిచెందింది.
Krishna District: సొంత మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు వరుసగా నాలుగో ఏడాదీ 24 వేల ఆర్థిక సాయాన్ని అందించింది ఏపీ ప్రభుత్వం. ఈ ఏడాది 80,546 కుటుంబాలకు రూ.193 కోట్లను DBT ద్వారా అందించింది. కృష్ణాజిల్లా పెడన(Pedana)లో జరిగిన సభకు ముందు మగ్గాన్ని నేశారు ముఖ్యమంత్రి. నేతన్న నేస్తం ద్వారా ఇప్పటి వరకు ప్రతి కుటుంబానికి రూ.96 వేలు ఇచ్చామన్నారు సీఎం జగన్(CM Jagan). లంచాలు లేకుండా, అవినీతికి తావు లేకుండా సాయం చేస్తున్నామన్నారు. గతానికీ, ఇప్పటికీ తేడా గమనించాలని కోరారు. చంద్రబాబు హయాంలో ఒకే సామాజికవర్గం వారికి పదవులు ఇచ్చారని, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే 80 శాతం పదవులు ఇచ్చామని గుర్తు చేశారు. పేదలకు మంచి చేస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు సీఎం జగన్.
సభాస్థలి వద్ద చనిపోయిన మహిళకు 10 లక్షల పరిహారం…
ఈ బహిరంగ సభకు హాజరైన మహిళ మరణించింది. విషయం తెలుసుకున్న సీఎం వెంటనే చనిపోయిన మహిళ ఫ్యామిలీకి రూ.10లక్షల పరిహారం అందజేయాలని ఆదేశించారు. పెడన మండలం దేవరపల్లి విలేజ్‌కు చెందిన సమ్మెట రామమాణిక్యం ఈ మీటింగ్‌కు హాజరయ్యయింది. అయితే సభ జరుగుతుండగా ఆమె అకస్మాత్తుగా సొమ్మసిల్లి సృహతప్పి పడిపోయింది. వెంటనే అలెర్టయిన అధికారులు.. ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం దక్కలేదు.ఈ విషయాన్ని హెలిపాడ్ వద్ద ముఖ్యమంత్రికి మినిస్టర్ జోగి రమేశ్ తెలిపారు. దీంతో విచారం వ్యక్తం చేసిన సీఎం.. రామమాణిక్యం ఫ్యామిలీకి 10 లక్షల రూపాయల పరిహారం వెంటనే కలెక్టర్‌కు సూచించారు. సీఎం ఆదేశాల మేరకు.. మృతురాలి సొంతూరు దేవరపల్లి వెళ్లిన మంత్రి జోగి రమేశ్ మాణిక్యం డెడ్‌బాడీకి నివాళులర్పించి, ఫ్యామిలీ మెంబర్స్‌కు చెక్ ఇచ్చారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి