Asia Cup: శ్రీలంకలో ఆసియా కప్ జరిగేనా.. వచ్చే నెలలో తుది నిర్ణయం తీసుకుంటామన్న జైషా..

శ్రీలంక(Sri Lanka)లో ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోంది. దేశంలో ఆహారం కొరతతో సాధారణ జీవితం తీవ్రంగా ప్రభావితమైంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ క్రికెట్ మ్యాచ్‌లు లేదా టోర్నమెంట్‌లు నిర్వహించడం కష్టమే..

Asia Cup: శ్రీలంకలో ఆసియా కప్ జరిగేనా.. వచ్చే నెలలో తుది నిర్ణయం తీసుకుంటామన్న జైషా..
Asian Cricket Council
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Apr 16, 2022 | 6:30 AM

శ్రీలంక(Sri Lanka)లో ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోంది. దేశంలో ఆహారం కొరతతో సాధారణ జీవితం తీవ్రంగా ప్రభావితమైంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ క్రికెట్ మ్యాచ్‌లు లేదా టోర్నమెంట్‌లు నిర్వహించడం కష్టమే.. అయితే ఈ ఏడాది శ్రీలంకలో ఆసియా కప్(Asia Cup) 2022 నిర్వహించాల్సి ఉంది. కానీ అక్కడి పరిస్థితులు చూస్తే ఈ టోర్నమెంట్‌ జరిగేలా కనిపించడం లేదు. అయితే ఈ ఆసియా కప్‌ను భారత్‌ తరలించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై వచ్చే నెలలో తుది నిర్ణయం తీసుకుంటామని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) కార్యదర్శి జై షా(Jay Shah) చెప్పారు.

జై షా ప్రస్తుతం ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. శ్రీలంకలోని ప్రస్తుత పరిస్థితిలో ఆసియా కప్‌ నిర్వహిస్తారా లేదా అనేది ఉత్కంఠ నెలకొంది. వచ్చే నెలలో శ్రీలంక బోర్డు అధికారులను కలుస్తానని, ఆ తర్వాతే ఆసియా కప్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటామని ANI వార్తా సంస్థకు ఇచ్చిన సమాధానంలో షా చెప్పారు. గత నెలలో జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో శ్రీలంకలో ఆసియా కప్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకున్నారు. అయితే కొన్ని వారాల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టోర్నమెంట్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీనిపై ANIతో మాట్లాడిన జయ్ షా, ” మే 29 న జరిగే ఐపీఎల్ ఫైనల్‌లో శ్రీలంక క్రికెట్ అధికారులను కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు.

Read Also.. IPL 2022: ఐపీఎల్‌ 2022లో కరోనా కలకలం.. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఫిజియోకు పాజిటివ్..