AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madugula halwa: తొలి రాత్రి కోసం ప్రత్యేకంగా తెప్పించుకునే స్వీట్ ఇది.. దీన్ని తింటే..?

విశాఖ జిల్లా మాడుగుల ప్రాంతం పేరుతోనే ఆ హల్వాకు మాడుగుల హల్వా పేరు వచ్చింది. దీన్ని తయారు చేయడానికి నాలుగు రోజుల సమయం పడుతుంది. ఫస్ట్ నైట్ కోసం ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి ఈ హల్వా చేయించుకుంటారు. ఎందుకంటే ... ?

Madugula halwa: తొలి రాత్రి కోసం ప్రత్యేకంగా తెప్పించుకునే స్వీట్ ఇది.. దీన్ని తింటే..?
Madugula Halwa
Ram Naramaneni
|

Updated on: Nov 18, 2025 | 1:08 PM

Share

మాడుగుల హల్వా అంటే ఓ ప్రత్యేక క్రేజ్. కాలం ఎంత మారినా ఈ స్వీట్‌కి డిమాండ్ తగ్గదు. దాదాపు ఒకటిన్నర శతాబ్దం క్రితమే దీని ప్రయాణం మొదలైంది. నేడు ఏకంగా 20 దేశాలకు ఎగుమతి అవుతున్న హల్వా ఇది. సినిమా సెలబ్రిటీలు, పెద్ద వ్యాపారవేత్తలు, పొలిటికల్ లీడర్స్.. చాలామంది అభిమానించే స్వీట్ ఇది. మాడుగుల గ్రామానికి చెందిన దంగేటి ధర్మారావు 140 ఏళ్ల క్రితం అక్కడే మిఠాయి వ్యాపారం ప్రారంభించారు. మొదట్లో కొబ్బరి, బూడిద గుమ్మడి, ఖర్బూజ హల్వాలు చేసేవారు. పోటీ పెరుగుతుండడంతో కొత్తగా ఏదో తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. అలా పుట్టింది ఈ స్పెషల్ మాడుగుల హల్వా.

ఈ హల్వా తింటే లైంగిక సామర్ధ్యం పెరుగుతుందన్న నమ్మకం ఉండటంతో… ఫస్ట్ నైట్ కోసం ప్రత్యేక ఆర్డర్లు వస్తుంటాయి. బాలింతలకు శక్తి కోసం కూడా ఇస్తారు. కానీ ఈ స్వీట్ తయారు చేయడం మాత్రం అసలు ఈజీ కాదు… పాకం పర్ఫెక్ట్‌గా రావడం చాలా కష్టం. కనీసం 15–20 ఏళ్ల అనుభవం ఉన్నవాళ్లే కళాయి వద్ద పని చేస్తారు.

మాడుగుల హల్వా చేయాలంటే మొత్తం నాలుగు రోజులు పట్టుతుంది. ముందుగా గోధుమలను 3 రోజులు నానబెట్టి రోటిలో రుబ్బి గోధుమ పాలు తీస్తారు. వాటిని ఒక రోజు పులియబెట్టి.. పంచదార, ఆవు నెయ్యి కలిపి ఇనుప కళాయిలో మరిగే వరకు తిప్పుతారు. పాకం రెడీ అయిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు వేసి దింపేస్తారు. ఇక్కడ ప్రధాన విషయం.. కట్టెల పొయ్యి మీదే పాకం వేయాలి. అలా చేసిన హల్వా నెలరోజుల పాటు చెడిపోదు.

ప్రస్తుతం మాడుగుల హల్వా ధర కేజీకి రూ.600 నుంచి రూ.800 వరకు ఉంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మాత్రమే కాదు… విదేశాలకు కూడా బాగా వెళ్తోంది. కల్తీ లేని ఈ హల్వాను మితంగా తింటే శరీరానికి మంచి శక్తి ఇస్తుందని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ఈ హల్వాపైనే నేటికి మాడుగులలో దాదాపు 1500 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..
మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం.. కేవలం వారికి మాత్రమే అనుమతి
మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం.. కేవలం వారికి మాత్రమే అనుమతి
ఒకే మ్యాచ్‌లో 414 పరుగులు..ఢిల్లీ కోటను కూల్చిన సోఫీ
ఒకే మ్యాచ్‌లో 414 పరుగులు..ఢిల్లీ కోటను కూల్చిన సోఫీ
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్
7 వైడ్లు, 4 నోబాల్స్.! పిల్లబచ్చా జట్టుపై 17 బంతులు ఓవర్‌..
7 వైడ్లు, 4 నోబాల్స్.! పిల్లబచ్చా జట్టుపై 17 బంతులు ఓవర్‌..
వడోదరలో విరాట్ విధ్వంసం..సెంచరీ మిస్సైనా రికార్డుల పంచ్ అదిరింది
వడోదరలో విరాట్ విధ్వంసం..సెంచరీ మిస్సైనా రికార్డుల పంచ్ అదిరింది