Vijayasai Reddy: దేవుని ఆస్తులు కొల్లగొట్టడంలో ఆయన పాత్రపై అనుమానాలు.. అశోక్ గజపతిరాజుపై ఎంపీ విజయసాయి సంచలన ఆరోపణలు

Venkata Narayana

Venkata Narayana |

Updated on: Sep 03, 2021 | 12:09 PM

దేవుని ఆస్తులు కొల్లగొట్టడంలో మాజీ కేంద్రమంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు పాత్రపై అనుమానాలున్నాయని

Vijayasai Reddy: దేవుని ఆస్తులు కొల్లగొట్టడంలో ఆయన పాత్రపై అనుమానాలు.. అశోక్ గజపతిరాజుపై ఎంపీ విజయసాయి సంచలన ఆరోపణలు

YSRCP MP Vijayasai Reddy – Ashok Gajapathi Raju: దేవుని ఆస్తులు కొల్లగొట్టడంలో మాజీ కేంద్రమంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు పాత్రపై అనుమానాలున్నాయని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. అశోక్‌ గజపతిరాజు ధర్మకర్తనా.. అధర్మకర్తనా..? అనే సందేహాల్ని ఆయన వ్యక్తం చేశారు. ఆలయ ఆస్తులు కాపాడతామన్న విజయసాయి.. అప్పన్న దేవాలయ భూముల వ్యవహారంలో ఏంచేశారన్నది తేలాల్సి ఉందని ఆయన అన్నారు. అప్పన్న స్వామి భూములు అవకతవకల్లో ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతి రాజు పాత్రపై అనుమానం కలుగుతోందన్నారు విజయసాయి.

ఆలయ భూములు, దేవాలయం ఆస్తులలో అవకతవకలకు పాల్పడకపోతే, కోర్టుకు వెళ్లి మళ్ళీ పదవి ఎందుకు తెచ్చుకున్నారని విజయసాయిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. పంచగ్రామాల భూసమస్య న్యాయస్థానంలో ఉండటం వలన.. న్యాయ పరిధిలో త్వరగా పరిష్కరించే దిశగా కృషి చేస్తామని ఆయన అన్నారు.

“అశోక్ గజపతి రాజు హయాంలో దేవాలయంలో అన్ని స్కాములే.. వాటన్నిటిని వెలుగులోకి తీసుకువచ్చి దేవాలయం ఆస్తులను కాపాడతాం. అసలు దేవస్థానం ఆస్తులు పరాధీనం పాలు అవుతుంటే ఏంచేస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. 846 ఎకరాలు పరాధీనం చేస్తుంటే.. సుమారు 8 వేల కోట్లు దేవుడి ఆస్తులను కొల్లగొడుతూ ఉంటే.. తిరిగి వాటిని వెనక్కు తీసుకురాగలమా అనే మనోవేదన ఉంది. అశోక్ పైకి చెప్పేదొకటి.. లోపల చేసేది ఒకటి. ఇది వంశాచారమా.. లేక అపచారమా..? అని విజయసాయి ప్రశ్నల వర్షం కురిపించారు.

Read also: YSR Statue: 60 అడుగుల మహానేత వైఎస్ భారీ విగ్రహం ఆవిష్కరణ.. ఎక్కడంటే

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu