SRH vs KKR Highlights: చెలరేగి ఆడిన మర్‌క్రమ్, త్రిపాఠి.. 7 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ విజయం..

Narender Vaitla

| Edited By: Srinivas Chekkilla

Updated on: Apr 15, 2022 | 11:21 PM

IPL 2022: ఐపీఎల్‌ 2022లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

SRH vs KKR Highlights: చెలరేగి ఆడిన మర్‌క్రమ్, త్రిపాఠి.. 7 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ విజయం..

ఐపీఎల్‌ 2022లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిం 175 పరుగులు చేసింది. 176 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ మొదలు పెట్టిన హైదరాబాద్ 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. రాహుల్ త్రిపాఠి 71 పరుగులు, మర్‌క్రమ్ 68 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

Key Events

సన్‌రైజర్స్‌ మైనస్‌..

స్టార్ ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో ఆల్‌రౌండర్‌ ప్లేయర్‌ లేకపోవడం సన్‌రైజర్స్‌కు మైనస్‌ చెప్పొచ్చు.

ఓడినా బలంగానే..

కోల్‌కతా తన చివరి మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ, ఇప్పటికీ జట్టు మంచి స్థితిలోనే ఉంది. ప్లేయర్స్‌ అంతా మంచి ఫామ్‌లో ఉండడం కోల్‌కతాకు ప్లస్‌ పాయింట్ అని చెప్పొచ్చు. ఇటువంటి పరిస్థితిలో KKR గెలిచి మళ్లీ ట్రాక్‌లోకి రావాలని కోరుకుంటుంది.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 15 Apr 2022 11:05 PM (IST)

    హాఫ్ సెంచరీ చేసిన మర్‌క్రమ్‌

    హైదరాబాద్ ఆటగాడు మర్‌క్రమ్‌ హాఫ్ సెంచరీ చేశాడు. 30 బంతుల్లో 51 పరుగులు చేశాడు.

  • 15 Apr 2022 10:52 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన హైదరాబాద్

    సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మూడో వికెట్ కోల్పోయింది. 71 పరుగులు చేసిన త్రిపాఠి క్యాచ్‌ ఔటయ్యాడు.

  • 15 Apr 2022 10:31 PM (IST)

    హాఫ్ సెంచరీ చేసిన రాహుల్ త్రిపాఠి

    సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఆటగాడు రాహుల్ త్రిపాఠి హాఫ్ సెంచరీ చేశాడు.

  • 15 Apr 2022 10:09 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన హైదరాబాద్

    సన్‌రైజర్స్ హైదరాబాద్‌ రెండో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన కెప్టెన్‌ విలియమ్సన్ రసెల్ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు.

  • 15 Apr 2022 09:52 PM (IST)

    తొలి వికెట్‌ కోల్పోయిన హైదరాబాద్‌..

    కోల్‌కతా ఇచ్చిన 176 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బ్యాటింగ్ మొదలు పెట్టిన హైదరాబాద్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అభిషేక్‌ శర్మ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. పాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు.

  • 15 Apr 2022 09:26 PM (IST)

    ముగిసిన కోల్‌కతా ఇన్నింగ్స్‌..

    టాస్‌ ఓడి బ్యాటింగ్ మొదలు పెట్టిన కోల్‌కతా మొదట్లో వరుస వికెట్లు కోల్పోయి కాస్త కష్టాల్లోకి వెళ్లినట్లు కనిపించింది. అయితే తర్వాత క్రీజులోకి వచ్చిన నితిన్‌ రానా హాఫ్‌ సెంచరీ రాణించడంతో జట్టు స్కోరు పెరిగింది. ఇక చివరల్లో ఆండ్రీ రస్సెల్‌ కేవలం 25 బంతుల్లో 49 పరుగులు సాధించడంతో జట్టు స్కోరు 175 పరుగులకు చేరింది. హైదరాబాద్ విజయం సాధించాలంటే 176 పరుగులు సాధించాల్సి ఉంది.

  • 15 Apr 2022 09:16 PM (IST)

    ఏడో వికెట్‌ గాన్..

    కోల్‌కతా మ్యాచ్‌ ముగుస్తున్న సమయంలో వరుస వికెట్లు కోల్పోతోంది. ఈ క్రమంలోనే పాట్‌ కమిన్స్‌ రూపంలో మరో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్‌ బౌలింగ్‌లో మార్కో జాన్సెస్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు.

  • 15 Apr 2022 09:09 PM (IST)

    ఆరో వికెట్‌ కోల్పోయిన్‌ కోల్‌కతా..

    కోల్‌కతా మరో వికెట్‌ కోల్పోయింది. హాఫ్‌ సెంచరీతో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన నితీష్‌ రానా వెనుదిరిగాడు. నటరాజన్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ పూరన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టాడు.

  • 15 Apr 2022 08:56 PM (IST)

    హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న రానా..

    వరుస వికెట్లు కోల్పోతున్న సమయంలో జట్టు స్కోరు పెంచే పనిలో పడ్డాడు నితీశ్‌ రానా. కేవలం 33 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేశాడు. 16 ఓవర్లు ముగిసే సమయానికి కోల్‌కతా 122 పరుగుల వద్ద కొనసాగుతోంది.

  • 15 Apr 2022 08:41 PM (IST)

    మరో వికెట్‌ కోల్పోయిన కోల్‌కతా..

    కోల్‌కతా మరో వికెట్‌ కోల్పోయింది. షెల్డన్‌ జాక్సన్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి నటరాజన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు.

  • 15 Apr 2022 08:29 PM (IST)

    తగ్గిన కోల్‌కతా రన్‌రేట్‌..

    సన్‌రైజర్స్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తుండడంతో కోల్‌కతా రన్‌రేట్ నెమ్మదించింది. నాలుగు వికెట్లు కోల్పోయిన కోల్‌కతా 11 ఓవర్లు ముగిసే సమయానికి 75 పరుగుల వద్ద కొనసాగుతోంది.

  • 15 Apr 2022 08:26 PM (IST)

    కష్టాల్లోకి జారుకుంటోన్న కోల్‌కతా..

    కోల్‌కతా మరో వికెట్‌ను కోల్పోయింది. జట్టు స్కోరును పెంచడానికి ప్రయత్నిస్తున్న శ్రేయస్‌ అయ్యర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. దీంతో కోల్‌కతా 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.

  • 15 Apr 2022 07:57 PM (IST)

    మరో వికెట్‌..

    సన్‌రైజర్స్‌ దాటికి కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ వరుసగా క్యూ కడుతున్నారు. నటరాజన్‌ మరో వికెట్‌ను పడగొట్టాడు. నటరాజన్‌ బౌలింగ్‌లో శశాంక్‌ సింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి సునిల్‌ నరైన్‌ పెవిలియన్‌ బాట పట్టాడు.

  • 15 Apr 2022 07:52 PM (IST)

    రెండో వికెట్‌ కోల్పోయిన కోల్‌కతా..

    కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మరో వికెట్‌ కోల్పోయింది. వెంకటేష్‌ అయ్యర్‌ కేవలం 6 పరుగలు చేసి నటరాజన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. ప్రస్తుతం కోల్‌కతా స్కోర్‌ 25 పరుగుల వద్ద కొనసాగుతోంది.

  • 15 Apr 2022 07:41 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కతా..

    కోల్‌కతా తొలి వికెట్‌ కోల్పోయింది. రెండో ఓవర్‌లోనే కేకేఆర్‌ వికెట్ల పతనం ప్రారంభమైంది. ఆరోన్‌ ఫించ్‌ కేవలం 7 పరుగుల వద్ద వెనుదిరిగాడు. మార్కో జాన్సెన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. ప్రస్తుతం కోల్‌కతా జట్టు స్కోరు 2 ఓవర్లు ముగిసే సమయానికి 12 పరుగుల వద్ద కొనసాగుతోంది. క్రీజులో వెంకటేష్‌ అయ్యర్‌ (1), శ్రేయస్‌ అయ్యర్‌ (2) వద్ద ఉన్నారు.

  • 15 Apr 2022 07:12 PM (IST)

    ఇరు జట్ల ప్లేయర్లు..

    కోల్‌కతా ప్లేయింగ్ XI: వెంకటేష్ అయ్యర్, ఆరోన్ ఫించ్, శ్రేయాస్ అయ్యర్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, షెల్డన్ జాక్సన్, పాట్ కమిన్స్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అమాన్‌ హకీమ్‌.

    హైదరాబాద్‌కు ప్రాబబుల్ ప్లేయింగ్ XI: అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్,భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్.

  • 15 Apr 2022 07:03 PM (IST)

    టాస్‌ గెలిచిన హైదరాబాద్‌..

    సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్ చేయడానికి ఎంచుకుంది. మరి హైదరాబాద్‌ కెప్టెన్‌ తీసుకున్న ఈ నిర్ణయం జట్టుకు ఏమేర కలిసొస్తుందో చూడాలి.

  • 15 Apr 2022 06:58 PM (IST)

    పాయింట్ల పట్టికలో ఎవరెక్కడ ఉన్నారంటే..

    KKR ఈ లీగ్‌లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడింది, ఇందులో మూడు విజయాలు, రెండు ఓటమిలతో 6 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా. హైదరాబాద్‌ 4 మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలతో నాలుగు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది.

Published On - Apr 15,2022 6:46 PM

Follow us