Viveka Murder Case: వివేకా మర్డర్ కేసు ఎపిసోడ్ 2.. దర్యాప్తులో సీబీఐ మర్చిపోయిన కీలక విషయాలు ఇవే..!
వివేక మర్డర్ కేస్ పై ద వైర్ రెండో ఎపిసోడ్ ను విడుదల చేసింది. వివేక కేసు దర్యాప్తులో సీబీఐ మరిచిపోయిన కీలక అంశాలను గుర్తు చేస్తూ ది వైర్ మరో సంచలన కథనం ప్రచురించింది. ఇప్పటికీ వివేకా కేసులో సిబిఐ ఫైనల్ చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వివేక మర్డర్ జరిగిన నాలుగున్నర సంవత్సరాల తర్వాత సిబిఐ దాఖలు చేసిన ఫైనల్ చార్జిషీట్ లో ఎన్నో కీలక సాక్షాదారాలను సిబిఐ..
అమరావతి, ఆగస్టు 4: వివేక మర్డర్ కేస్ పై ద వైర్ రెండో ఎపిసోడ్ ను విడుదల చేసింది. వివేక కేసు దర్యాప్తులో సీబీఐ మరిచిపోయిన కీలక అంశాలను గుర్తు చేస్తూ ది వైర్ మరో సంచలన కథనం ప్రచురించింది. ఇప్పటికీ వివేకా కేసులో సిబిఐ ఫైనల్ చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వివేక మర్డర్ జరిగిన నాలుగున్నర సంవత్సరాల తర్వాత సిబిఐ దాఖలు చేసిన ఫైనల్ చార్జిషీట్ లో ఎన్నో కీలక సాక్షాదారాలను సిబిఐ సేకరించలేకపోయిందంటూ ద వైర్ అభిప్రాయపడింది.
ద వైర్ కథనం ప్రకారం సిబిఐ దర్యాప్తు కేవలం ఇద్దరి వాంగ్మూలాల పైనే ఆధారపడి సాగింది. మర్డర్ జరిగిన రోజు వివేక ఇంటికి వాచ్మెన్ గా ఉన్న రంగన్న సాక్ష్యం. వివేకను హత్య చేసినట్టు ఒప్పుకొని అప్రూవర్ గా మారిన దస్తగిరి స్టేట్మెంట్. ఈ రెండు అంశాలపైనే ముడిపడి సిబిఐ దర్యాప్తు సాగింది. వీటిపై ఆధారపడి దర్యాప్తు ప్రారంభించిన సిబిఐ, మర్డర్ జరిగిన రెండు సంవత్సరాల తర్వాత అనూహ్యంగా తెర మీదకు వచ్చిన సంచలన ఆరోపణలు, అనుమానాలకు ఎలాంటి ఆధారాలు చూపకుండానే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులను నిందితులుగా పేర్కొంటూ దర్యాప్తు ముగించింది.
ద వైర్ కథనం ప్రకారం ..
మార్చి 15 2019న ఉదయం 5 :30 గంటలకు వివేక ఇంటికి ఎం.వి.కృష్ణారెడ్డి చేరుకున్నాడు. అప్పటికి వివేక ఇంట్లో వరండాలో రంగన్న ఇంకా నిద్ర లేవలేదు. సునీత స్టేట్మెంట్ ప్రకారం ప్రతిరోజు ఉదయం 4 నుండి 5 గంటల మధ్యలోనే వివేక లేచేవారు. ఆరోజు మాత్రం ఐదున్నర దాటిన వివేక రూమ్లో లైట్స్ ఆఫ్ చేసి ఉండటాన్ని కృష్ణ రెడ్డి గమనించి వివేక ఇంకా నిద్ర లేవలేదని అభిప్రాయానికి వచ్చాడు. అదే రోజు 5:58కి వివేక భార్య సౌభాగ్యమ్మకు ఫోన్ చేసి వివేక ఇంకా నిద్రలేవలేదని కృష్ణారెడ్డి చెప్పాడు. ఇప్పటికే వివేకా ఇంటికి చేరుకుంది పనిమనిషి లక్ష్మి… వివేక రూంకు తూర్పు దిక్కు ఉన్న రూం తలుపు తట్టాడు. అప్పటికే వాచ్మెన్ రంగన్న నిద్ర లేచాడు. వివేక రూముకు ఉత్తర దిక్కు ఉన్న డోర్ దగ్గరికి వెళ్లి చూశాడు రంగన్న. అప్పటికే నార్త్ డోర్ ఓపెన్ అయి ఉండటంతో లోపలికి వెళ్లి బెడ్రూంలో వివేకా లేకపోవటంతో బాత్రూంలో చూసాడు. నీస్సహాయ స్థితిలో విగతాజీవిగా పడి ఉన్న వివేకానందను చూసి ఒకసారిగా కేకలు వేశాడు రంగన్న. సార్ కింద పడిపోయాడంటూ మిగతా వారిని పిలిచాడు.
నాలుగేళ్లలో వివేక హత్య కేసు… ఒక క్రూర హత్య నుండి రాజకీయ మలుపులు తిరిగిన ఒక మిస్టరీ మర్డర్ గా మిగిలిపోయింది. ఏ కేసులో లేనటువంటి భారతదేశ రాజకీయ వాస్తవికతను కలిగి ఉన్న అనేక లొసుగులను ఈ కేస్ మాట్లాదిస్తుంది.. వివేకా కేస్ అచ్చం 1950లో వచ్చిన ఒక జపనీస్ *రషోమొన్” అనే సినిమాకు భారతీయ వర్షన్ లా ఉందని ద వైర్ అభిప్రాయపడింది… ఇందులో సాక్షులు, పరిశోధకులు, ఇతర నాటకీయ వ్యక్తులు యొక్క అస్థిరమైన పరిస్థితులు మనకు కనిపిస్తాయి…వివేకా కేస్ ను దగ్గర నుండి చూసిన ఏ ఒక్కరికైనా ఇదే భావన కలుగుతుంది.
ఈ కేసులో బాధితుడు వైఎస్ వివేకానంద రెడ్డి. సిబిఐ చార్జ్ షీట్ ప్రకారం వై ఎస్ అవినాష్ రెడ్డి 8వ నిందితుడు. ఇద్దరూ కూడా ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తులు. మర్డర్ జరిగిన నాటినుండి 3 సార్లు దర్యాప్తు అధికారులు మారారు. ఇక్కడ సాక్షలను ప్రభావితం చేస్తుంది అధికారులు అనే ఆరోపణలు సైతం ఉన్నాయి. కొందరు అధికారుల పైన కేసులు కూడా నమోదు అయ్యాయి. ఒక హై ప్రొఫైల్ కేస్ దర్యాప్తులో ఇవన్నీ సిస్టం లో భాగమే అనుకున్నా, వివేక హత్య కేసులో మాత్రం ఆ లైన్ లు అన్ని దాటిపోయ్యాయి.
సిబిఐ చార్జిషీట్ ప్రకారం అవినాష్ రెడ్డి డైరెక్షన్లోనే వివేక హత్య జరిగినట్టు పేర్కొంది.. వివేకా హత్యకు కడప ఎంపీ లోక్సభ సీటే కారణం. ఈ పొలిటికల్ మోటివ్ తోనే వివేకాను హత్య చేయించారు అనేది సిబిఐ ప్రధాన అభియోగం. ఇందుకు సిబిఐ దగ్గర ఉన్న సాక్ష్యం వైయస్ షర్మిల ఇచ్చిన స్టేట్మెంట్. అవినాష్ కి లోక్సభ టికెట్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకుండా జగన్ ను కన్విన్స్ చేద్దాం అన్నట్టు షర్మిల తో వివేక చెప్పారని ఆమె స్టేట్మెంట్ ఇచ్చినట్టు సిబిఐ చార్జిషీట్లో పేర్కొన్నది. కానీ అదే సిబిఐ కి వివేక సోదరి విమల తో పాటు ఆయన సొంత అల్లుడు ఇచ్చిన స్టేట్మెంట్లను సిబిఐ పెద్దగా పట్టించుకోలేదు. అవినాష్ రెడ్డి కోసమే వివేకానంద ప్రచారం చేశారని చాలామంది స్టేట్మెంట్ లు ఇచ్చారు. చాలామంది సాక్షులు అవినాష్ రెడ్డి కే కడప ఎంపీ టికెట్ అనఫీషియల్ గా అని చెప్పినప్పటికీ సిబిఐ వాటిని పట్టించుకోలేదని ద వైర్ కథనం ప్రచురించింది.. సిబిఐ మాత్రం పొలిటికల్ మోటివ్ తోనే వివేకాను హత్య చేయించారని చార్జిషీట్లో అభివర్ణించింది.
ఏ మర్డర్ కేసులో అయినా సరే చివరిసారిగా బాధితుడు ఎవరితో కలిసాడు ఎవరితో మాట్లాడాడు అనే అంశాలపైనే దర్యాప్తు అధికారి ఫోకస్ ఉంటుంది. కానీ ఈ కేసులో వివేక చివరిగా మాట్లాడిన రంగన్నను మాత్రం దర్యాప్తు అధికారులు అనూహ్యంగా లైట్ తీసుకున్నారు. మార్చి 15 2019 న రాత్రి 11 గంటల 30 నిమిషాలకు డ్రైవర్ ప్రసాద్ తో కలిసి వివేక ఇంటికి వచ్చాడు. డ్రైవర్ ప్రసాద్ వెళ్లిన 15 నిమిషాలకే ఎర్ర గంగిరెడ్డి వివేకా ఇంటికి వచ్చాడు. అంటే సరిగ్గా 11 45 నిమిషాలకు గంగిరెడ్డి వివేకా ఇంటికి వచ్చినట్టు రంగన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. దస్తగిరి, రంగన్న ఇద్దరి స్టేట్మెంట్స్ లోను గంగిరెడ్డి 11:45 గంటలకు వివేకా ఇంటికి వచ్చినట్లే టాలీ అయింది.
అప్పటికే వివేక ఇంటికి దూరంలో ఉన్న ఒక ప్లేస్ లో సునీల్ యాదవ్ తో పాటు దస్తగిరి కూర్చొని మద్యం సేవిస్తున్నారు. వివేక రాక కోసం 11: 30 వరకు వెయిట్ చేశారు. రంగన్న ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం సరిగ్గా 12:30 కి వివేక తన రూమ్ నుండి బయటకు వచ్చి సిగరెట్ తాగారు. ఈరోజు రాత్రి గంగిరెడ్డి ఇక్కడే ఉంటాడు వెళ్లి పడుకోమని వివేక రంగన్నకు చెప్పాడు.
సిబిఐ దర్యాప్తులో ఈ కీలక పరిణామాన్ని లైట్ తీసుకున్నారు అధికారులు…
ఆరోజు రాత్రి గంగిరెడ్డి అక్కడే ఉంటాడని వివేక రంగన్నకు ఎందుకు చెప్పాడు??? అనే కోణంలో రంగన్న నుండి సిబిఐ వివరాలు రాబట్టలేకపోయింది… ఇక దస్తగిరి స్టేట్మెంట్ ప్రకారం, సరిగ్గా మార్చి 15 తెల్లవారుజామున 1:30 గంటలకు సునీల్ యాదవ్ ఉమా శంకర్ రెడ్డి దస్తగిరి కలిసి వివేక ఇంట్లో నార్త్ డోర్ ద్వారా ఎంటర్ అయ్యారు. సిబిఐ ఛార్జ్ షీట్ ప్రకారం ఒంటిగంట 30 నిమిషాల నుండి మూడు గంటల 15 నిమిషాల మధ్యలో వై ఎస్ వివేక హత్యకు గురయ్యాడు.
రంగన్న
రంగన్న స్టేట్మెంట్ ప్రకారం 3:15 కు ముందే లోపల వినిపిస్తున్న సౌండ్ల వల్ల తనకి మెలకువ వచ్చిందని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏదో జరుగుతుందని గ్రహించిన రంగన్న కిటికీలో నుండి వివేక రూంలోకి తొంగి చూశాడు. అప్పటికే నలుగురు వ్యక్తులు దేనికోసం వెతుకుతున్నట్టు కనిపించారని రంగన్న సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి గంగిరెడ్డి రూమ్ నుండి బయటికి వచ్చి ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని గంగిరెడ్డి బెదిరించినట్టు రంగన్న సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చాడు.
ఇక చివరిగా వివేకాను చూసింది, వివేకతో మాట్లాడింది రంగన్న కాబట్టి దర్యాప్తు మొత్తం రంగన్న నుండే ప్రారంభం కావాలి. వివేక రూమ్ లో నుండి బయటికి వచ్చి సిగరెట్ తాగేందుకు వచ్చిన సమయం చాలా కీలకము. ఆ టైంలో వివేకాను చూసింది మాట్లాడింది రంగన్న మాత్రమే. అలాంటి జీరో అవర్ నుండి సిబిఐ దర్యాప్తు ప్రారంభించాలి. కానీ సిబిఐ రంగన్నను వివేక ఇంట్లో ఒక స్టాఫ్ మాదిరిగానే విచారించింది. సిబిఐ దర్యాప్తు ప్రకారం గంగిరెడ్డి వివేక ఇంట్లోకి ఎంటర్ అయిన టైం ను జీరో అవర్ గా పరిగణించింది…
2021 జులైలో సిబిఐ కు రంగన్న ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వివేక చనిపోయిన విషయం తనకు మధ్య రాత్రే తెలుసు. కానీ ఎవరికి చెప్పకుండా భయంతో వెళ్లి వరండాలో పడుకొని మళ్ళీ ఉదయం ఏమీ తెలియనట్టుగా వెనకాల డోర్ నుండి లోపలికి వెళ్లి వివేక బాడీని బాత్రూంలో గుర్తించినట్టు నటించాడు.
ఈ లెక్కన రెండుసార్లు వివేక బాడీని రంగన్న గుర్తించాడు
జూలై 21 జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు రంగన్న ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం గంగిరెడ్డి వివేకా ఇంట్లో నుండి వెళ్లిపోయిన తర్వాత రంగన్న వివేక రూంలోకి వెళ్లి విగత జీవిగా పడి ఉన్న వివేకాను బాత్రూంలో చూశాడు. భయంతో బయటికి వచ్చిన రంగన్న అటు ఇటు చూసాడు. ఎవరూ లేరు. భయంతో గార్డెన్ లోకి వచ్చి సిగరెట్ తాగి పడుకున్నాను.. ఈ సమయంలో ఆజామ్ మోగింది అంటూ రంగన్న జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చాడు. దీన్ని బట్టి చూస్తే 3:30 నుండి 4 45 మధ్యలో రంగన్న వివేకాను బాత్ రూం లో చూసాడు.. వివేకాను విగత జీవిగా పడి ఉండటం చూసి కూడా రంగన్న ఎవరికి ఫోన్ చేసే సాహసం చేయలేదు. తిరిగి తనకు ఏమీ తెలియదు అన్నట్టు ఉదయం కృష్ణారెడ్డి వచ్చి లేపే వరకు రంగన్న నిద్రలోనే ఉన్నాడు. ఏమీ తెలియనట్టుగా వెనకాల డోర్ నుండి వెళ్లి మళ్లీ బాత్రూంలో వివేక బాడీని గుర్తించి ఒక్కసారి కేక వేసినట్టు నటించాడు.
2019లో నోరు మెదపని రంగన్న, మర్డర్ జరిగిన 861 రోజుల తరువాత మాత్రం అన్ని గుర్తు తెచ్చుకొని మెజిస్ట్రేట్ ముందు చెప్పాడనీ థ వైర్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సిబిఐ ఛార్జ్ షీట్ ప్రకారం రంగన్న ఉమాశంకర్ రెడ్డినీ గుర్తించలేదు. రంగన్న స్టేట్మెంట్ ప్రకారం ముగ్గురు వ్యక్తులు దస్తగిరి సునీల్ యాదవ్ ఎర్ర గంగిరెడ్డి తోపాటు నాలుగో వ్యక్తి ఒక పొడవు వ్యక్తి,బ్లాక్ షర్ట్ ధరించిన వ్యక్తి అని మాత్రమే స్టేట్మెంట్ ఇచ్చాడు. స్థానికంగా ఉన్న ఒక టైర్ షోరూమ్ సిసి ఫుటేజ్ లో ఒక బ్లాక్ షర్ట్ ధరించిన వ్యక్తి పరిగెత్తుతూ కనిపించాడు…ఆ వ్యక్తే ఉమా శంకర్ రెడ్డి అని దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. సీసీ ఫుటేజ్ ఎవిడెన్స్ ను కోర్టు ఎంతవరకు ఐడేన్టిఫికేషన్ పెరేడ్ గా భావిస్తుందో చూడాలి.
ఇక గూగుల్ టెక్ అవుట్ అంశంలోనూ సిబిఐ కొన్ని సాంకేతిక తప్పిదాలు చేసింది. గంగిరెడ్డి ఉమాశంకర్ సెల్ ఫోన్ టవర్ లొకేషన్ వాళ్ల ఇళ్లలోనే చూపించింది. . కానీ వాళ్లు ఇంట్లో ఉండకపోవచ్చు. ఇక సునీల్ యాదవ్ కు సంబంధించిన గూగుల్ టేక్ అవుట్ పై సిబిఐ సగం చార్జిషీట్ నింపేసింది. మార్చి 14, 15 తేదీలలో సునీల్ యాదవ్ అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నట్టు సిబిఐ టైమింగ్ తో సహా మెన్షన్ చేసింది. ఇంతవరకు బానే ఉన్నా అసలు విషయాన్ని మాత్రం సిబిఐ పక్కకు పెట్టిందనేది ద వైర్ కథనం…
వివేక హత్యకు ముందు సునీల్ యాదవ్ వివేక ఇంటి పరిసరాల్లోనే 160 మీటర్ల దూరంలో ఒక బ్లూ కలర్ ఇండిపెండెంట్ హౌస్ లో నివాసం ఉన్నాడు. సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో గూగుల్ టేక్ అవుట్ అక్క్యురసి 500 నుండి 1500 మీటర్లు ఉంటుంది. సిబిఐ దాకా చేసిన ఫస్ట్ చార్జిషీట్లో సునీల్ యాదవ్ గూగుల్ టేక్ అవుట్ ద్వారా మూడు టైం లను పేర్కొన్నది. సిబిఐ గూగుల్ టేక్ వుడ్ ప్రకారం సునీల్ యాదవ్ 2:42 కు వివేకా ఇంట్లో ఉన్నడు,,2: 35కు , వివేక ఇంటికి దగ్గరలో ఉన్నాడు. కానీ సిబిఐ దాఖలు చేసిన ఫైనల్ చార్జిషీట్లో మాత్రం 1: 58 కి అవినాష్ రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్ ఉన్నట్లు సిబిఐ పేర్కొన్నది. సిబిఐ మూడుసార్లు చార్జిషీట్లో పేర్కొన్న సునీల్ యాదవ్ గూగుల్ టేక్ అవుట్ సమయాల్లో వ్యత్యాసం కనిపించింది. అవినాష్ రెడ్డి ముందస్తు బయలు పిటిషన్ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ఈ విషయాన్ని గుర్తించే వరకు సిబిఐ చూసుకోలేదు.
Google take out
హైకోర్టు గూగుల్ అవుట్ సమయాలపై ప్రశ్నించిన తర్వాత , సి ఎఫ్ ఎస్ ఎల్ ఢిల్లీ సాంకేతిక తప్పిదం కారణమంటూ సిబిఐ వచ్చింది. రెండు చార్జి షీట్లలో పేర్కొన్న సమయాలు ఒకటి utc విధానంలో ఉంటే మరొకటి ist విధానంలో ఉందని కవర్ చేసింది. అయినా సరే సిబిఐ చారి షీట్ ప్రకారం సునీల్ యాదవ్ ఒకే సమయానికి రెండు ప్రదేశాల్లో ఉన్నాడు. మార్చి 15 తెల్లవారుజామున 1:30 నుండి 3 గంటల వరకు వివేకా మర్డర్ జరిగిందని ఒక వైపు చబుతునే అదే సమయానికి అంటే 1:58 నిమిషాలకు సునీల్ యాదవ్ అవినాష్ ఇంట్లో ఉన్నాడని సిబిఐ మరోసారి మెన్షన్ చేసింది…ఇలా ఒకేసారి సునీల్ యాదవ్ రెండు ప్రదేశాల్లో ఉండటం ఎలా సాధ్యం.. ఒకవేళ సునీల్ యాదవ్ ఆ సమయంలో అవినాష్ రెడ్డి ఇంట్లో ఉండి ఉంటే మరి మర్డర్ ఎవరు చేశారు ?? అంటూ సంచలన కథనం ప్రచురించింది త వైర్.
Letter
వివేక హత్య కేసులో అత్యంత ప్రధానమైనది వివేక డైయింగ్ డిక్లరేషన్. వివేక చేత్తో రాసిన సూసైడ్ లెటర్. వివేక మృతదేహాన్ని బాత్రూంలో గుర్తించిన తర్వాత వివేక రూమ్ లో ఉన్న సోఫాలో ఈ లెటర్ కనిపించింది. వివేకా కూతురు సునీత పెళ్లి సర్టిఫికెట్ వెనకాల”నా డ్రైవర్ ప్రసాద్ ను త్వరగా రమ్మని పిలిచినందుకు డ్రైవర్ ప్రసాద్ నన్ను కొట్టాడు,ఈ లెటర్ రాసేందుకు కష్టంగా ఉంది.. డ్రైవర్ ప్రసాద్ ను వదలొద్దు” ఉంటూ లెటర్ పై భాగం క్లియర్ గానే ఉన్న కింద రక్తపు మరకలు లెటర్ కు ఉంటాయి. వివేక రూమ్లో దొరికిన లెటర్ గురించి 6:29కి సునీత భర్త రాజశేఖర్ రెడ్డి కి కృష్ణారెడ్డి ఫోన్ చేసి చెప్పాడు. అప్పటివరకు లెటర్ ఉందన్న విషయం ఎవరికీ తెలియదు. అప్పటికె సీఐ శంకరయ్య స్పాట్ కి వచ్చినా కూడా ఆయన దగ్గర లెటర్ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు.. దీనికి కారణం నరెడ్డి రాజశేఖర్ రెడ్డి.. సునీత భర్త చెప్పడంతోనే ఎల్ వి కృష్ణారెడ్డి లెటర్ ను మధ్యాహ్నం వరకు దాచాడు. ప్రతిరోజు మధ్యాహ్నం అప్పటి కడప లెటర్ ఇచ్చారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అప్పటి సిట్ అధికారి డిఎస్పి నాగరాజ్ సైతం లెటర్ పై అనుమానాలు వ్యక్తం చేశాడు. వివేక మృతదేహం బాత్రూంలో పడి ఉన్నప్పుడు లెటర్ బెడ్ రూమ్ లో ఎలా దొరికిందని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు… ఇదే స్టేట్మెంట్ ను సిబిఐ కి కూడా చెప్పాడు.
దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా వివేకానంద బాత్రూంలోకి తీసుకెళ్లే ముందు బెడ్రూంలోనే లెటర్ రాయించినట్టు దస్తగిరి సిబిఐ ముందు కన్ఫెస్ చేశాడు. దస్తగిరి స్టేట్మెంట్ ప్రకారం వివేకాను మూడుసార్లు గొడ్డలితో కొట్టిన తర్వాత లెటర్ రాయించామని చెప్పాడు. సిబిఐ దర్యాప్తులో ఆ లెటర్ రాసింది వివేకానా కాదా అనే కోణంలోనే జరిగింది తప్ప, అలాంటి స్థితిలో లెటర్ రాయడం సాధ్యమా కాదా అనే అంశంపై మెడికల్ ఎక్స్ పర్ట్స్స్ రిపోర్టు సబ్మిట్ చేయడం సిబిఐ మర్చిపోయింది. దస్తగిరి స్టేట్మెంట్ ప్రకారం వివేకాను మొదట సునీల్ యాదవ్ మూతిపై కొట్టాడు, తర్వాత ఉమా శంకర్ రెడ్డి గొడ్డలితో వివేక నుదుటిపై దాడి చేశాడు. అప్పటికే వివేక తలలో 3.5 ఇంచులు గాయమైనట్టు రిక్వెస్ట్ రిపోర్టులోను ఉంది.. ఇక మరోసారి వివేక తల వెనకాల ఉన్న భాగాన్ని గొడ్డలితో దాడి చేశాడు. అప్పటికే వివేక మెదడుకు బలమైన గాయం తగిలింది. ఇక చివరిగా సునీల్ యాదవ్ వివేక గుండెపై 15 నుండి 16 సార్లు తన్నినట్టు సిబిఐ చార్జిషీట్లో పేర్కొన్నది ఇదే తరుణంలో గొడ్డలిని సునీల్ యాదవ్ కు ఇచ్చాడు ఉమాశంకర్ రెడ్డి తాను అల్మారా లో డాక్యుమెంట్స్ కోసం వెతుకుతాను అంటూచెప్పినట్టు దస్తగిరి స్టేట్మెంట్ లో ఉంది. అప్పుడు వివేక “నా ఏం వెతుకుతున్నారు* అంట చెయ్ లేపి అడగటంతో సునీల్ యాదవ్ వివేక చేతిపై గొడ్డలితో దాడి చేశాడు. ఇంత క్రూరంగా గాయపడ్డ 67 సంవత్సరాల వ్యక్తి, అది కూడా తన మర్డర్ కి ఆరు నెలల ముందు హార్ట్ సర్జరీ జరిగిన వ్యక్తికి ఇలా లెటర్ రాయడం సాధ్యమా కాదా అనే విషయాన్ని సిబిఐ పట్టించుకోలేదు….
లెటర్ ను సి ఎఫ్ ఎస్ ఎల్ కు పంపిన తర్వాత అత్యంత ప్రజర్లో ఈ లెటర్ రాసినట్టు మాత్రమే రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్టును సీబీఐ చార్జిషీట్లో జతపరిచింది..
వాట్సాప్ ipdr డేటా
సిబిఐ చార్జిషీట్ ప్రకారం మర్డర్ జరిగిన తర్వాత అవినాష్ రెడ్డి తో గంగిరెడ్డి వాట్సాప్ చాట్ చేశారనేది అభియోగం. ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్ రికార్డ్స్ కేవలం మెసేజ్ వెళ్లిందా, మెసేజ్ రీచ్ అయిందా అనే వివరాలు మాత్రమే ఇస్తాయి తప్ప అందులో మెసేజ్ ఏంటనేది మాత్రం ipdr చెప్పలేదు.. జరిగిన తర్వాత 1: 37 నుండి 5:02 వరకు గంగిరెడ్డి అవినాష్ రెడ్డి తో మాట్లాడినట్టు ipdr డేటా ద్వారా సిబిఐ చార్జ్ షిట్లో పెట్టింది. కానీ వీరిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకున్నట్టు idpr డేటా వెల్లడించలేదు..
సిబిఐ చార్జిషీట్ ప్రకారం వివేక మర్డర్ జరిగే ముందు రోజు మొత్తం ఎనిమిది మంది నిందితులు ఒకరితో ఒకరు మాట్లాడినట్టు సిబిఐ ఒక చార్ట్ ను చార్జిషీట్లో పొందపరిచింది. ఇందులో రెండు కాల్స్ ని బేస్ చేసుకుని అవినాష్ రెడ్డిని సెంటర్ చేసింది సిబిఐ. మర్డర్ జరిగే ముందు రోజు రాత్రి అవినాష్ రెడ్డి అనుచరుడు శివ శంకర్ రెడ్డి గంగిరెడ్డి కి కాల్ చేశాడు. ఆ తర్వాత మోడల్ జరిగిందని ప్రపంచానికి తెలిసిన తర్వాత ఉదయం తొమ్మిదిన్నరకి కాల్ ఉంది. వీటినే ప్రాథమికంగా చూపిస్తూ అవినాష్ రెడ్డికి ఈ హత్యతో సంబంధం ఉంది అనే నిర్ణయానికి సిబిఐ వచ్చింది.. అవినాష్ రెడ్డి ఆదేశాలతోనే ఈ హత్య జరిగింది అని సిబిఐ ఛార్జ్ షీట్ లో పెట్టింది.. కానీ ది వైర్ కథనం ప్రకారం గంగిరెడ్డి శివశంకర్ రెడ్డి ఫోన్లో ఉన్న మిగతా కాల్స్ గురించి సిబిఐ ఎందుకు చార్జిషీట్లో పెట్టలేదు .. ఒకవేళ ఆ మిగతా కాల్స్ గురించి కూడా సిబిఐ దర్యాప్తు చేసి ఉంటే మరి కొన్ని కోణాలు బయటపడేవనీ త వైర్ అభిప్రాయపడింది…
స్టేట్మెంట్స్ తారుమారు
ఇక సిబిఐ చార్జీ షీట్ తో పాటు జతపరిచిన 161 స్టేట్మెంట్స్ పై చాలా వివాదాలు రాజుకున్నాయి.. ఏడాది జూన్లో అవినాష్ రెడ్డి సిబిఐ డైరెక్టర్ కు ఒక లెటర్ రాశాడు. సిబిఐ జతపరచిన సుమారు 14 మంది స్టేట్మెంట్ లు వక్రీకరించబడ్డవని ఆయన తెలిపారు. సిబిఐ పొందుపరిచిన 161 స్టేట్మెంట్స్ లో అజయ్ కల్లం స్టేట్మెంట్ పై దుమారం రేగింది… తన స్టేట్మెంట్లు సిబిఐ మార్చి రాసిందంటూ తాజాగా తెలంగాణ హైకోర్టులను అజయ్ కళ్ళం పిటిషన్ దాఖలు చేశారు. తాను ఎక్కడ వైఎస్ భారతి పేరు తీయనప్పటికీ సిబిఐ స్టేట్మెంట్ కాపీ లో పెట్టిందని ఆయన పేర్కొన్నారు…
అజయ్ కల్లం స్టేట్మెంట్ ప్రకారం 2019 మే 15న ఉదయం ఐదు గంటలకి ఎన్నికల మేనిఫెస్టో గురించి చర్చించేందుకు జగన్ నివాసంలో సమావేశం అయ్యారు. సుమారు గంటన్నర సమయం తర్వాత అంటే 6:30 కు ఒక వ్యక్తి మీటింగ్ రూమ్ తలుపు తట్టాడు. వివేక చనిపోయిన వార్తను జగన్ కు సదరు వ్యక్తి వచ్చి చెప్పటంతో ఒక్కసారిగా జగన్ షాక్ కు గురయ్యారు … ఏమైందని తాము జగన్ ని అడిగినప్పుడు వివేక చనిపోయినట్టు తమకు జగన్ చెప్పినట్టు అజయ్ కల్లాo సిబిఐ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది అజయ్ కల్లం 25 నిమిషాల పాటు సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలం.. ఈ స్టేట్మెంట్ను పలు రకాలుగా సిబిఐ వక్రీకరించి తాను చెప్పని అంశాలను సైతం జోడించి తానే ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్టు సిబిఐ దాకాలు చేసిన ఫైనల్ చార్జిషీట్లో పొందపరిచరని ఆరోపిస్తూ పిటిషన్ ఫైల్ చేశారు…
అదే రోజు జగన్ తలుపు తట్టిన అటెండెంట్ గోపరాజు నవీన్ కుమార్ స్టేట్మెంట్ ను సైతం సిబిఐ నమోదు చేసింది.. 6:30 సమయంలో వైయస్ అవినాష్ రెడ్డి నుండి తనకు ఫోన్ వచ్చిందని… జగన్ ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డికి అర్జెంటుగా ఫోన్ ఇవ్వాలని అవినాష్ రెడ్డి చెప్పటంతో తాను ఓ ఎస్ డి కృష్ణమోహన్ కి ఫోన్ ఇచ్చానని గోపరాజు నవీన్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చాడు.
సాక్ష్యాలు చెరిపివేత
సిబిఐ 161 స్టేట్మెంట్ స్లో చూస్తే వివేక మరణం గురించి తెలుసుకున్న తర్వాత జమ్మలమడుగు దారిలో ఉన్న అవినాష్ రెడ్డి యూ టర్న్ చేసుకొని వివేకా ఇంటికి చేరుకున్నాడు. వివేక చనిపోయిన విషయం అవినాష్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పింది నరెడ్డి శివప్రకాశ్ రెడ్డి.. అవినాష్ రెడ్డి వివేకా ఇంటికి 6:32 కు చేరుకున్నాడు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన తర్వాత సిఐ శంకరయ్యకు 6:44 అవినాష్ రెడ్డి ఫోన్ చేశాడు. శంకరయ్య 7 గంటలకు వివేకా ఇంటికి చేరుకున్నాడని వివేక టైపిస్ట్ ఇనాయతుల్లా సిబిఐ కి స్టేట్మెంట్ ఇచ్చాడు.
ఇనాయతుల్లా స్టేట్మెంట్ ప్రకారం సిఐ శంకరయ్య వచ్చేవరకు ఎవరు ఎలాంటి వస్తువులను ముట్టలేదు. కానీ అప్పటికే వివేక రాసిన లెటర్ తో పాటు వివేక మొబైల్ ఫోన్ ను ఎం వి కృష్ణారెడ్డి దాచాడు. బాత్రూంలో పడి ఉన్న వివేకాను శంకరయ్యకు చూపించాడు. అప్పుడే ఎర్ర గంగిరెడ్డి ఇంట్లోకి వచ్చాడు. బెడ్ రూమ్ లో పడి ఉన్న రక్తాన్ని క్లీన్ చేసి బాడీని సిఐ శంకరయ్య ముందే బెడ్ రూమ్ లోకి తీసుకొచ్చాడు.
ఇనయతుల్లా స్టేట్మెంట్ ప్రకారం బెడ్ రూమ్ లో పడి ఉన్న రక్తాన్ని క్లీన్ చేయమని వంట మనిషి లక్ష్మమ్మకు గంగిరెడ్డి చెప్పాడు.. కొంచెం రక్తాన్ని గంగిరెడ్డి కూడా క్లీన్ చేశాడు. సిబిఐ పొందుపరిచిన 161 ప్రకారం ఎవరు కూడా అవినాష్ రెడ్డి చెప్తే రక్తాన్ని తుడిచామని ఎవరు చెప్పలేదు… గంగిరెడ్డి చెప్తేనే రక్తాన్ని తుడిచినట్టు లక్ష్మమ్మ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇనాయతుల్లా స్టేట్మెంట్ కూడా గంగిరెడ్డి రక్తాన్ని తుడిచినట్టు చెప్పాడు…. * ద వైర్ కథనం ప్రకారం సీన్ ఆఫ్ క్రైమ్ ను తుడిచిపెట్టింది ఏ వన్ నిందితుడు ఎర్ర గంగిరెడ్డి.. ఎర్ర గంగిరెడ్డి ఆధారాలు చెరిపేస్తున్న సమయంలో అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి శివశంకర్ రెడ్డి అదే ఇంట్లో ఉన్నారు.*
Money
వివేక హత్య కోసం 40 కోట్లు దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి తమకు ఇస్తాడని గంగిరెడ్డి తమతో చెప్పినట్టు దస్తగిరి సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత హెలిపాడ్ వద్ద సునీల్ యాదవ్ తనను కలిసి కోటి రూపాయలు ఇచ్చాడు. అందులో 25 లక్షలు సునీల్ యాదవ్ తీసుకెళ్లగా మిగిలిన 75 లక్షలు ఇలా కొనుక్కునేందుకు దస్తగిరి నిర్వహించుకుని ఆ డబ్బులను మున్నాకు ఇచ్చాడు. ఆ డబ్బు రికవరీ పై ఇప్పటికీ ఒక మిస్టరీ కొనసాగుతూనే ఉంది. 2021లో దస్తగిరి అప్పుడు వారి స్టేట్మెంట్ ఇస్తే 2020లోనే ఆ డబ్బులు సీజ్ చేసినట్టు సిబిఐ చార్జిషీట్లో చెప్పింది. మనీ రికవరీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం జరగలేదనీ తెలంగాణ హై కోర్ట్ అభిప్రాయపడింది… సిబిఐ మాత్రం సిఆర్పిసి 102 ప్రకారం మున్నా లాకర్ నుండి 46 లక్షలు రికవరీ చేసినట్టు పేర్కొన్నది. అసలు ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందనే దానిపై సిబిఐ ఎలాంటి దర్యాప్తు చేయలేదు. డబ్బు రికవరీ చేసుకున్న మున్నా నుండి ఎలాంటి అదనపు వివరాలు సిబిఐ సేకరించలేకపోయింది. అసలు ఉన్నాను సరిగ్గా విచారించలేదు అని త వైర్ అభిప్రాయపడింది.
Finger prints
సాదరణంగా ఏదైనా కేసులో ఎలాంటి సర్టిఫైడ్ ఎవిడెన్స్ లేనప్పుడు దర్యాప్తు సంస్థలు ఫింగర్ ప్రింట్స్ మీద ఆధారపడుతూ ఉంటాయి.. వివేకా కేసులో 2019 మార్చి 15 కడప న్యూస్ టీం ఆరు ఫింగర్ ప్రింట్స్ సేకరించింది. వివేక ఫోన్ పై ఉన్న మూడు వేలిముద్రలు, వివేక రూమ్ తలుపు గడె కు ఉన్న ఒక ఫింగర్ ప్రింట్, వివేక బాత్రూం టైల్స్ పై ఉన్న రెండు ఫింగర్ ప్రింట్స్ ను క్లూస్ టీం సేకరించింది. అమర శెట్టి రోజే వివేక ఇంటి స్టాఫ్ అందరు ఫింగర్ ప్రింట్స్ తో పాటు కుటుంబ సభ్యులు, నిందితుల ఫింగర్ ప్రింట్స్ ట్యాలీ చేసి చూశారు.. సిబిఐ కి కేసు అప్పగించే ముందు అప్పటి సిట్ దర్యాప్తు ప్రకారం ఈ ఫింగర్ ప్రింట్స్ ను 1461 మంది అనుమానితుల ఫింగర్ ప్రింట్ తో పాటు పులివెందులకు చెందిన మరో 400 మంది ఫింగర్ ప్రింట్స్ ను ట్యాళి చేశారు ఎవరితోనూ ఇది మ్యాచ్ కాలేదు… మరోవైపు స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఫింగర్ ప్రింట్స్ డేటాబేస్ తోను వీటిని పోల్చి చూశారు… కానీ ఏ ఒక్క వ్యక్తితో ఫింగర్ ప్రింట్ మ్యాచ్ కాలేదు. సిబిఐ పొందపరచిన మూడు చార్జిషీట్లలో ఒక్కసారి కూడా ఈ అంశాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు. కోర్టు దృష్టికి అసలు ఈ ఫింగర్ ప్రింట్స్ అంశాన్ని సిబిఐ తీసుకెళ్లలేదనీ త వైర్ అభిప్రాయపడింది..
Documents
సిబిఐ చార్జిషీట్ ప్రకారం పొలిటికల్ కక్షతోనే మర్డర్ జరిగినట్టు సిబిఐ నిర్ధారణకు వచ్చింది. కానీ అటు రంగన్న ఇటు దస్తగిరి చెప్పిన స్టేట్మెంట్స్ పరిశీలిస్తే దొంగతనం కూడా మడర్ కి కారణం అయి ఉండవచ్చు అని త వైర్ అంటుంది.. రంగన్న, దస్తగిరి ఇద్దరు కూడా తమ స్టేట్మెంట్స్ లో మిగతా నిందితులు ల్యాండ్ డాక్యుమెంట్స్ కోసం వెతికారoటూ స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్స్లో రెండు వ్యత్యాసాలు కనిపించాయి. ఒక స్టేట్మెంట్లో ఒక రౌండ్ సీల్ డాక్యుమెంట్ గంగిరెడ్డి తనతో తీసుకెళ్లాడంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. మరో స్టేట్మెంట్ లో మాత్రం అల్మారాన విరకొట్టేందుకు ప్రయత్నించిన అది తెరుచుకోలేదంటూ దస్తగిరి సిబిఐ కి చెప్పాడు. ఇక రంగన్న స్టేట్మెంట్లోనూ కిటికీ లో నుండి చూసినప్పుడు నలుగురు వ్యక్తులు దేనికోసమో వెతుకుతున్నట్టు కనిపించిందని రంగన్న చెప్పాడు. ఇలాంటి ఒక మంచి కోసం ఇరగంగి రెడ్డి ఇంట్లో సిబిఐ సోదాలు చేసింది. 2021లో ఆగస్టు 11న గంగిరెడ్డి ఇంట్లో సిబిఐ తనిఖీ చేసింది. ఇందులో వివేకాకు సంబంధించిన ఎటువంటి డాక్యుమెంట్ లభ్యం కాలేదు. ఇలాంటి డాక్యుమెంట్స్ విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. అసలు నిజంగానే డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా అనేది కూడా సిబిఐ ఎక్కడ పేర్కొనలేదు. ఈ డాక్యుమెంట్స్ కోసం వెతికాం తను ఎలాంటి ఫలితము లేదని సిబిఐ చార్జిషీట్ లో ప్రస్తావించింది.
ఇటుమారోవైపు క్రైమ్ సీన్ ఫోటోలు ఆధారంగా అల్మారా హ్యాండిల్ విరిగిపోయిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే నిందితులు ఆ డాక్యుమెంట్స్ కోసం వెతికారు అనేది నిజం. కానీ అవి దొరికాయా లేదా అనేది మాత్రం ఇప్పటికే అంత చిక్కని ప్రశ్న. కానీ సిబిఐ మాత్రం కేవలం మర్డర్ పైనే ఫోకస్ చేసింది తప్పా, దీనికి సంబంధించిన తెఫ్ట్ యాక్ట్ ను మాత్రం నిందితుల పై పెట్టలేదు..
ఒకవేళ అవినాష్ ఆదేశించడం వల్లే వివేక చనిపోయాడని భావిస్తే హార్ట్ ఎటాక్ తో చనిపోయాడని అవినాష్ ఎందుకు చెప్తాడు. వివేక డైయింగ్ డిక్లరేషన్ గురించి అవినాష్ కు ఎందుకు తెలియలేదు??? ఒకవేళ లెటర్ లో ఉన్న విషయం అవినాష్ కు తెలిసి ఉంటే హార్ట్ ఎటాక్ అని ఎందుకు చెబుతారు ??? ఒకవేళ అవినాష్ రెడ్డి పంపిస్తేనే నిందితులు వివేకాను చంపడానికి వెళితే లెటర్ రాసిన విషయం నిందితులు అవినాష్ రెడ్డికి చెప్పలేదా???? అంటూ త వైర్ సంచలన కథనాన్ని ప్రచురించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ కథనాల కోసం క్లిక్ చేయండి.