AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: పర్యాటకులకు ఎగిరిగంతేసే గుడ్‌న్యూస్.. ఇక గాల్లో తేలిపోవాల్సిందే.. వీడియో చూశారా..

ఎత్తయిన కొండపై నుంచి లోతైన లోయలు పచ్చటి ప్రకృతి.. విశాలమైన సముద్రం.. అద్భుతమైన విశాఖ నగరం ఒకేసారి చూడాలని ఉందా..? అయితే కైలాసగిరి పైకి వెళ్తే చాలు.. అక్కడ స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ మిమ్మల్ని మైమరిపించే అనుభూతిని అందిస్తుంది. విమానంలో వెళ్తున్నప్పుడు ఉండే ఫీలింగ్ తో పాటు.. గాల్లో తేలినట్టు ఉండే త్రిల్ మిమ్మల్ని కట్టిపడేస్తుంది.

Vizag: పర్యాటకులకు ఎగిరిగంతేసే గుడ్‌న్యూస్.. ఇక గాల్లో తేలిపోవాల్సిందే.. వీడియో చూశారా..
Vizag Glass Bridge
Maqdood Husain Khaja
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Dec 01, 2025 | 11:57 AM

Share

పర్యాటకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చింది. వైజాగ్ ఐకానిక్ కైలాసగిరి కొండపై.. వేలాడుతున్న ఈ గాజువంతన పర్యాటకులను ఆహ్వానిస్తుంది. దేశంలోనే అతిపెద్ద కాంటీ లివర్ గ్లాస్ బ్రిడ్జ్ గా పేరుపొందిన.. ఈ వంతెన పై ఒక్కసారి అడుగుపెడితే… గాల్లో తేలినట్టుందే అనాల్సిందే..! ఒక్కో అడుగు ముందుకేసి వెళ్తుంటే.. ఆ త్రిల్ ఊహించలేనిది..!

ఎత్తయిన కొండపై నుంచి లోతైన లోయలు పచ్చటి ప్రకృతి.. విశాలమైన సముద్రం.. అద్భుతమైన విశాఖ నగరం ఒకేసారి చూడాలని ఉందా..? అయితే కైలాసగిరి పైకి వెళ్తే చాలు.. అక్కడ స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ మిమ్మల్ని మైమరిపించే అనుభూతిని అందిస్తుంది. విమానంలో వెళ్తున్నప్పుడు ఉండే ఫీలింగ్ తో పాటు.. గాల్లో తేలినట్టు ఉండే త్రిల్ మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఒక్కో అడుగు ఆ గ్లాస్ బ్రిడ్జ్ పై వేస్తుంటే.. ఆహా ఏమి హాయిలే ఇలా అని అనాల్సిందే. ఎందుకంటే చుట్టూ ప్రకృతి సుందర దృశ్యాలతో పాటు.. మిమ్మల్ని పలకరించి ఆ పిల్ల గాలులు.. మధురానుభూతిని కలిగిస్తాయి.

పర్యాటకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కైలాసగిరి పై కాంటీ లివర్ గ్లాస్ బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చేసింది. స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ ను ప్రారంభించారు ఎంపీ శ్రీ భరత్. విఎంఆర్డిఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హాజరయ్యారు. దీంతో దేశంలోనే అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జ్ పర్యాటకులకు అందుబాటులకు వచ్చినట్టుంది.

వీడియో చూడండి..

భీకర గాలులు సైతం తట్టుకునేలా..

పి పి పి మోడల్ లో వీఎమ్ఆర్డిఏ.. ఏడు కోట్ల ఖర్చుతో.. 55 మీటర్ల పొడవున్న గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది. 100 మంది సందర్శకులు బరువు ఒకేసారి మోసేలా, భీకర గాలులు తట్టుకునేలా నిర్మాణం జరిగింది. సముద్రమట్టానికి 1020 అడుగుల ఎత్తులో వేలాడే కాంటీ లివర్ గ్లాస్ బ్రిడ్జ్ ఇది. వైజాగ్ టూరిజంలో ఇదో ఐకానిక్ డెస్టినేషన్. వైజాగ్ లో అడ్వెంచర్ టూరిజంలో భాగంగా దీన్ని నిర్మాణం చేశారు.

దేశంలోనే పొడవైన గాజువంతెన..

ఇప్పటివరకు కేరళలోని 40 మీటర్ల గాజు వంతెన దేశంలో పొడవైనదిగా ఉండేది. అయితే.. కైలాసగిరిపై నిర్మించిన ఈ గ్లాస్ బిట్స్.. దానిని అధిగమించి దేశంలోనే అతి పొడవైన కాంటీ లివర్ బ్రిడ్జిగా ప్రఖ్యాతిని సొంతం చేసుకుంది. రాత్రిపూట అయితే ఈ బ్రిడ్జ్.. త్రివర్ణ రంగులతో కూడిన విద్యుత్తు కాంతులతో ఈ వంతెన మెరిసిపోతుంది. వాస్తవానికి ఇప్పటికే పర్యాటకులకు అందుబాటులోకి రావాలి. కానీ. పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, పలుమార్లు పరిశీలించి.. మార్పులు చేసిన తర్వాతే సందర్శకుల కోసం సిద్ధం చేశారు.

క్యూ కడుతున్న సందర్శకులు..

గ్లాస్ బ్రిడ్జ్.. ప్రారంభం కాగానే పర్యాటకులు క్యూ కడుతున్నారు. బ్రిడ్జి పైకి వెళ్లి ఏమి హాయిలే ఇలా అంటూ వివరిస్తున్నారు. చెప్పలేనంత అనుభూతిని పొందుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ బ్రిడ్జిపైకి ఎక్కి చూస్తే ఆ చుట్టూ ఎత్తయిన కొండలు.. కింది భాగంలో లోయ.. దూరంగా సముద్రం కనిపిస్తుంది. ఈ బ్రిడ్జిపై నుంచి చూస్తే గాల్లో తేలియాడుతున్నట్లుగా.. అదేదో కొత్త లోకంలో విహరిస్తున్న భావన కలుగుతుంది అంటున్నారు సందర్శకులు..

ఒకేసారి 40మందికి..

ఈ గ్లాస్ బ్రిడ్జి నిర్మాణం కోసం 40 ఎంఎం మందం కలిగిన ల్యామినేటెడ్‌ గాజుతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం చేశారు. ఈ గాజును జర్మనీ నుంచి దిగుమతి చేశారు. ఈ బ్రిడ్జి పొడవు 55 మీటర్లు కాగా.. ఒకేసారి 500 టన్నుల భారం మోస్తుంది. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా తట్టుకోగలదు. భీకర తుఫాను నైనా ఎదుర్కోగలదు. ఒకేసారి ఈ బ్రిడ్జిపైకి వందమంది వెళ్లే సామర్థ్యంతో నిర్మించిన.. భద్రతా కారణాల దృశ్యా 40 మంది పర్యాటకులకు మాత్రమే అనుమతిస్తామని నిర్వాహకుడు రాజేష్ తెలిపారు.

ఈ బ్రిడ్జిపై నిరంతరం నిఘా ఉంటుంది.. పర్యటకులకు గైడ్ చేసేందుకు భద్రతాపరంగా కూడా కొంతమంది సిబ్బందిని పెడుతున్నారు. చెప్పులు శూలతో ఈ గ్లాస్ బ్రిడ్జ్ పైకి అనుమతించరు. ప్రత్యేకంగా.. కాళ్లకు సాక్సులు వేసుకొని మాత్రమే పైకి వెళ్లాలి. నిర్వాహకులే వాటిని సమకూరుస్తారు. చూశారుగా దేశంలోనే అతిపెద్ద కాంటి లివర్ గ్లాస్ బ్రిడ్జిని..! మరి ఇంకెందుకు ఆలస్యం మీరు వచ్చి ఒకసారి.. స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ పై నడిచి.. అద్భుతమైన అడ్వెంచర్ త్రిల్ అనుభవించండి మరి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..