AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పోలీస్ స్టేషన్లో లేడీ కానిస్టేబుల్‌ మొబైల్ మాయం.. సీసీటీవీ చెక్ చేయగా..!

విశాఖలోని ఓ పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్ మొబైల్‌ని నెక్కేశాడు ఓ వ్యక్తి. సీసీటీవీ చూడగా అతని చేతివాటం తెలిసింది. పోలీసులు అతడిని వెతికి పట్టుకొని మొబైల్ ఫోను స్వాధీనం చేసుకున్నారు. అయితే అప్పటికి సిమ్ కార్డును తీసి పడేసినట్టు గుర్తించారు. నిందితుడు పై కేసు నమోదు చేశారు పోలీసులు.

Andhra Pradesh: పోలీస్ స్టేషన్లో లేడీ కానిస్టేబుల్‌ మొబైల్ మాయం.. సీసీటీవీ చెక్ చేయగా..!
Duvvada Police Station
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Jan 18, 2025 | 7:54 PM

Share

ఏదైనా వస్తువు చోరీ జరిగితే పోలీసులను ఆశ్రయిస్తాం.. దీంతో పోలీసులు రంగంలోకి దిగుతారు.. ఆధారాలను సేకరించి.. దొంగలను పట్టుకుంటారు.. చోరీ సొత్తు రికవరీ చేసి ఆ దొంగను కటకటాల వెనక్కు పంపుతారు. మరి పోలీసుల వస్తువులే చోరికి గురైతే..? అది కూడా ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే దొంగతనం జరిగితే..? అదే జరిగింది విశాఖ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్లో.. మహిళా కానిస్టేబుల్ మొబైల్ ను నొక్కేశాడు ఓ వ్యక్తి..

వివరాల్లోకి వెళ్తే.. జనవరి 13.. భోగి రోజు.. పండగ కావడంతో ఓ మహిళా కానిస్టేబుల్ దువ్వాడ పోలీస్ స్టేషన్ ఆవరణలో ముగ్గులు వేస్తోంది. ఇదే సమయంలో తన సెల్ ఫోన్ను టేబుల్ పై పెట్టింది. అయితే.. పెదగంట్యాడ మండలం నమ్మిదొడ్డి జంక్షన్ వద్ద పేకాట శిబిరం నడుస్తోంది. కొంతమందిని పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు పోలీసులు. దువ్వాడ పోలీస్ స్టేషన్లో పెట్టారు. అయితే ష్యూరిటీ కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మానేపల్లి సత్యనారాయణ అనే వ్యక్తి.. చేతివాటం చూపించాడు. మొబైల్ ఫోన్‌తో మెల్లగా అక్కడ నుంచి జారుకున్నాడు. దీంతో మొబైల్ కోసం టేబుల్ పై చూసిన ఆ మహిళా కానిస్టేబుల్ అవాక్కయింది. అక్కడ పెట్టిన మొబైల్ కనిపించకపోవడంతో కంగారు పడింది. పోలీస్ స్టేషన్లో తన సిబ్బందికి అడిగింది. ఎవరు దగ్గర లేకపోవడంతో.. పోలీస్ స్టేషన్ ఆవరణలో వెతికింది. ఎక్కడా ఆ మొబైల్ కనిపించలేదు.

సిబ్బంది అంతా కలిసి సిసి ఫుటెజ్ చెక్ చేయాలని నిర్ణయించారు. చెక్ చేసేసరికి.. సీసీ ఫుటేజ్ లో సెల్ఫోన్ ను మెల్లగా తస్కరించి జేబులో పెట్టుకుని జారుకున్న ఆ వ్యక్తి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. నిందితుడు వడ్లపూడి ప్రాంతానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తిగా గుర్తించారు. అతడిని వెతికి పట్టుకొని మొబైల్ ఫోను స్వాధీనం చేసుకున్నారు. అయితే అప్పటికి సిమ్ కార్డును తీసి పడేసినట్టు గుర్తించారు. నిందితుడు పై కేసు నమోదు చేశారు పోలీసులు. పోలీస్ స్టేషన్లోనే చోరీ చేస్తాడా..? అది కూడా కానిస్టేబుల్ కు చెందిన సెల్ఫోన్..! వాడికి ఎంత ధైర్యం రా బాబు అంటూ అనుకున్నారు అదే పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది.

రాయ్‌పూర్ టీ20లో భారత్ ఊచకోత..ఒకే మ్యాచ్‌లో 5 ప్రపంచ రికార్డులు
రాయ్‌పూర్ టీ20లో భారత్ ఊచకోత..ఒకే మ్యాచ్‌లో 5 ప్రపంచ రికార్డులు
దేశ బంగారు రాజధాని.. ప్రతి గల్లీలో పసిడి కాంతులే.. సౌతిండియా..
దేశ బంగారు రాజధాని.. ప్రతి గల్లీలో పసిడి కాంతులే.. సౌతిండియా..
సెట్‌లో ఒకసారి ఎన్టీఆర్‌ను తిట్టానని.. ఆయన తల్లి ఏం చేసిందంటే
సెట్‌లో ఒకసారి ఎన్టీఆర్‌ను తిట్టానని.. ఆయన తల్లి ఏం చేసిందంటే
సన్‌రైజర్స్ నయా రికార్డ్.. వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు కావ్య సేన
సన్‌రైజర్స్ నయా రికార్డ్.. వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు కావ్య సేన
అక్కడ SI.. తెలుగులో విలన్.. దేవి సినిమా నటుడి గురించి తెలిస్తే..
అక్కడ SI.. తెలుగులో విలన్.. దేవి సినిమా నటుడి గురించి తెలిస్తే..
అనేక రోగలను దూరం చేసే బెస్ట్ స్నా..రోజూ తింటే ఈ సమస్యలన్నీ దూరం..
అనేక రోగలను దూరం చేసే బెస్ట్ స్నా..రోజూ తింటే ఈ సమస్యలన్నీ దూరం..
మామిడి తోటలో ఒక్కసారిగా చెలరేగిన అలజడి.. దూరం నుంచి చూడగా
మామిడి తోటలో ఒక్కసారిగా చెలరేగిన అలజడి.. దూరం నుంచి చూడగా
పుష్పరాగము ఉంగరం ధరిస్తే.. మీ జీవితంలో ఊహించని లాభాలు చూస్తారు..!
పుష్పరాగము ఉంగరం ధరిస్తే.. మీ జీవితంలో ఊహించని లాభాలు చూస్తారు..!
లోన్ కట్టలేదని ఇల్లు జప్తు.. యజమాని ఏం చేశాడో తెలిస్తే
లోన్ కట్టలేదని ఇల్లు జప్తు.. యజమాని ఏం చేశాడో తెలిస్తే
కుక్క కరిచిన వెంటనే ఏం చేయాలి..? మీరు చేసే ఈ పొరపాట్లతో మీ..
కుక్క కరిచిన వెంటనే ఏం చేయాలి..? మీరు చేసే ఈ పొరపాట్లతో మీ..