ఒక్క ప్రకటన ఉద్యమానికి వేయి ఏనుగుల బలమైంది.. విశాఖలో కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు, కటౌట్లు, హర్షాతిరేకాలు

KTR vizag steel : ఈ ఒక్క ప్రకటన ఉద్యమానికి వేయి ఏనుగుల బలాన్ని ఇచ్చింది. అభిమానం ఉప్పెనలా పొంగుకొచ్చింది. కేటీఆర్‌ ప్రకటనతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ ఉద్యమకారులు. ధన్యవాదాలు చెబుతూ తెలంగాణ

ఒక్క ప్రకటన ఉద్యమానికి వేయి ఏనుగుల బలమైంది.. విశాఖలో కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు, కటౌట్లు, హర్షాతిరేకాలు
Venkata Narayana

|

Mar 11, 2021 | 12:33 PM

KTR vizag steel : ఈ ఒక్క ప్రకటన ఉద్యమానికి వేయి ఏనుగుల బలాన్ని ఇచ్చింది. అభిమానం ఉప్పెనలా పొంగుకొచ్చింది. కేటీఆర్‌ ప్రకటనతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ ఉద్యమకారులు. ధన్యవాదాలు చెబుతూ తెలంగాణ తారకరామునికి పాలాభిషేకాలు చేస్తున్నారు. రిలే దీక్షలు చేస్తున్న ప్రాంతంలో కేటీఆర్‌ భారీ కటౌట్ పెట్టిన ఉద్యమకారులు… ఆయనకు క్షీరాభిషేకం చేశారు. తమకు మద్దతు ప్రకటించినందుకు థ్యాంక్స్ చెప్పారు. మిగతా నేతలంతా ఇలా ముందుకొచ్చి ఉద్యమానికి సపోర్ట్ చేయాలని అభ్యర్థించారు.

కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం ఇప్పుడు మరింత తీవ్రమవుతోంది. బయటి నుంచి కూడా ఉద్యమకారులకు మద్దతు లభిస్తోంది. తెలంగాణ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ పూర్తి స్థాయి సపోర్ట్‌ ప్రకటించారు. అవసరమైతే ‌ప్రత్యక్ష పోరాటానికి కూడా వెనకాడబోమని స్పష్టం చేసిన నేపథ్యంలో స్టీల్ సిటీలో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. కేటీఆర్‌ ప్రకటన ఇప్పుడు సంచలనం అవుతోంది. ఒక్కొక్కటిగా కేంద్రం అమ్మేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ ప్రశ్నించారు. భవిష్యత్‌లో రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అమ్మేస్తారా అంటూ నిలదీశారాయన.

సినిమా ఇండస్ట్రీలోనూ స్టీల్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా కదలిక మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి ఈ అంశంపై ట్వీట్ చేశారు. అమ్మడం అన్యాయమంటూ గళమెత్తారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి తెలంగాణ స్టేట్ నుంచే కాదు… తమిళనాడు నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఇప్పటికే స్టీల్‌ప్లాంట్‌లను ప్రైవేటీకరించాల్సిన అవసరం లేదన్నారు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి. ప్రైవేటీకరణే అన్ని సమస్యలకూ పరిష్కారం కాదన్నారు.

ఉద్యమానికి పెరుగుతున్న మద్దతు ఏ మలుపు తిరుగుతుందో అన్న సస్పెన్ష్‌ కొనసాగుతోంది. వరుసగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై వ్యతిరేకంగా వినిపిస్తున్న గళాల సంఖ్య కూడా పెరుగుతోంది. దక్షిణాదిలో పాగా వేయాలని ఎదురు చూస్తున్న బీజేపీకి ఈ పరిణామాలు కాస్త ఇబ్బందికరంగానే ఉన్నాయి.

Read also : Kollu Ravindra gets Bail : బ్రేకింగ్ న్యూస్ : మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu