AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: పద్దతైన తెలుగింటి మహిళ అనుకునేరు.. పెద్ద నంగనాశి..

బాగా మద్యం తాగి అతను చెరువులో పడి చనిపోయాడని పోలీసులు భావించారు. డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ విషయంలో కూడా స్పష్టత లేకపోవడంతో... పోలీసుల కూడా కేసును పెద్దగా పట్టించుకోలేదు. కానీ మృతుడి కుటుంబ సభ్యులు మరణంపై అనుమానం వ్యక్తం చేయడంతో రీ ఇన్వెస్టిగేషన్ చేయగా సంచలన నిజాలు వెలుగుచూశాయి.

Andhra: పద్దతైన తెలుగింటి మహిళ అనుకునేరు.. పెద్ద నంగనాశి..
Yamuna
Nalluri Naresh
| Edited By: |

Updated on: Jun 02, 2025 | 7:26 PM

Share

ఏడాది క్రితం జరిగిన హత్య మిస్టరీ ఇప్పుడు వీడింది. ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఓ భార్య. భర్తకు మద్యం తాగించి ప్రియుడుతో కలిసి గొంతుకు టవల్ బిగించి హత్య చేసింది భార్య. మొదట సాధారణ మరణంగానే భావించిన పోలీసులు… చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో లోతైన దర్యాప్తు చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భర్తను హత్య చేయించిన భార్య, ఆమె ప్రియుడు ఇంకా పరారీలోనే ఉన్నారు. కాకపోతే హత్య చేసిన వారిలో ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ధర్మవరంలో సంచలనం సృష్టించిన మంజునాథ హత్య కేసును సంవత్సరం తర్వాత పోలీసులు చేధించారు.

ధర్మవరం మండలం పోతుకుంట గ్రామానికి చెందిన మంజునాథ్‌కు, రామగిరి మండలం పోతేపల్లికి చెందిన యమునతో 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన కొద్ది సంవత్సరాలు బాగానే ఉన్న భార్యాభర్తలిద్దరి మధ్య…. గొడవలు మొదలయ్యాయి. భార్యాభర్తలు తరచూ గొడవ పడడంతో… భార్య యమున సిద్ధప్ప అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్న భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకుంది భార్య యమున. దీంతో ప్రియుడు సిద్ధప్పతో భర్త మర్డర్‌కు స్కెచ్ వేసింది. ప్లాన్‌లో భాగంగా ఏడాది క్రితం భర్త మంజునాథకు భార్య యమున అతిగా మద్యం తాగించింది. అప్పుడు ప్రియుడ్ని పిలిచింది. మత్తులో ఉన్న భర్త మంజునాథ మెడకు టవల్ బిగించి సిద్ధప్ప హత్య చేశాడు. ఆపై డెడ్‌బాడీని మరికొందరితో దగ్గర్లో ఉన్న చెరువులో పడేశారు. దీంతో అప్పట్లో మంజునాథ డెడ్ బాడీని చెరువులో గుర్తించిన పోలీసులు… ఫుల్లుగా మద్యం తాగి… చెరువులో పడి చనిపోయినట్లుగా కేసు నమోదు చేశారు.

Manjunath Yamuna

Manjunath – Yamuna

అయితే మంజునాథ్ మరణంపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. అదే విధంగా భార్య యమున వ్యవహార తీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ… మంజునాథ్ మరణంపై మరోసారి విచారణ జరపాలని కోరారు. దీంతో ధర్మవరం పోలీసులు మరోసారి కేసులో లోతైన దర్యాప్తు ప్రారంభించారు. హత్య జరిగిన రోజు  యమున, ఆమె ప్రియుడు సిద్ధప్పతో పాటు మరో నలుగురు వ్యక్తులు ఒకే చోట ఉన్నట్లు పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా గుర్తించారు. దీనికి తోడు భర్త మంజునాథ్ మరణం తర్వాత… భార్య యమున అదే విధంగా ప్రియుడు సిద్ధప్ప పరారీలో ఉండడంతో… పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. మంజునాథ్ మరణం సాధారణ మరణం కాదని… హత్య చేసి మంజునాధుని చంపినట్లు రీ-పోస్టుమార్టం ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. దీంతో కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలక మంజునాథను హత్య చేసిన అనంతరం డెడ్ బాడీ మాయం చేయడానికి సహకరించిన ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని… అసలు విషయం రాబట్టారు. యమున, సిద్ధప్ప కలిసి… భర్త మంజునాధుని హత్య చేసినట్లు పోలీసులకు పట్టుబడ్డ నిందితులు ఒప్పుకున్నారు. దీంతో ఏడాది క్రితం హత్యకు గురైన మంజునాథ్ డెత్ మిస్టరీ వీడింది. కాకపోతే ఇప్పటికీ యమున, సిద్ధప్పతో పాటు మరో వ్యక్తి పరారీలోనే ఉన్నారు. వారి కోసం గాలింపు కొనసాగుతోంది.

కేసు గురించి పోలీసులు చెప్పిన వివరాలు దిగువన చూడండి… 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి