AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Roja: రాష్ట్రానికి ఆదాయం వచ్చేలా పనిచేస్తా.. మళ్ళీ సీఎం జగన్ అయ్యేలా చేయడమే లక్ష్యమన్న మంత్రి రోజా

Minister Roja: ఏపీ (Andhra Pradesh) పర్యాటక శాఖ మంత్రి ఆర్ కె రోజా కడప జిల్లా(Kadapa District) లో పర్యటించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి (YS Rajasekhar Reddy) సమాధి వద్ద పూలమాలలు..

Minister Roja: రాష్ట్రానికి ఆదాయం వచ్చేలా పనిచేస్తా.. మళ్ళీ సీఎం జగన్ అయ్యేలా చేయడమే లక్ష్యమన్న మంత్రి రోజా
Roja At Kadapa
Surya Kala
|

Updated on: Apr 15, 2022 | 6:12 PM

Share

Minister Roja: ఏపీ (Andhra Pradesh) పర్యాటక శాఖ మంత్రి ఆర్ కె రోజా కడప జిల్లా(Kadapa District) లో పర్యటించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి (YS Rajasekhar Reddy) సమాధి వద్ద పూలమాలలు వేసి మంత్రి రోజా ఘనంగా నివాళలర్పించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. ప్రజలందరూ ఆరాధించే దేవుడు వైఎస్ఆర్ అని అన్నారు. వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి మంత్రి పదవి చ్చినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి కి రుణపడి ఉంటానని అన్నారు మంత్రి రోజా. అంతేకాదు తన క్యాడర్ కోరుకున్నట్లుగా నాకు మంత్రి పదవి వచ్చినందుకు కార్యకర్తలు సహా తన కుటుంబం చాలా సంతోషం గా ఉందన్నారు.

తనకు సీఎం జగన్ ఏ నమ్మకంతో మంత్రి పదవిని ఇచ్చారో.. ఆ నమ్మకం నిలబెట్టుకుంటూ.. ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధి బాటలో పెడతానని అన్నారు. రాష్ట్రానికి ఆదాయం తీసుకుచ్చేలా బాధ్యత గా పని చేస్తానని అన్నారు. జిల్లాలో తనకిచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పారు. క్రెడిబిలిటీకి కేరాఫ్ అడ్రస్ వైఎస్ఆర్ కుటుంబం అన్న రోజా.. అలాంటి కుటుంబానికి రుణపడి ఉంటానన్నారు. జగనన్న సైనికుల్లా పని చేసి 2024 లో కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కు సీఎం జగన్ అయ్యేందుకు కృషి చేస్తానని చెప్పారు.

ఏపీ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా పదవిని చేపట్టిన అనంతరం మొదటిసారిగా  ఇడుపులపాయ కు రావడంతో వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తనకు మంత్రిగా పని చేసే అవకాశం వచ్చేందుకు ఆశీర్వదించిన మహానేతకు నివాళి అర్పించేందుకు వచ్చానని మంత్రి రోజా స్పష్టం చేశారు.

Also Read: Oldest Gorilla Birthday: ప్రపంచంలో అతి వృద్ధ గొరిల్లా.. 65 వ పుట్టిన రోజుని ఘనంగా నిర్వహించిన జూ సిబ్బంది

Viral: ఆస్పత్రికి వచ్చిన మహిళకు స్కానింగ్ చేసిన డాక్టర్లు.. రిపోర్ట్స్ చూడగా మైండ్ బ్లాంక్!

ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..