Oldest Gorilla Birthday: ప్రపంచంలో అతి వృద్ధ గొరిల్లా.. 65 వ పుట్టిన రోజుని ఘనంగా నిర్వహించిన జూ సిబ్బంది

Oldest Gorilla Birthday: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ గొరిల్లా(World's Oldest Gorilla)ఫాటౌ బుధవారం బెర్లిన్ జూ(Berlin Zoo)లో తన 65వ పుట్టినరోజును జరుపుకుంది. జంతుప్రదర్శనశాల..

Oldest Gorilla Birthday: ప్రపంచంలో అతి వృద్ధ గొరిల్లా.. 65 వ పుట్టిన రోజుని ఘనంగా నిర్వహించిన జూ సిబ్బంది
Oldest Gorilla Birthday
Follow us
Surya Kala

|

Updated on: Apr 15, 2022 | 7:48 PM

Oldest Gorilla Birthday: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ గొరిల్లా(World’s Oldest Gorilla)ఫాటౌ బుధవారం బెర్లిన్ జూ(Berlin Zoo)లో తన 65వ పుట్టినరోజును జరుపుకుంది. జంతుప్రదర్శనశాల సిబ్బంది బియ్యం, చీజ్, కూరగాయలు, పండ్లతో ప్రత్యేకంగా ఓ కేక్ ను గొరిల్లా కోసం రెడీ చేశారు. ఆ కేక్ ను ప్రత్యేకంగా రెడ్ కలర్ ట్రూటీ, ఫ్రూటీ, బూడిద రంగు మిఠాయిలలో 65 అంకెను అందంగా అలంకరించారు. అనంతరం పచ్చని ఆకుల్లో ఆ కేక్ ను పెట్టి.. గొరిల్లా ముందు పెట్టారు. ఫాటౌ ఆ కేక్ ప్రతి ముక్కను ఆస్వాదిస్తూ.. తిన్నది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

రుచికరమైన కేక్ ను తిన్న తర్వాత గొరిల్లా తన వేళ్లకు ఉన్న కేక్ ను శుభ్రంగా తిన్నదని జూ సిబ్బంది తెలిపారు. ఈ ఫాటౌ  పశ్చిమ లోతట్టు గొరిల్లా. 1959లో బెర్లిన్‌ జూకు చేరుకుంది. అప్పటి నుండి అక్కడే నివసిస్తోందని ఐర్లాండ్‌కు చెందిన RTE నివేదించింది. “అడవిలో నివసించే గొరిల్లాల ఆయుర్దాయం సుమారు 40 సంవత్సరాలు. అయితే ఈ 65 సంవత్సరాల ఫాటౌ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గొరిల్లాగా రికార్డు సృష్టించిందని జూలో కోతుల సంరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న క్రిస్టియన్ ఆస్ట్  చెప్పారు.

జర్మన్ టెలివిజన్ ఛానల్.. ఈ ఫాటౌ 1957లో జన్మించిందని.. ఇది నిజానికి ఒక నావికుడు ఫ్రాన్స్‌కు తీసుకురావడానికి ముందు పశ్చిమ ఆఫ్రికాలోని అడవిలో పెరిగిందని పేర్కొంది. నావికుడు ఫాటౌని రెండేళ్ల వయసులో కొనుగోలు చేసి.. బెర్లిన్ తీసుకొచ్చాడని.. అతను.. మద్యానికి డబ్బులు లేక గొరిల్లాను ఇచ్చేశాడు. దీంతో అప్పటి నుంచి ఈ గొరిల్లా ఈ జూలోనే జీవిస్తోంది.

2017లో 60 ఏళ్ల కోలో మరణించినప్పటి నుండి ఫాటౌ ప్రపంచంలోనే అత్యంత వయస్కుడైన గొరిల్లాగా ప్రసిద్ధిగాంచింది.  బెర్లిన్ జంతుప్రదర్శనశాల పశ్చిమ లోతట్టు గొరిల్లాలు వాటి సహజ ఆవాసాలు. అయితే ఇవి అంతరించిపోతున్న జాతి అని చెప్పారు. “కామెరూన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, గాబన్, రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని ఉష్ణమండల వర్షారణ్యాలలో ఇవి నివసిస్తాయి. ఈ గొరిల్లాలు 200 కిలోల బరువుతో అతిపెద్ద కోతి జాతి. రోజుకు 15 నుండి 20 కిలోల ఆకులు, గడ్డి, బెరడు,  పండ్లను తింటాయని జూ అధికారులు పేర్కొన్నారు.

Also Read:Aravana Payasam: కేరళ స్పెషల్.. అరవణ పాయసం ఈజీగా టేస్టీగా ఇంట్లోనే చేసుకోండి ఇలా..

IPL 2022: ఐపీఎల్‌ 2022లో కరోనా కలకలం.. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఫిజియోకు పాజిటివ్..