AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizianagaram: ప్రశాంత జిల్లాను కలవరపాటుకు గురిచేసిన సిరాజ్ నేపద్యం ఏంటి?

ప్రధాన నగరాల్లో బాంబ్ పేలుళ్ల కుట్ర కేసులో విజయనగరం జిల్లాకు చెందిన సయ్యద్ ఉర్ సిరాజ్ తో పాటు హైదరాబాద్ కు చెందిన సయ్యద్ సమీర్ లను అరెస్ట్ చేశారు విజయనగరం జిల్లా పోలీసులు. తెలంగాణ, ఏపీ కౌంటర్ ఇంటిలిజెన్స్ అధికారులు, విజయనగరం పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్ లో మరింత లోతైన దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఏడు రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో సిరాజ్, సమీర్ లను విచారిస్తున్నారు విచారణ బృందం.

Vizianagaram: ప్రశాంత జిల్లాను కలవరపాటుకు గురిచేసిన సిరాజ్ నేపద్యం ఏంటి?
Siraj
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: May 24, 2025 | 8:15 PM

Share

కాగా సిరాజ్ అరెస్ట్ తో విజయనగరం జిల్లా ఉలిక్కిపడింది. అసలు ఈ సిరాజ్ ఎవరు? ఉగ్రవాదభావజాలం వైపు ఎలా వెళ్లాడు? ఎవరెవరితో పరిచయాలున్నాయి అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతుంది. విజయనగరం జిల్లాలో ఉగ్ర లింక్స్ వ్యవహారంతో జిల్లావాసులు భయాందోళనకు గురయ్యారు. పేలుళ్ల కుట్ర కేసులో కీలక సూత్రధారి సిరాజ్ అని గుర్తించారు పోలీసులు. ఇంతకీ ఎవరీ సిరాజ్? అని విజయనగరం జిల్లావ్యాప్తంగా సర్వత్రా చర్చ నడుస్తుంది. సిరాజ్ ఉర్ రెహమాన్ మొదటి నుండి ముస్లింమత భావజాలంతో ఆవేశపూరిత వ్యక్తిత్వం గల వ్యక్తిగా కుటుంబసభ్యులు చెప్తున్నారు. సిరాజ్ జిల్లాలోనే మెకానికల్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. సిరాజ్ తండ్రి విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్‌ఐగా పనిచేస్తుండగా, సోదరుడు ఏఆర్ కానిస్టేబుల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. తన అన్న, తండ్రులు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండటంతో సిరాజ్ కూడా పోలీస్ అవుదామని అనుకున్నాడు. అందుకోసం కానిస్టేబుల్, ఎస్ఐ పరీక్షల కోసం పలు కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకున్నాడు.

అనంతరం గ్రూప్ వన్ కోచింగ్ తీసుకునే నిమిత్తం హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ కోచింగ్ తీసుకుంటున్న సమయంలోనే 108 కాల్ సెంటర్ లో ఉద్యోగం చేశాడు. అలా ఉద్యోగం చేస్తున్న క్రమంలో పలువురు ఇస్లామిక్ యువకులతో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత సోషల్ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా తనకు దగ్గరగా ఉన్న భావజాలం కలిగిన ఇరవై మంది యువకులను ట్రాప్ చేశాడు. ఆ ఇరవై మందితో కలిసి ఆల్ హింద్ ఇత్తెదుల్లాహ మిషిలిన (ఆహిం) అనే ఒక ఒక ఇన్ స్టా, టెలి గ్రామ్ గ్రూప్స్ ఏర్పాటు చేశాడు. ఆ తరువాత నిత్యం ఆ గ్రూప్స్ లో చాటింగ్ ద్వారా జిహాదీపై పలు బోధనలు చేసి వారిని మతోన్మోదులుగా మార్చాడు. తమ భవిష్యత్ కార్యాచరణకు బాటలు వేసుకున్నారు. ముందుగా బాంబులు ఎలా తయారుచేయాలి? పేలుళ్ల ముడి పదార్థాలు ఎక్కడ తయారు చేయాలి? అందుకు కావలసిన నిధులు పరిస్థితి ఏంటి? అనే అనేక విషయాలు తెలుసుకొని గ్రూప్ ద్వారా స్నేహితులతో చర్చించేవాడు. ఆ గ్రూప్ లో సిరాజ్, సమీర్ లు యాక్టివ్ గా ఉండేవారు. వారిలో సిరాజ్ పేలుళ్ల కోసం కావలసిన బాంబులు తయారుచేసేందుకు ముడి పదార్థాలు అమెజాన్ ద్వారా ఆర్డర్ పెట్టి విజయనగరంలో కొనుగోలు చేశాడు. ప్రశాంత జిల్లాలో తన యాక్టివిటీస్ ఏం చేసినా పెద్దగా నిఘా ఉండదని విజయనగరాన్ని సేఫ్ ప్లేస్ గా ఎంచుకొని తన కార్యకలాపాలు మొదలుపెట్టాడు. అయితే సిరాజ్ కదలికలపై దృష్టి సారించిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో పక్కా సమాచారంతో సిరాజ్ ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి కోర్టు అనుమతితో ఏడు రోజులు కస్టడీకి తీసుకొని మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నారు. సిరాజ్ కార్యకలాపాలు వెలుగులోకి రావడంతో విజయనగరం జిల్లావాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..