AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rushikonda Beach: గుడ్ న్యూస్.. రుషికొండ బీచ్‌‌కు బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ..! అసలు సర్టిఫికేషన్ ఎందుకు ఇస్తారో తెలుసా..?

రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ ధ్రువీకరణ పునరుద్ధరించారు. బీచ్‌పై విధించిన బ్లూ ఫ్లాగ్ తాత్కాలిక ఉపసంహరణ ఆదేశాలను ఎత్తివేస్తున్నట్లు బ్లూఫ్లాగ్‌ ఇండియా అధికారులు ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్ ను కలిసిన బ్లూ ఫ్లాగ్ ఇండియా ప్రతినిధుల బృందం.. లాంఛనంగా బ్లూ ఫ్లాగ్ ను అందజేశారు. గత నెల ఉపసంహరించుకున్న గుర్తింపును పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు బ్లూ ఫ్లాగ్ ఇండియా ప్రతినిధులు..

Rushikonda Beach: గుడ్ న్యూస్.. రుషికొండ బీచ్‌‌కు బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ..! అసలు సర్టిఫికేషన్ ఎందుకు ఇస్తారో తెలుసా..?
Rushikonda Beach
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Mar 24, 2025 | 6:19 AM

Share

రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ ధ్రువీకరణ పునరుద్ధరించారు. బీచ్‌పై విధించిన బ్లూ ఫ్లాగ్ తాత్కాలిక ఉపసంహరణ ఆదేశాలను ఎత్తివేస్తున్నట్లు బ్లూఫ్లాగ్‌ ఇండియా అధికారులు ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్ ను కలిసిన బ్లూ ఫ్లాగ్ ఇండియా ప్రతినిధుల బృందం.. లాంఛనంగా బ్లూ ఫ్లాగ్ ను అందజేశారు. గత నెల ఉపసంహరించుకున్న గుర్తింపును పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు బ్లూ ఫ్లాగ్ ఇండియా ప్రతినిధులు.. భద్రత, పర్యావరణ నిర్వహణ, ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, గ్రే వాటర్‌ నిర్వహణ వంటివి ప్రణాళికాబద్ధంగా కొనసాగించాలని సూచించినట్టు జిల్లా పర్యాటక శాఖాధికారి సుగుణ సుధాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

బీచ్‌లో నిర్వహణ సరిగా లేదనే ఆరోపణలపై డెన్మార్కు కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ – (FEE) బ్లూ ఫ్లాగ్ హోదాను తాత్కాలికంగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని ఋషికొండ బీచ్‌లో పునరుద్ధరణ చర్యలు ప్రారంభించింది. బీచ్ క్లీనింగ్‌తో పాటు, సందర్శకులకు మౌలిక సదుపాయాలు కల్పనపై ప్రత్యేకంగా అధికారుల దృష్టి సారించి ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించడానికి న్యూఢిల్లీ నుండి బ్లూ ఫ్లాగ్ ఇండియా ప్రతినిధుల బృందం శుక్రవారం సాయంత్రం రుషికొండ బీచ్‌ను సందర్శించింది. అక్కడి సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్‌ ధ్రువీకరణను పునరుద్ధరించారు. కలెక్టర్ ను కలిసిన బ్లూ ఫ్లాగ్ ఇండియా ప్రతినిధులు.. తాత్కాలిక సస్పెన్షన్ ను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. అందుకు సంబంధించిన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌ను కలెక్టర్ హరేందిర ప్రసాద్‌కు అందజేశారు.

బ్లూ ఫ్లాగ్ హోదా ఎందుకు ఇస్తారు..

సరిగ్గా ఐదేళ్ల క్రితం .. 2020లో విశాఖలోని రుషికొండ బీచ్ ప్రతిష్టాత్మక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందింది. బీచ్లో మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, భద్రతా చర్యలు, ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని 2020లో డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ – ఎస్ఈఈ సంస్థ ఈ రుషికొండ బీచ్ 600 మీటర్ల మేర కు ప్రతిష్టాత్మక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చింది. దీంతో ఈ బీచ్‌కు మరింత గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు వచ్చాయి.

వాస్తవానికి.. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన బీచ్లో నీలి రంగు జెండాను ఎగుర వేస్తారు. ఈ జెండా ఉన్న బీచ్ లు పర్యావరణ హితంగాను, పరిశుభ్రంగాను, ఆహ్లాదకరంగాను, మౌలిక సదుపాయాలు కలిగి ఉంటాయని అర్థం. అలా విశాఖలోని ఈ రుషికొండ బీచ్లోనూ 2020లో బ్లూ ఫ్లాగ్ జెండాను ఏర్పాటు చేశారు. దానికి ఒకవైపు భారత జాతీయ జెండా, మరో వైపు కాషాయ వర్ణం కలిగిన మరో జెండాను అమర్చారు. అప్పట్నుంచి బ్లూ ఫ్లాగ్ గురించి ఇటు వైజాగ్ వాసులు గాని, అటు రాష్ట్ర ప్రభుత్వం గాని ఎంతో గొప్పగాను, సగర్వంగానూ చెప్పుకుంటున్నారు.

Blue Flag

Blue Flag

ఆ తర్వాత ఏం జరిగింది..

అప్పట్లో ఈ ఘనత దేశవ్యాప్తంగా పాకింది. ఆ తర్వాత పాలకుల నిర్లక్ష్యం, పర్యాటక శాఖ అధికారుల అలసత్వం, బాధ్యతా రాహిత్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉండే రుషికొండ బీచ్ అధ్వానంగా మారింది. దీంతో బ్లూ ఫ్లాగ్ హోదా తాత్కాలికంగా ఉపసంహరణకు గురైంది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ తాత్కాలిక ఉపసంహరణకు అనేక కారణాలు ఉన్నాయి. కొద్ది నెలలుగా ఈ బీచ్ లో వీధి కుక్కల స్వైరవిహారం, సీసీ కెమెరాలు పనిచేయక పోవడం, చెత్త, చెదారాలు పేరుకుపోవడం, మరుగుదొడ్ల నిర్వహణ అస్తవ్యస్థంగా మారడం, నడక దారులు ధ్వంసం కావడం, ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణం, దుర్గంధం, ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడం వంటివి నిత్యకృత్యమయ్యాయి. రుషికొండ బీచ్లో నెలకొన్న ఈ దుర్భర పరిస్థితులను చూసిన పర్యాటకులు.. బ్లూ ఫ్లాగ్ గుర్తింపునిచ్చిన డెన్మార్క్ ఎఫ్ఎ సంస్థకు ఫోటోలు, వీడియోలు తీసి పంపారు. వాటిపై స్పందించిన డెన్మార్కుకు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ – FEE జనవరిలో బ్లూ ఫ్లాగ్ ఇండియా నేషనల్ ఆపరేటర్ ద్వారా బ్లూ ఫ్లాగ్ గుర్తింపునకు అనుగుణంగా బీచ్‌లో చర్యలు చేపట్టాలని సూచించింది. అనంతరం ఫిబ్రవరి 13న ఈ రుషికొండ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్‌ను తాత్కాలికంగా రద్దు చేసింది.

సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం.. శరవేగంగా బీచ్ లో దిద్దుబాటు చర్యలు..

రుషికొండ బీచ్ లో బ్లూ ఫ్లాగ్ తాత్కాలిక ఉపసంహరణ తర్వాత.. ఉలిక్కిపడిన జిల్లా యంత్రాంగం నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. మరోవైపు ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని సీరియస్‌గానే పరిగణలోకి తీసుకుంది. విశాఖ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్.. జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, పోలీస్, పర్యాటక, అటవీ శాఖాధికారులతో సమావేశం నిర్వహించి రుషికొండ బీచ్‌కు పూర్వవైభవాన్ని తీసుకురావాలని ఆదేశించారు. అప్పట్నుంచి అధికారులు ఈ బీచ్లో నెలకొన్న అస్తవ్యస్థ పరిస్థితులను సరి చేసే పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్వయంగా ఈ పనులను పర్యవేక్షించారు. సాధ్యమైనంత త్వరగా మళ్లీ ఋషికొండకు పుర వైభవం తీసుకొచ్చి బ్లూ ఫ్లాగ్ హోదా వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు కలెక్టర్ హరేందిర ప్రసాద్. అందుకు తగ్గట్టుగానే ఋషికొండ బీచ్ లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించ్చారు. ఇటీవల ఈ పరిస్థితులను సమీక్షించేందుకు వచ్చిన బ్లూ ఫ్లాగ్ ఇండియా ప్రతినిధుల బృందం.. బీచ్ లో సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ను కలిసి బ్లూ ఫ్లాగ్ ను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
వశీకరణం అందుకే చేస్తారు.? కానీ దాని మంత్రాన్ని ఇలా వాడితే.!
వశీకరణం అందుకే చేస్తారు.? కానీ దాని మంత్రాన్ని ఇలా వాడితే.!
ఈ పండ్లు ఎక్క‌డైనా క‌నిపించాయా..? వెంటనే తెచ్చుకుని తినేయండి..!
ఈ పండ్లు ఎక్క‌డైనా క‌నిపించాయా..? వెంటనే తెచ్చుకుని తినేయండి..!
బాలకృష్ణతో ఆ హీరోయిన్ ఒక్క సినిమాలోనూ నటించలేదు..
బాలకృష్ణతో ఆ హీరోయిన్ ఒక్క సినిమాలోనూ నటించలేదు..
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఏంటో తెలుసా..?
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఏంటో తెలుసా..?
పేదవాడి బాదం.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆరోగ్యానికి ఢోకా లేదు..!
పేదవాడి బాదం.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆరోగ్యానికి ఢోకా లేదు..!
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి