ముగిసిన షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By:

Updated on: Oct 14, 2020 | 5:02 PM

కరోనా పరిస్థితుల నేపథ్యంలో లోక సంక్షేమార్థం శ్రీ‌వారిని ప్రార్థిస్తూ టీటీడీ చేప‌ట్టిన షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష ఇవాళ్టితో  ముగిసింది.

ముగిసిన షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష

sundarakanda deeksha TTD: కరోనా పరిస్థితుల నేపథ్యంలో లోక సంక్షేమార్థం శ్రీ‌వారిని ప్రార్థిస్తూ టీటీడీ చేప‌ట్టిన షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష ఇవాళ్టితో  ముగిసింది. పూర్ణాహుతితో దీక్ష ముగియగా.. టీటీడీ నూతన ఈవోగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జవహర్ రెడ్డి ఈ దీక్షలో పాల్గొన్నారు. కాగా తిరుమ‌ల‌లోని వ‌సంత మండ‌పంలో గత నెల 29న ఈ దీక్ష ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సుంద‌ర‌కాండ‌లోని మొత్తం 68 స‌ర్గ‌ల్లో గల 2,821 శ్లోకాల‌ను.. 16 మంది ఉపాసకులు, 16 రోజుల పాటు దీక్షాశ్రద్ధలతో పారాయ‌ణం చేశారు. ఇక శ్రీ‌వారి భ‌క్తుల కోసం ప్ర‌తిరోజూ ఉద‌యం 9 గంట‌ల నుండి గంట పాటు ఎస్వీబీసీ ఛానెల్‌లో ఈ కార్యక్రమం ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం అయ్యింది.

ఇక దీక్ష ముగిసిన అనంతరం జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. దీక్ష‌లో పాల్గొన‌డం చాలా సంతోషంగా ఉంద‌ని అన్నారు.  మహా సంకల్పంతో ఈ దీక్ష చేపట్టిన అదనపు ఈవో ధర్మారెడ్డిని అభినందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమ నిర్వహణకు విరాళాలు అందించిన  దాతలకు కృతఙ్ఞతలని అన్నారు. దేవదేవుని ఆశీస్సులతో కరోనా మహమ్మారి పూర్తిగా అంతం అవుతుందని భావిస్తున్నట్లు జవహర్ రెడ్డి వెల్లడించారు.

Read More:

నిర్వీర్యం చేస్తుండగా పేలిన రెండో ప్రపంచ యుద్ధపు అతి పెద్ద బాంబు

ఆ ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టిన సమంత..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu