AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam: ఆశ్రమంలో ఆవుల వరుస మరణాల కలకలం.. కారణాలపై ఆరా తీస్తున్న అధికారులు

విశాఖపట్నం వెంకోజిపాలెంలోని జ్ఞానానంద ఆశ్రమంలో.. ఆవులు వరుసగా మృత్యువాతపడటం కలకలం రేపుతోంది. అక్కడ ఒకేసారి 12 ఆవులు, దూడలు చనిపోవడం..

Visakhapatnam: ఆశ్రమంలో ఆవుల వరుస మరణాల కలకలం.. కారణాలపై ఆరా తీస్తున్న అధికారులు
Representative Image
Janardhan Veluru
|

Updated on: Dec 17, 2021 | 4:01 PM

Share

విశాఖపట్నం వెంకోజిపాలెంలోని జ్ఞానానంద ఆశ్రమంలో.. ఆవులు వరుసగా మృత్యువాతపడటం కలకలం రేపుతోంది. అక్కడ ఒకేసారి 12 ఆవులు, దూడలు చనిపోవడం.. చర్చనీయాంశమవుతోంది. సరైన ఆహారం లేక చనిపోతున్నాయా? లేక ఏదైనా వ్యాధి సోకి మృత్యువాత పడుతున్నాయా? అనే విషయంలో గందరగోళం నెలకొంది. ఈ విషయం బయటకు పొక్కడంతో పశుసంవర్ధక శాఖ అధికారులు ఆశ్రమానికి చేరుకున్నారు. అనారోగ్యంగా ఉన్న ఆవులను పశు వైద్యులు పరీక్షిస్తున్నారు. సరైన ఆహారం, నీరు లేకపోవడం వల్ల.. మూగజీవాలు డీ హైడ్రేట్‌ అవుతున్నాయని తెలిపారు.

ఈ అంశంపై వివరణ ఇచ్చిన దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి… జ్ఞానానంద ఆశ్రమం ప్రభుత్వ పరిధిలో లేదని చెబుతున్నారు. ఆశ్రమం లోపలి శివాలయం మాత్రమే దేవాదాయ శాఖకు చెందినదని చెప్పారు. అంతేకాదు, ఆ ఆవులను దేవాదాయశాఖకు అప్పగించేందుకు రామానంద అంగీకరించడం లేదని అధికారులంటున్నారు. వాటి సంరక్షణ చూడాలని స్థానిక ఈఓకి చెప్పామంటున్నారు. అయితే, ఈ ఆశ్రమం విషయాల్లో కలగ జేసుకోవద్దని కోర్టు ఆర్డర్స్‌ ఉండటంతోనే.. తామేమీ చేయలేకపోయామని ఈవో చెబుతున్నారు. గోవుల కు దాణా వేయడంతో పాటు.. వాటి ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు.

జ్ఞానానంద ఆశ్రమాన్ని సందర్శించారు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. పశువులకు స్వయంగా తనచేతులతో దాణా అందించారు. గోవుల మృతిచెందడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వెలగపూడి….ఒకేసారి పది ఆవులు మృతి చెందటం చాలా దారుణమన్నారు. గోవుల మృతికి ప్రధాన కారణం దేవాదాయశాఖ అధికారులు, పోలీసులేనని ఆరోపించారు. అక్రమంగా బయటి రాష్ట్రాలకు తరలిస్తున్న గోవులను పట్టుకుంటున్న పోలీసులు.. ఆశ్రమానికి అప్పజెబుతున్నారనీ… దీనిపై దేవాదాయ శాఖ అధికారులకు ఎటువంటి సమాచారం లేదనీ విమర్శించారు. తక్షణం ఇక్కడి గోవులకు తక్షణం వైద్య సేవలు అందించి… దానా , తాగునీరు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై కలెక్టర్ కు కూడా సమాచారం ఇచ్చినట్టు చెప్పారు ఎమ్మెల్యే.

Also Read..

FactCheck: విశాఖకు ఐటీ నగరంగా గుర్తింపు తెచ్చిన సంస్థ హెచ్‌ఎస్‌బీసీ శాఖ మూతపడుతోందా..? క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

Hyderabad: హైదరాబాద్‌లో అమానుషం.. బిర్యానీ తినేందుకు వెళ్లిన కార్మికుడు చివరకు..