AP Weather: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు

ఆంధ్రాపై తుఫాన్ ప్రభావం ఉండదని వాతావరణ శాఖ తెలిపింది. కానీ చాలా ప్రాంతాల్లో చెదరుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

AP Weather: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు
Andhra Weather Report
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 23, 2022 | 1:38 PM

ఆదివారం( అక్టోబర్, 23) రోజున  దేశంలోని మిగిలిన ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాలు ఉపసంహరించుకున్నాయి. శనివారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గంటకు 20 కి .మీ వేగంతో వాయువ్య దిశగా ప్రయాణించింది. ఇది ఆదివారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు పశ్చిమ మధ్య & ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం మీదగా.. దాదాపు పోర్ట్ బ్లెయిర్‌కు వాయువ్యంగా 640 కి.మీ, సాగర్ ద్వీపానికి దక్షిణాన 670 కి.మీ,  బారిసాల్‌(బంగ్లాదేశ్)కు దక్షిణ – నైరుతి దిశలో 820 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీవ్ర వాయుగుండం వచ్చే 12 గంటల్లో వాయువ్య దిశగా కదిలి మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ తర్వాత, వంపు తిరిగి ఉత్తర- ఈశాన్యం వైపు కదిలి అక్టోబరు 25 తేదీ ఉదయానికి  టింకోనా ద్వీపం, శాండ్‌విప్ మధ్య బారిసల్‌ దగ్గర తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

దీని ప్రభావంతో ఆదివారం నుంచి మూడురోజుల పాటు.. ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల వెంబడి మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే చాన్సులు ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. అంతేగాక ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఉత్తర, ఈశాన్య గాలులు వీస్తున్నాయి .

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :– ————————————————–

ఈరోజు:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా చోట్ల కురిసే అవకాశముంది.

రేపు, ఎల్లుండి :- వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :- ———————————-

ఈరోజు:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా చోట్ల కురిసే అవకాశముంది.

రేపు, ఎల్లుండి :- వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది.

రాయలసీమ :- ——————-

ఈరోజు:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా చోట్ల కురిసే అవకాశముంది.

రేపు, ఎల్లుండి :- వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..