AP Politics: ఏపీలో పొత్తులు కుదరవా.? పార్టీలను అదే భయం వెంటాడుతోందా.?
పదేళ్లు అధికారం ఇవ్వాలని పవన్ కల్యాణ్, వచ్చే ఎన్నికల్లో 175 సీట్లూ గెలవాలని చంద్రబాబు నాయుడు ఏపీలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరి 175 సీట్లు టీడీపీ గెలిస్తే జనసేన సంగతేంటి? రెండు పార్టీల మధ్య పొత్తు లేనట్టేనా? పొత్తుల ప్రచారం లాభం కంటే కీడు ఎక్కువ చేస్తోందనే భయం రెండు పార్టీలకు పట్టుకుందా? వచ్చే ఎన్నికల్లో ఎవరి దారి వారిదేనా? రోజు తెల్లారుతూనే ఉంది..

పదేళ్లు అధికారం ఇవ్వాలని పవన్ కల్యాణ్, వచ్చే ఎన్నికల్లో 175 సీట్లూ గెలవాలని చంద్రబాబు నాయుడు ఏపీలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరి 175 సీట్లు టీడీపీ గెలిస్తే జనసేన సంగతేంటి? రెండు పార్టీల మధ్య పొత్తు లేనట్టేనా? పొత్తుల ప్రచారం లాభం కంటే కీడు ఎక్కువ చేస్తోందనే భయం రెండు పార్టీలకు పట్టుకుందా? వచ్చే ఎన్నికల్లో ఎవరి దారి వారిదేనా? రోజు తెల్లారుతూనే ఉంది, సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు కాని, ఏపీలో విపక్షాల మధ్య పొత్తు మాత్రం పొడవటం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామనే మాటలు వినిపిస్తున్నా, ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలకు ముందడుగు పడటం లేదు. తాజా పరిణామాలు చూస్తుంటే టీడీపీ, జనసేన ప్రయాణం ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా కనిపిస్తోంది.
ఏది ఏమైనా 2024 ఎన్నికల్లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని టీడీపీ, జనసేన తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఘోర పరాజయాన్ని చవిచూసిన టీడీపీ మరోసారి ఆ తప్పు చేసేందుకు సిద్ధంగా లేదన్నది వాస్తవం. అందుకోసమే బలమైన ఓటు బ్యాంకు ఉన్న పవన్ కల్యాణ్ పార్టీకి స్నేహహస్తాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ విషయంలో టీడీపీ, జనసేన రెండు పార్టీలది ఒకే వైఖరి కనిపిస్తోంది. రోడ్లు, రాజధాని, రైతుల సమస్యలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై చంద్రబాబు మాటలే పవన్ కూడా చాలాసార్లు వల్లెవేశారు. సీఎం జగన్‌పై వ్యతిరేకంగా ఉన్న పవన్ తమతో కలిస్తే అధికారం ఖాయమని చంద్రబాబు భావించారు. ఆ దిశగా పావులు కూడా కదిపారు. అయితే ఇప్పుడు ఆయన వైఖరిలో మార్పు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాలు మనమే గెలవాలని కార్యకర్తలకు ఉద్బోధించడం చూస్తుంటే పొత్తులకు ఇక దూరంగా ఉండటమే బెటరనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే అటు పవన్ తీరులోనూ మార్పు కనిపిస్తోంది. మూడు నెలల క్రితం వరకు పవన్ కల్యాణ్ సీఎం పదవికి తనకు అర్హత లేదని మాట్లాడారు. వారాహి యాత్ర సమయానికి మాత్రం పవన్ కల్యాణ్ వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. టీడీపీతో పొత్తు ఉండదనే విధంగా జనసేనకు అధికారం ఇవ్వండంటూ కోరుతున్నారు. అందుకోసం ఉభయగోదావరి జిల్లాల నుంచి శ్రీకారం చుడుతున్నానని ప్రకటించారు. మొత్తానికి తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే పొత్తుల చర్చలు, మాటలు మేలు కంటే కీడే ఎక్కువ చేస్తున్నాయనే భావన టీడీపీలోనే కాదు జనసేనలోనూ కనిపిస్తోంది. కాని, రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు కదా, ఎన్నికల వచ్చేలోపు ఏమైనా జరగొచ్చు.
ఏపీలో పొత్తుల అంశంపై టీవీ9 నిర్వహించిన వీకెండ్ అవర్ విత్ మురళీ కృష్ణ లైవ్ వీడియో..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
