రెవెన్యూ అధికారుల్లో భయం భయం.. ఏం చేస్తున్నారంటే..!

ఎమ్మార్వో విజయారెడ్డి సజీవ దహనం ఘటన తెలుగు రాష్ట్రాల్లోని రెవెన్యూ అధికారుల్లో భయాన్ని కలిగిస్తోంది. తమకు కూడా ఇలానే అవుతుందన్న భయం రెవెన్యూ అధికారుల్లో పెరుగుతోంది. దానికి తోడు మంగళవారం యాదాద్రి జిల్లాలో ఓ మహిళా రైతు రెవెన్యూ ఉద్యోగులను రోడ్డు మీదే కడిగేసింది. పాసుపుస్తకాల కోసం తన నుంచి తీసుకున్న లంచాన్ని తిరిగి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసింది. దీంతో ఆమెకు ఏం చెప్పలేక.. అక్కడి నుంచి వారు వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే కొందరు అధికారులు […]

రెవెన్యూ అధికారుల్లో భయం భయం.. ఏం చేస్తున్నారంటే..!
Follow us

| Edited By:

Updated on: Nov 06, 2019 | 1:24 PM

ఎమ్మార్వో విజయారెడ్డి సజీవ దహనం ఘటన తెలుగు రాష్ట్రాల్లోని రెవెన్యూ అధికారుల్లో భయాన్ని కలిగిస్తోంది. తమకు కూడా ఇలానే అవుతుందన్న భయం రెవెన్యూ అధికారుల్లో పెరుగుతోంది. దానికి తోడు మంగళవారం యాదాద్రి జిల్లాలో ఓ మహిళా రైతు రెవెన్యూ ఉద్యోగులను రోడ్డు మీదే కడిగేసింది. పాసుపుస్తకాల కోసం తన నుంచి తీసుకున్న లంచాన్ని తిరిగి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసింది. దీంతో ఆమెకు ఏం చెప్పలేక.. అక్కడి నుంచి వారు వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే కొందరు అధికారులు తమ ప్రాణాలను రక్షించుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తాజాగా కర్నూల్ జిల్లా పత్తికొండ తహశీల్దార్ ఉమామహేశ్వరి తన చాంబర్‌లో అడ్డుగా ఓ తాడును కట్టించింది. అర్జీలు ఇచ్చేవారు ఎవరైనా తాడు బయట నుంచే ఇవ్వాలని, లోపలికి ఎవ్వరినీ అనుమతించొద్దని ఆమె సిబ్బందిని ఆదేశించారు. దీంతో అక్కడకు వెళ్లిన ప్రజలు, సిబ్బంది ఆశ్చర్యపోతున్నారట. దీనిపై ఆమెను ప్రశ్నిస్తే.. మా జాగ్రత్త మేం తీసుకోవాలి కదా అంటున్నారట. అంతేకాదు రెవెన్యూ అధికారుల్లో ఇన్నిరోజులు అవినీతికి పాల్పడ్డ వారు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అలాగే ఎవరినైనా తమ వద్దకు పంపేముందు చెక్ చేసి పంపించాలని తమ కింది సిబ్బందికి చెబుతున్నారట. ఇక లంచాలు తీసుకున్న అధికారులు కూడా పనులను త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారట. ఇక కొంతమందేమో.. తమకు రక్షణ కల్పించాలని కొత్త డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నారట.