ఐపీఎస్‌ కాగానే ప్లేటు ఫిరాయించి.. అధికారుల పేర్లు చెప్పి బెదిరిస్తున్నాడు..!

గతంలో.. ట్రైనీ ఐపీఎస్ మహేష్ రెడ్డి తనను పెళ్లి చేసుకుని మోసం చేశారంటూ.. ఓ యువతి పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం.. ఆమెకు ప్రాణభయం ఉందటూ.. మరోసారి మీడియా ముందుకొచ్చింది.. సబ్‌ రిజిస్ట్రార్ ఉద్యోగి భావన. నేను విడాకులు ఇవ్వనందుకు అతను.. నన్ను బెదిరిస్తున్నాడని.. మీడియా ముందు వాపోయింది మహిళ. ఈ విషయంపై డీజీపీని సంప్రదిస్తే.. సీపీ మహేష్ భగవత్‌ను సంప్రదించమన్నారని.. ఆయనకు చెప్పినా.. పట్టించుకోవడం లేదని.. అతను ఇప్పుడు.. ఐపీఎస్ ఆఫీసర్‌ కదా.. […]

ఐపీఎస్‌ కాగానే ప్లేటు ఫిరాయించి.. అధికారుల పేర్లు చెప్పి బెదిరిస్తున్నాడు..!
Follow us

| Edited By:

Updated on: Nov 06, 2019 | 2:06 PM

గతంలో.. ట్రైనీ ఐపీఎస్ మహేష్ రెడ్డి తనను పెళ్లి చేసుకుని మోసం చేశారంటూ.. ఓ యువతి పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం.. ఆమెకు ప్రాణభయం ఉందటూ.. మరోసారి మీడియా ముందుకొచ్చింది.. సబ్‌ రిజిస్ట్రార్ ఉద్యోగి భావన. నేను విడాకులు ఇవ్వనందుకు అతను.. నన్ను బెదిరిస్తున్నాడని.. మీడియా ముందు వాపోయింది మహిళ. ఈ విషయంపై డీజీపీని సంప్రదిస్తే.. సీపీ మహేష్ భగవత్‌ను సంప్రదించమన్నారని.. ఆయనకు చెప్పినా.. పట్టించుకోవడం లేదని.. అతను ఇప్పుడు.. ఐపీఎస్ ఆఫీసర్‌ కదా.. తనని ఇబ్బంది పెట్టకండి అంటూ చెబుతున్నారంటూ.. ఆమె అసహాయతను వ్యక్తం చేసింది.

అంతేకాకుండా.. కుషాయిగూడ ఏసీపీని కలిస్తే.. అవమానకరంగా మాట్లాడారని.. నా గురించి అసలు పట్టించుకోవడం లేదంటూ.. అంతేకాకుండా.. సెటిల్‌మెంట్ చేసుకోవాలంటూ.. సలహాలు ఇచ్చారంటూ.. ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కారణంగా.. పోలీసులు నామ మాత్రంగా కేస్ బుక్ చేశారే తప్ప.. దానికి తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ.. భావన కన్నీరుమున్నీరయ్యింది.

అంతేకాకుండా… ట్రైనీ ఐపీఎస్ మహేష్ నుంచి అతని కుటుంబ సభ్యుల నుంచి నాకు ప్రాణ హాని ఉందని.. ఏపీకి చెందిన రాజకీయ పెద్దల పేర్లు చెప్పి నన్ను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని చెప్పింది భావన. ఎలాగైనా.. నా భర్త నాకు కావాలి. అతను ఐపీఎస్ అవడంతో.. పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఆఖరికి జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులను కలిసినా ప్రయోజనం లేదని భావన వాపోయింది.

వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లాకు చెందిన కొకంటి మహేష్‌రెడ్డి, హైదరాబాద్‌ శివారు దమ్మాయిగూడకు చెందిన భావన ఇద్దరూ ఉస్మానియాలో ఇంజినీరింగ్‌ చదివారు. చదువుకునే వయస్సులో వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో రెండేళ్ల కిందట భావనకు రైల్వేలో ఉద్యోగం రాగా.. మహేష్‌రెడ్డి సివిల్‌ సర్వీసెస్‌కు ప్రిపేర్ అవుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో అతడికి భావన అండగా నిలిచింది. ఆ తరువాత 2018లో కీసరలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మహేష్‌రెడ్డి, భావనను వివాహం చేసుకున్నాడు. సికింద్రాబాద్‌ పద్మారావునగర్‌లో వీరు నివాసం ఉంటున్నారు.