IPL 2022: ఐపీఎల్ 2022లో కరోనా కలకలం.. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఫిజియోకు పాజిటివ్..
Corona in IPL 2022: ఐపీఎల్ 2022(IPL 2022)లో కరోనా(Corona) కలకలం చెలరేగింది. ముంబైలోని బయో-సేఫ్ బబుల్‌లో లీగ్ 15వ సీజన్‌లో మొదటి కరోనా ఇన్‌ఫెక్షన్ కేసు వచ్చింది.
ఐపీఎల్ 2022(IPL 2022)లో కరోనా(Corona) కలకలం చెలరేగింది. ముంబైలోని బయో-సేఫ్ బబుల్‌లో లీగ్ 15వ సీజన్‌లో మొదటి కరోనా ఇన్‌ఫెక్షన్ కేసు వచ్చింది. ఏప్రిల్ 15, శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) టీమ్ ఫిజియో ప్యాట్రిక్ ఫర్‌హార్ట్ కోవిడ్(Covid) ఇన్‌ఫెక్షన్ బారిన పడినట్లు ప్రకటించారు. వ్యాధి సోకిందని గుర్తించిన తరువాత, అతను నిర్బంధింలోకి వెళ్లాడు. ఢిల్లీ వైద్య బృందం అతనిని పర్యవేక్షిస్తోంది. శనివారం (ఏప్రిల్ 16) ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడుతుంది.ఆర్సీబీతో మ్యాచ్‌ను రద్దు చేయవచ్చని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
పాట్రిక్ ఫర్‌హార్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లందరితో టచ్‌లో ఉన్నాడు. దీంతో ఆటగాళ్లందరికీ కోవిడ్ పరీక్ష చేశారు. పరీక్షలో మరొకరికి కరోనా సోకినట్లైతే అతను కూడా ఒంటరిగా ఉంటాడు. ఒకవేళ ఒక్కరి కంటే ఎక్కువ మంది ఆటగాళ్లకు వ్యాధి సోకితే మ్యాచ్‌ను వాయిదా వేయవచ్చు. గతేడాది కూడా బయో బబుల్‌లో కరోనా ప్రవేశించిన తర్వాత చాలా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత బీసీసీఐ ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేసింది. తరువాత రెండో దశ యూఏఈలో నిర్వహించింది.
ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడింది. రెండు మ్యాచ్‌ల్లో గెలిచి మరో రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఢిల్లీ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్‌పై పరాజయం పాలైంది. ఢిల్లీ తన చివరి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది.
Read Also.. IPL 2022 Purple Cap: రసవత్తరంగా పర్పుల్ క్యాప్ రేస్.. నేటి మ్యాచ్‌తో మళ్లీ అతడికేనా టాప్ ప్లేస్?