AP Weather: ఆహా.. ఇది కదా కూల్ న్యూస్ అంటే.. ఈ ప్రాంతాల్లో వర్షాలు
ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖ, శ్రీకాకుళం, కాకినాడ, విజయనగరం, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం, ఏలూరు, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇదిగో వెదర్ రిపోర్ట్...
ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో దక్షిణి మరియు నైరుతి గాలులు వీస్తున్నాయి. రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం…
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
శనివారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. భారీవర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది . ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు (గంటకు 30 -40 కి మీ వేగం తో )వీచే అవకాశం ఉంది.
ఆదివారం :-తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో )వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
శనివారం, ఆదివారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు (గంటకు 30 -40 కి మీ వేగం తో )వీచే అవకాశం ఉంది.
సోమవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో )వీచే అవకాశం ఉంది.
రాయలసీమ :-
శనివారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఆదివారం, సోమవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు (గంటకు 30 -40 కి మీ వేగం తో )వీచే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..