AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam: ఆ చెట్టుకు బొట్టు పెట్టి.. హారతి పట్టి.. రాఖీ కట్టారు.. ఎందుకో తెలుసా..?

పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే చెట్లను మనిషి అభివృద్ధి పేరిట నరికేస్తున్నారు. అందుకే ప్రకృతి ప్రకోపానికి గురవుతున్నారు. చెట్లు లేకపోతే జరిగే నష్టాన్ని గుర్తించాలని అంటున్నారు విశాఖలో ప్రకృతి ప్రేమికులు. రక్షాబంధన్‌ను వృక్షాబంధన్‌గా నిర్వహిస్తున్నారు. ఏటా రాఖీ పండుగ నెలలో విద్యార్థులతో కలిసి చెట్లకు రాఖీలు కడుతున్నామని అన్నారు ప్రకృతి ప్రేమికులు.

Visakhapatnam: ఆ చెట్టుకు బొట్టు పెట్టి.. హారతి పట్టి.. రాఖీ కట్టారు.. ఎందుకో తెలుసా..?
Vrikshabandhan Celebrations
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Aug 03, 2025 | 7:25 AM

Share

విశాఖలో ప్రకృతి ప్రేమికులు వినూత్న రీతిలో రక్షాబంధన్ జరుపుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు వృక్షాలే కీలకమంటూ.. వృక్షాబంధన్ పేరుతో వేడుకలు చేశారు. 150 ఏళ్ల చరిత్ర గలిగిన ఓ మర్రిచెట్టుకు.. రాఖీ కట్టారు. బొట్టుపెట్టి హారతి పట్టారు. ప్రాణ వాయువును ఇచ్చే వృక్షాలను పరిరక్షించుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకుందాం అంటూ ప్రతిజ్ఞ చేశారు.

రక్షాబంధన్ అంటే అన్నా-చెల్లెల మధ్య అనుబంధానికి ఓ రూపం. అన్నదమ్ములకు రాఖీ కట్టి.. కలకాలం రక్షణగా ఉండాలని, అన్నదమ్ముల నుంచి రక్షణ కోరుకుంటారు ఆడపడుచులు. కానీ.. విశాఖలో మాత్రం ప్రకృతి ప్రేమికులు వృక్షాబంధన్ నిర్వహించారు. 150 ఏళ్ల చరిత్ర గల ఓ మర్రిచెట్టుకు రాఖీ కట్టి పర్యావరణాన్ని పరిరక్షణకు పిలుపునిచారు. పురాతన చెట్ల పరిరక్షణకు వినూత్న సందేశం ఇస్తున్నారు.

అప్పటి ఆ మర్రిచెట్టు..

విశాఖ రైల్వేస్టేషన్‌కు చేరువలో విశ్రాంత గృహం వద్ద ఉన్న వృక్షం ఇది. దీనికి చాలా ఏళ్ల చరిత్ర ఉంది. 1887లో బొంబాయి-నాగ్‌పూర్ రైల్వే లైన్ నిర్మాణం సమయంలో కార్మికులకు నీడ కోసం నాటిన మొక్కల్లో ఇది ఒకటి. దాని వయసు దాదాపు140 ఏళ్ళు. ఇప్పటికే చాలా మొక్కలు ప్రకృతి విధ్వంసంలో కాలగర్భంలో కలిసిపోయాయి. ఇంకా ఇటువంటి వృక్షాలు కొన్ని మాత్రమే విశాఖలో మిగిలి ఉన్నాయి. దీంతో వాటిని పరిరక్షించుకుని పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని పిలుపునిస్తున్నారు ప్రకృతి ప్రేమికులు. ఇందులో భాగంగా ప్రతి ఏటా ఇటువంటి వృక్షాలకు వృక్షాబంధన్ నిర్వహిస్తుంటారు. గ్రీన్ క్లైమేట్ ఆధ్వర్యంలో ప్రకృతి ప్రేమికులు, విద్యార్థులు తరలివచ్చి వేడుకను ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. వృక్షాబంధన్‌కు రాఖీ కట్టి ఇటువంటి చెట్లను కాపాడుకుందాం అంటూ ప్రతిజ్ఞ చేశామని అన్నారు విద్యార్థిని అలీనా.

పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే చెట్లు

పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే చెట్లను మనిషి అభివృద్ధి పేరిట నరికేస్తున్నారు. అందుకే ప్రకృతి ప్రకోపానికి గురవుతున్నారు. చెట్లు లేకపోతే జరిగే నష్టాన్ని గుర్తించాలని అంటున్నారు విశాఖలో ప్రకృతి ప్రేమికులు. రక్షాబంధన్‌ను వృక్షాబంధన్‌గా నిర్వహిస్తున్నారు. ఏటా రాఖీ పండుగ నెలలో విద్యార్థులతో కలిసి చెట్లకు రాఖీలు కడుతున్నామని అన్నారు ప్రకృతి ప్రేమికురాలు విజయలక్ష్మి.

వృక్షాబంధన్ వేడుకలు

ఇదండీ విశాఖలో వృక్షాబంధన్ వేడుకలు. మీరు కూడా మీ పరిసరాల్లో కచ్చితంగా చెట్లను నాటండి. అంత అవకాశం లేకుంటే కనీసం ఉన్న చెట్లనైనా పరిరక్షించుకోండి. మనిషి ప్రాణాలు నిలిపే, ప్రాణవాయువును అందించే చెట్లు, మొక్కలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..