నేడు టీటీడీ పాలక మండలి సమావేశం.. ప్రత్యక్ష ప్రసారం

నేడు టీటీడీ పాలక మండలి సమావేశం కానుంది. కరోనా నిబంధనల నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగనుంది.

నేడు టీటీడీ పాలక మండలి సమావేశం.. ప్రత్యక్ష ప్రసారం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 28, 2020 | 8:50 AM

TTD Board Meeting: నేడు టీటీడీ పాలక మండలి సమావేశం కానుంది. కరోనా నిబంధనల నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగనుంది. ఉదయం గం.10.30ని.లకు ఈ సమావేశాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. బోర్డు సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని ఆ మధ్యన టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌ సింఘాల్‌, అడిషనల్ ఈవో ధర్మా రెడ్డి నేరుగా పాల్గొననుండగా.. మొత్తం 52 అంశాలపై చర్చించనున్నారు. వీటితో పాటు టేబుల్ ఎజెండాగా రెండు, మూడు అంశాలు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సమావేశంలో ముఖ్యంగా.. బ్రహ్మోత్సవాల నిర్వహణ, టీటీడీ ఆర్థిక పరిస్థితి, కార్పస్ ఫండ్ నిధుల విత్ డ్రా, జమ్ములో శ్రీవారి ఆలయ నిర్మాణంపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే దర్శనాల సంఖ్య పెంచాలని భక్తుల నుండి టీటీడీకి విజ్ఞప్తులు వస్తుండటంతో దానిపై కూడా సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. వీటతో పాటు ఉచిత దర్శన టోకన్లను పునరుద్దరించే అవకాశంపై చర్చించనున్నారు.

ఇంకా ఏఏ అంశాలపై చర్చించనున్నారంటే:

1.భక్తులు సమర్పించిన బంగారు ఆభరణాలను బిస్కెట్లుగా మార్చి 12 ఏళ్ల పాటు ఎస్బీఐలో డిపాజిట్ చేసే అంశం

2.నగదు డిపాజిట్ విధానంపై ఫైనాన్షియల్ కమిటీ ఇచ్చిన సూచనలపై

3.లాక్‌డౌన్‌ కారణంగా శ్రీవారి ఆర్జిత సేవలకు హాజరుకాలేకపోయి టికెట్లు ఉన్న భక్తులను బ్రేక్ దర్శనాలకు అనుమతించాలనే అంశంపై

4.ఎస్‌పీఎఫ్‌ విభాగానికి సర్వీస్ ట్యాక్స్ చెల్లింపుపై నిర్ణయం

5. టీటీడీ ఉద్యోగులను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కిందకు తీసుకురావాలనే ఆంశం

6. తెలుగు అకాడమీకి తిరుపతిలో భవనం కేటాయింపుపై నిర్ణయం

7. భద్రతా పర్యవేక్షణ కోసం వాహనాల కొనుగోలు, ఎక్స్ రే బ్యాగేజ్ స్కానర్ల కొనుగోలుపై చర్చ

8. 2021 క్యాలెండర్లు, డైరీల ముద్రణకు అనుమతి

9.రెడ్ క్రాస్ సొసైటీకి తిరుపతిలో అద్దె ప్రతిపాదన భవనం కేటాయింపుపై అధికారులు చర్చించనున్నారు.

Read More:

యువతతో పెద్దలకు తీవ్ర ముప్పు.. డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక

కాస్మొటిక్స్‌పై ‘నిఘా’ పెట్టనున్న కేంద్రం!