ఆర్టీసీ ఉద్యోగులు అటా.. ? ఇటా..?

ఆర్టీసీ సమ్మె కొనసాగుతూ నెలరోజులు దాటింది. అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు మెట్టుదిగక పోవడంతో.. సమ్మె తీవ్ర స్థాయికి చేరుకుంది. మరోవైపు చర్చలు లేవంటూ ప్రభుత్వం తేల్చిచెప్పడంతో.. పలువురు ఆర్టీసీ కార్మికులు ఆందోళనలో పడుతుండగా.. కార్మిక సంఘాలు మాత్రం.. సమ్మె విరమించేది లేదంటూ.. మొండికేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ సోమవారం అధికారులతో మరోసారి సమీక్షా సమవేశం చేపట్టారు. గడువులోగా కార్మికులు విధుల్లో చేరకుంటే మిగిలిన 5 వేల ప్రైవేట్ వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం […]

ఆర్టీసీ ఉద్యోగులు అటా.. ? ఇటా..?
Follow us

| Edited By:

Updated on: Nov 05, 2019 | 6:48 PM

ఆర్టీసీ సమ్మె కొనసాగుతూ నెలరోజులు దాటింది. అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు మెట్టుదిగక పోవడంతో.. సమ్మె తీవ్ర స్థాయికి చేరుకుంది. మరోవైపు చర్చలు లేవంటూ ప్రభుత్వం తేల్చిచెప్పడంతో.. పలువురు ఆర్టీసీ కార్మికులు ఆందోళనలో పడుతుండగా.. కార్మిక సంఘాలు మాత్రం.. సమ్మె విరమించేది లేదంటూ.. మొండికేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ సోమవారం అధికారులతో మరోసారి సమీక్షా సమవేశం చేపట్టారు.

గడువులోగా కార్మికులు విధుల్లో చేరకుంటే మిగిలిన 5 వేల ప్రైవేట్ వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తేల్చి చెప్పారు. మూడు రోజుల ముందే ఆర్టీసీ సమ్మె విషయంపై సమీక్షా నిర్వహించిన సీఎం కేసీఆర్.. నవంబర్ 5వ తేదీ అర్ధరాత్రిలోగా చివరి గడువు ఇస్తున్నామంటూ.. కార్మికులకు సూచించారు. గడువులోగా విధుల్లో చేరిన వారికి పూర్తి ఉద్యోగ భద్రత ఉంటుందంటూ.. భరోసా ఇచ్చారు. అయితే ఆ తర్వాత సమ్మె చేపడుతున్న పలువురు కార్మికులు సీఎం కేసీఆర్ సూచనతో సమ్మె విరమిస్తూ.. విధుల్లోకి చేరారు. అయితే తాజాగా నిన్న రాత్రి కూడా మరోసారి కార్మికులకు అల్టిమేటం జారీ చేశారు. ఇవాళ రాత్రి లోగా విధుల్లో చేరకపోతే.. ఇక తెలంగాణలో ఆర్టీసీ ఉండదని తెలిపారు. అంతేకాదు.. మిగతా రూట్లను కూడా ప్రైవేట్ పరం చేస్తామన్నారు.

ఇవాళ అర్ధరాత్రి లోగా విధుల్లో చేరని ఆర్టీసీ కార్మికులను తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగంలో చేర్చుకోవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని కార్మికులు వినియోగించుకోవాలనీ, లేదంటే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా ప్రభుత్వం తెలిపింది. అనవసరమైన యూనియన్ల నిర్ణయాల వల్ల తమ కుటుంబాలను ఇబ్బందుల పాలు చేయవద్దని ప్రభుత్వం ఈ సందర్భగా కార్మికులకు తెలియపర్చింది. ఈ నేపథ్యంలో కార్మికులు ఇప్పుడు అటా.. ఇటా అన్న సందిగ్ధంలో పడిపోయారు. ఇటు యూనియన్లు చెప్పింది విని హక్కులను సాధించుకోవడమా.. లేదా.. సమ్మె విరమించి ఉద్యోగంలో చేరాలా అన్న దానిపై డైలామాలో పడ్డారు. ప్రభుత్వం విధించిన గడువు.. మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో.. ఆర్టీసీ కార్మికులు ఏం నిర్ణయం తీసుకుంటారో అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక కార్మికులు ఇటు ప్రభుత్వం వైపా.. లేక సమ్మె వైపా అన్నది మరికాసేపట్లో తేలిపోతుంది.