Andhra Pradesh: ఏపీకి రెయిన్‌ అలెర్ట్‌.. అక్కడ మోస్తరు వర్షాలు.. రాబోయే మూడు రోజుల పూర్తి వెదర్‌ రిపోర్ట్‌ ఇదిగో..

వరుణుడు తెలుగు రాష్ట్రాలను వీడనంటున్నాడు. మరో మూడు రోజుల పాటు తన ప్రభావం చూపిస్తానంటున్నాడు. కొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు.. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడతాయి.

Andhra Pradesh: ఏపీకి రెయిన్‌ అలెర్ట్‌.. అక్కడ మోస్తరు వర్షాలు.. రాబోయే మూడు రోజుల పూర్తి వెదర్‌ రిపోర్ట్‌ ఇదిగో..
Ap Rain Alert
Follow us
Basha Shek

|

Updated on: Mar 29, 2023 | 3:35 PM

వరుణుడు తెలుగు రాష్ట్రాలను వీడనంటున్నాడు. మరో మూడు రోజుల పాటు తన ప్రభావం చూపిస్తానంటున్నాడు. కొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు.. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. ఈ మేరకు రాబోయే మూడు రోజులకు సంబంధించి అమరావతి వాతావరణ విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉపరితల ద్రోణి, అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం ద్రోణి ఉత్తర మధ్యప్రదేశ్‌లోని మధ్య ప్రాంతాల నుండి దక్షిణ తమిళనాడు గుండా విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ.ఎత్తులో కొనసాగుతున్నది. అలాగే ఆంధ్ర ప్రదేశ్, యానాం లలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ / నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు కలగవచ్చని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.

రాబోయే మూడు రోజులకు వాతావరణ సూచనలు ఇవే:

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:

ఇవి కూడా చదవండి

బుధవావరం

ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. అలాగే బలమైన గాలులు (గంటకు 30 -40 కి మీ వేగం తో)వీచే అవకాశం ఉంది.

గురువారం, శుక్రవారం

తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశంఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:

బుధ, గురు, శుక్రవారం:

వాతావరణం పొడిగా వుండే అవకాశం ఉంది.

రాయలసీమ:

బుధ, గురు, శుక్రవారం:

తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం.. క్లిక్ చేయండి..