Viral Video: ఉద్యోగాలిస్తామంటూ నిరుద్యోగులకు కుచ్చుటోపి.. లక్షల్లో డబ్బు వసూలు చేసి పరార్!
విశాఖపట్నంలో ఉద్యోగాల పేరుతో ఓ కంపెనీ బడా మోసానికి పాల్పడింది. వారుష్ టెక్నాలజీస్ అనే సంస్థ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను నిండా ముంచింది. ఒక్కొక్కరి నుంచి ఏకంగా రూ. లక్ష చొప్పున వసూలు చేసిన కంపెనీ యాజమన్యం.. ఆ తర్వాత మొండి చేయి చూపింది. తాము ఇవ్వబోయే ఉద్యోగాలకు..

విశాఖపట్నం, నవంబర్ 18: విశాఖపట్నంలో ఉద్యోగాల పేరుతో ఓ కంపెనీ బడా మోసానికి పాల్పడింది. వారుష్ టెక్నాలజీస్ అనే సంస్థ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను నిండా ముంచింది. ఒక్కొక్కరి నుంచి ఏకంగా రూ. లక్ష చొప్పున వసూలు చేసిన కంపెనీ యాజమన్యం.. ఆ తర్వాత మొండి చేయి చూపింది. తాము ఇవ్వబోయే ఉద్యోగాలకు మొదటి మూడు నెలలు రూ.15, 000 ఆ తర్వాత రూ.31 వేల జీతం ఇస్తామని పెద్ద సంఖ్యలో నిరుద్యోగులను నమ్మించి ట్రాప్ చేశారు. అంతేకాకుండా ఉద్యోగం కోసం అపాయింట్మెంట్ లెటర్లు సైతం నిరుద్యోగులకు జారీ చేసింది.
కోటి ఆశలతో ఉద్యోగంలో చేరిన సదరు యువతీ యవకులు నెలలు గడుస్తున్నా జీతాలు మాత్రం ఇవ్వలేదు. ఇదేంటని నిలదీయడంతో అసలుకే ఇవ్వకుండా యజమాని సాయికుమార్ ముఖం చాటేశాడు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పీఎం పాలెం పోలీసులు వారుష్ టెక్నాలజీస్ యజమాని సాయికుమార్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వెళ్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




