Vijayawada: విజయవాడ ఫైర్ ఇన్సిడెంట్‌లో అడుగడుగునా నిర్లక్ష్యం.. నిబంధనలు గాలికి వదిలి
పండుగ వేళ బెజవాడలో విషాదం చోటుచేసుకుంది. బాణసంచా విక్రయ షాపుల్లో మంటలు చెలరేగి ఇద్దరు సజీవ దహనం అయ్యారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిర్లక్ష్యం.. అంతకుమించిన అజాగ్రత్త అమాయకుల బతుకుల్ని బుగ్గిపాల్జేసింది. పండుగ పూట పెను విషాదాన్ని నింపింది. దీపావళి వేళ జరిగిన ఈ ఘోరం కడుపుకోతను మిగిల్చింది. విజయవాడ ఫైర్ ఇన్సిడెంట్‌లో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నిప్పుతో చెలగాటం. అది కూడా టపాసులు అమ్మేచోట చోట.. ఇది చాలదా బీభత్సం జరిగిపోవడానికి. విజయవాడలో ఇవాళ ఉదయాన్నే జరిగిన అగ్నిప్రమాదం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. గాంధీనగర్‌లోని జింంఖానా గ్రౌండ్స్‌లో 19 స్టాళ్లను ఏర్పాటు చేసుకుని బాణాసంచా విక్రయిస్తున్నారు వ్యాపారులు. ఉన్నట్టుండి ఓ షాప్‌లో చెలరేగిన మంటలు క్షణాల్లోనే పక్క వాటికి వ్యాపించాయి. మొత్తం 3 షాపులు మంటల్లో తగలబడిపోయాయి. ఇద్దరు సజీవ దహనం అయిపోయారు.
మృతులు విజయవాడకు చెందిన కాశీ, పిడుగురాళ్లకు చెందిన సాంబగా గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు సీపీ. బాధ్యులపై కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఫైర్ యాక్సిడెంట్‌కు వైసీపీ నేతలే బాధ్యత వహించాలంటోంది సీపీఎం. ఒక్కో షాపునకు రెండు లక్షల డబ్బులు తీసుకొని పర్మిషన్ ఇచ్చారని ఆరోపిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలకు సవాలక్ష ఆంక్షలు పెట్టే అధికారులు.. క్రాకర్ షాప్స్‌కు ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఫైర్ ఇన్సిడెంట్ నేపథ్యంలో అలర్ట్ అయ్యింది వైద్యశాఖ. ప్రమాద బాధితులకు ట్రీట్‌మెంట్ అందించేందుకు ప్రత్యేకంగా వైద్యుల్ని అందుబాటులో ఉంచారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..