Weather Forecast: తెలుగు రాష్ట్రాలకు నాలుగు రోజుల డేంజర్‌ అలర్ట్‌.. రాళ్లవాన ఖాయమని వార్నింగ్‌..

తెలుగు స్టేట్స్‌కి హైఅలర్ట్‌, అప్రమత్తంగా లేకపోతే మళ్లీ కొంపకొల్లేరైపోవడం ఖాయం. అవును, మీరు వింటున్నది నిజమే. ఏపీ, తెలంగాణకు మరోసారి డేంజర్‌ వార్నింగ్‌ ఇచ్చింది వాతావరణ శాఖ. మరో నాలుగు రోజులపాటు వర్షాలు దంచికొట్టడం ఖాయమని హెచ్చరించింది. తెలంగాణకైతే ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది ఐఎండీ.

Weather Forecast: తెలుగు రాష్ట్రాలకు నాలుగు రోజుల డేంజర్‌ అలర్ట్‌.. రాళ్లవాన ఖాయమని వార్నింగ్‌..
Ice Rain Ap And Telangana
Follow us

|

Updated on: Apr 01, 2023 | 5:23 AM

తెలుగు స్టేట్స్‌కి హైఅలర్ట్‌, అప్రమత్తంగా లేకపోతే మళ్లీ కొంపకొల్లేరైపోవడం ఖాయం. అవును, మీరు వింటున్నది నిజమే. ఏపీ, తెలంగాణకు మరోసారి డేంజర్‌ వార్నింగ్‌ ఇచ్చింది వాతావరణ శాఖ. మరో నాలుగు రోజులపాటు వర్షాలు దంచికొట్టడం ఖాయమని హెచ్చరించింది. తెలంగాణకైతే ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది ఐఎండీ. మళ్లీ రాళ్లవాన దంచికొట్టడం ఖాయమంటూ హెచ్చరించింది.

తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం..

మండుటెండల్లో అకాల వర్షాలు వణికిస్తున్నాయ్‌. రీసెంట్‌గా కురిసిన రాళ్ల వానకు రెండు రాష్ట్రాల్లోనూ పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయ్‌. ఇప్పుడు మరోసారి వడగళ్లు విధ్వంసం సృష్టించడం ఖాయమంటూ డేంజర్‌ అలర్ట్‌ ఇచ్చింది వాతావరణశాఖ. నాలుగురోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటోంది ఐఎండీ. ఉన్నట్టుండి క్యుములోనింబస్‌ మేఘాలు విరుచుకుపడే అవకాశముందని హెచ్చరించింది. పెనుగాలులు, వడగళ్ల వానతోపాటు పిడుగులు పడేఛాన్స్‌ ఉందంటోంది వెదర్ డిపార్ట్‌మెంట్‌.

మరోసారి రాళ్ల వాన అలర్ట్‌..

ఇక, తెలంగాణలో వడగళ్ల విధ్వంసం కొనసాగుతోంది. ఉన్నట్టుండి కురిసిన రాళ్ల వానకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మరోసారి పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయ్‌. ములుగు జిల్లాలో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. గాలివాన దెబ్బకు వెంకటాపురం మండలంలో భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయ్‌. ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఇవి కూడా చదవండి

గాలివానకు ఖమ్మం జిల్లాలోనూ పెద్దఎత్తున పంటనష్టం జరిగింది. వైరా, పెనుబల్లి, సత్తుపల్లిలో కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసిపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు రైతులు. హైవేపై చెట్లు విరిగిపడటంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ వర్షం దంచికొట్టింది. భద్రాచలంలో ఉరుములు మెరుపులతో గాలివాన బీభత్సం సృష్టించింది. లక్ష్మీనర్సింహస్వామి ఆలయంపై పిడుగుపటడంతో ధ్వజస్తంభం దెబ్బతింది. ఆ టైమ్‌లో భక్తులెవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పినట్టయ్యింది.

ఆంధ్రప్రదేశ్‌లో అనేకచోట్ల వడగళ్ల వాన కురిసింది. అల్లూరి జిల్లా అరకు లోయలో వరుణుడు చితక్కొట్టుడు కొట్టాడు. అనంతగిరి మండలంలో దాదాపు గంటపాటు కుంతపోత పోసింది. పాడేరులోనూ వర్షం దంచికొట్టింది. ఏజెన్సీలో కురిసిన వర్షానికి గిరిజనం పులకించింది.

తెలంగాణకు ఎల్లో వార్నింగ్‌ ఇచ్చింది హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం. ఇవాళ్టి నుంచి నాలుగు రోజులపాటు ఉరుములు మెరుపులతో వడగళ్ల వాన కురిసే అవకాశముందని హెచ్చరించింది. పిడుగులు పడే అవకాశమున్నందున ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించింది.

మరిన్ని వాతావరణ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..