AP Panchayat Elections 2021: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. ఓటు వేసి బ్యాలెట్ బ్యాక్స్‌పైనే ప్రాణాలొదిడాడు..
AP Local Elections Phase 4: తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం కొమరాడలో విషాదం నెలకొంది.
AP Local Elections Phase 4: తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం కొమరాడలో విషాదం నెలకొంది. పాలూరు కొండయ్య అనే ఓటర్ తన ఓటు హక్కును వినియోగించుకున్న కాసేపటికే చనిపోయాడు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొండయ్య కొమరాడ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. బ్యాలెట్ బాక్స్‌లో ఓటు వేసి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అది చూసి షాక్ అయిన పోలింగ్ సిబ్బంది వెంటనే వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. పోలింగ్ కేంద్రానికి చేరుకున్న వైద్య సిబ్బంది.. కొండయ్యను పరిశీలించగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు.
Also read:
పెళ్లికి ముందే వీడియో కాల్‌లో వరుడి బాడీ పార్ట్స్ చూడాలని కోరింది.. ఖేల్ ఖతం.. ఆ వ్యక్తికి చుక్కలు