AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ration Cards: రేషన్‌కార్డుదారులకు మరో శుభవార్త.. జనవరి 1 నుంచి అవి కూడా ఉచితంగా పంపిణీ..

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ సరుకుల్లో మరో రెండింటిని కూడా ఉచితంగా సరఫరా చేసేందుకు సిద్దమైంది. రేషన్‌కార్డు‌దారులకు గోధుమలు, రాగులు కూడా ఉచితంగా ఇవ్వనుంది ఈ విషయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం ప్రకటించారు. ఎప్పటినుంచంటే ఇవ్వనున్నారంటే..

Ration Cards: రేషన్‌కార్డుదారులకు మరో శుభవార్త.. జనవరి 1 నుంచి అవి కూడా ఉచితంగా పంపిణీ..
Venkatrao Lella
|

Updated on: Dec 08, 2025 | 6:31 PM

Share

Nadendla Manohar: ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త అందించారు. జనవరి 1 నుంచి రాగులు, గోధుమ పిండి ఉచితంగా పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఇక పీడీఎస్ బియ్యానికి సైతం క్యూఆర్ కోడ్ అమర్చేలా జనవరి నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇవాళ ఢిల్లీలో కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ కలిశారు. ధాన్యం కొనుగోళ్లతో పాటు గోధుములు, రాగులు సరఫరాపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నాదెండ్ల మనోహర్.. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, రైతులు దళారులకు ధాన్యం అమ్ముకోవద్దని సూచించారు.

గోధుములు, రాగులు కేటాయింపు

“జనవరి నుంచి గోధుమలు, రాగులను అదనంగా కేటాయించడానికి కేంద్రమంత్రి అంగీకరించారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర తీరప్రాంత జిల్లాల్లో ఆగస్టు 2025 నుండి రాగి పంపిణీని ప్రారంభించింది, 16,000 మెట్రిక్ టన్నుల రాగి, పీడీఎస్ పంపిణీ కింద ఉంది. జనవరి 1 నుంచి రాగులు, గోధుములు అందిస్తాం. మధ్యాహ్న భోజన పథకం కింద రైతులు, మిల్లర్లు, గోడౌన్ల నుండి వివరాలను పూర్తిగా వీక్షించడానికి వీలు కల్పించే QR కోడ్ ఆధారిత బ్యాగ్ ట్రాకింగ్ వ్యవస్థను అమలు చేసిన దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ప్రతి బ్యాగ్‌ను ట్రేస్ చేయగలుతున్నాం. కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అందించాం అరటితో పాటు కొన్ని పంటల విషయంలో అనుకోని విధంగా దిగుబడి వచ్చింది. అనేక అంశాల పై సీఎం మంత్రులతో ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు పొగాకు, మామిడి, పత్తి విషయంలో రైతులను ప్రభుత్వం ఆదుకుంది ..రాబోయే రోజుల్లో సంస్కరణలు తీసుకొస్తాము. పెట్టుబడుల కోసం అనేక సందర్భాలలో మాట్లాడినప్పుడు ల్యాండ్ చూపించాల్సిన అవసరం ఉంది. పెట్టుబడులు పెట్టే వారికి భూ కేటాయింపులు చేయాలి . అవసరాన్ని బట్టి అమరావతిలో భూసేకరణ చేస్తున్నాం” అని మనోహర్ తెలిపారు.

24 గంటల్లోనే రైతుల అకౌంట్లోకి డబ్బులు

2025-26 ఖరీఫ్ సీజన్‌కు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు 51 లక్షల మెట్రిక్ టన్నుల వరి లక్ష్యాన్ని కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ 25 రోజుల్లో 2.69 లక్షల మంది రైతుల నుండి 17.37 లక్షల మెట్రిక్ టన్నుల వరిని కొనుగోలు చేసింది. రోజువారీ సేకరణలో 90,000 మెట్రిక్ టన్నులకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో సంతోషం నింపే విధంగా రెవిన్యూ,వ్యవసాయ శాఖతో కలిసి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. రైతుల ఖాతాల్లో 24 గంటల్లో డబ్బులు జమ చేశాం. 7 కోట్ల 87లక్షల గోనే సంచులు సిద్ధం చేసి రైతులకు అందించాం. గత 15 రోజుల్లో రాష్ట్రం ఇప్పటికే 96,000 మెట్రిక్ టన్నుల 10% బ్రోకెన్ రైస్‌ను డెలివరీ చేసింది .అన్ని రైస్ మిల్లులు డెలివరీ సమయాలను చేరుకోవడానికి పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. CMRని సకాలంలో స్థిరంగా పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసించారు. CMR డెలివరీలను సులభతరం చేయడానికి తగిన సౌకర్యాలను నియమించడం ద్వారా FCI నుండి అదనంగా నిలవలను ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చారు అని మనోహర్” పేర్కొన్నారు.