AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kadapa: శిల్పా ఏమన్నా స్కెచ్ వేశావా..? భర్త మహా జాతకుడు బతికిపోయిండు..

పెళ్ళై 15 ఏళ్లు గడిచినా ప్రియుడి మోజులో పడి ఓ ఇల్లాలు తన భర్త హత్యకు ప్లాన్ వేసింది. రౌడీషీటర్‌తో చేతులు కలిపి కిరాయి ముఠాను మాట్లాడి సుపారి కూడా ఇచ్చింది .. తీరా ప్లాన్ బయటికి పొక్కడంతో పోలీసులు ఆ హత్య ప్లాన్‌ను భగ్నం చేశారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తే ప్లాన్ మొత్తం పూసగుచ్చినట్టు చెప్పిందట.

Kadapa: శిల్పా ఏమన్నా స్కెచ్ వేశావా..? భర్త మహా జాతకుడు బతికిపోయిండు..
Shilpa Reddy - Naga Sudhir
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Apr 24, 2026 | 12:23 PM

Share

కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం లింగాపురం గ్రామానికి చెందిన ఈశ్వరరెడ్డి–శిల్పారెడ్డి దంపతులు 15 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. అయితే గత కొంతకాలంగా వీరి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న నాగ సుధీర్ అనే యువకుడితో శిల్పారెడ్డికి పరిచయం ఏర్పడి, అది క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది. సంబంధం మరింత గాఢం కావడంతో భర్త ఈశ్వరరెడ్డిని హత్య చేయాలని ఇద్దరూ కలిసి కుట్ర పన్నారు. ఈ హత్యకు ప్రొద్దుటూరు రాజుపాలెంకు చెందిన స్థానిక నేత భూమిరెడ్డి సూర్య ప్రతాపరెడ్డి అనుచరుడు, రౌడీషీటర్ వినయ్ సహకారం తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్లాన్ ప్రకారం, శిల్పారెడ్డి తన వద్ద ఉన్న 14 తులాల బంగారాన్ని ప్రియుడు నాగ సుధీర్‌కు ఇచ్చి, దానిలో కొంత అమ్మి, కొంత కుదవ పెట్టి సుమారు రూ.10 లక్షలు సమకూర్చి సుపారీ ఇచ్చినట్లు సమాచారం.

ఆ తరువాత వినయ్ ద్వారా హిందూపురానికి చెందిన కిరాయి ముఠాకు ఈ హత్య బాధ్యత అప్పగించారు. ప్రొద్దుటూరుకు చేరుకున్న ముఠా హత్యకు రెండు విధాలుగా ప్లాన్ సిద్ధం చేసింది. ఒకటి కారుతో ఢీ కొట్టి, కత్తులతో దాడి చేయడం.. అది సాధ్యంకాకపోతే పొలంలో పని చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేయడం. ఈ క్రమంలో ఈశ్వరరెడ్డి బైక్‌పై వెళ్తుండగా కారుతో ఢీకొట్టి హత్యాయత్నం చేశారు. అయితే అప్రమత్తంగా వ్యవహరించిన ఈశ్వరరెడ్డి అక్కడి నుంచి తప్పించుకుని ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించాడు.

దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు హత్యాయత్నాన్ని భగ్నం చేశారు. గురువారం మొత్తం 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో శిల్పారెడ్డి, ఆమె ప్రియుడు నాగ సుధీర్, రౌడీషీటర్ వినయ్‌తో పాటు హిందూపురానికి చెందిన కిరాయి హంతకులు కూడా ఉన్నారు. ప్రస్తుతం వారిని పోలీసులు విచారిస్తున్నారు.

అప్పు వెంటనే కట్టాలని వేధిస్తున్నారా..? ఈ ఒక్కటి చేస్తే మీ జోలికి అస్సలు రారు..

Follow Us