Vizag Steel : విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ తధ్యం, రాష్ట్రానికి ఈక్విటీ షేర్ లేదు, వందశాతం పెట్టుబడులు వెనక్కి : మళ్లీ చెప్పిన కేంద్రం
Privatization of Visakhapatnam Steel : విశాఖ స్టీల్‌ను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరిస్తామని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వానికి ఈ వ్యవహారంతో సంబంధం లేదని పార్లమెంట్..
Privatization of Visakhapatnam Steel : విశాఖ స్టీల్‌ను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరిస్తామని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వానికి ఈ వ్యవహారంతో సంబంధం లేదని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది కేంద్రం. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో రాష్ట్రానికి ఈక్విటీ షేర్ లేదని , వందశాతం పెట్టుబడులను ఉపసంహరిస్తామని తేల్చిచెప్పింది. మెరుగైన ఉత్పాదకత కోసమే ప్రైవేటీకరిస్టున్నట్టు ఏపీ ఎంపీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై భారీగా నిరసనలు వెల్లువెత్తినప్పటికి కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ అంశంపై ఇప్పటికే సాక్షాత్తూ ప్రధాని మోదీకూడా తేల్చి చెప్పేసిన సంగతి తెలిసిందే.
అంతేకాదు, రామాయపట్నం పోర్టు నిర్మాణానికి కూడా సాయం చేయలేమని కేంద్రం పార్లమెంట్‌లో స్పష్టం చేసింది. విభజన చట్టం ప్రకారం పెద్ద పోర్టుల అభివృద్ధి మాత్రమే కేంద్రానిదని, నాన్ మేజర్ పోర్టుల అభివృద్ధి బాధ్యత రాష్ట్రాలదే అని వివరించింది. కేంద్రం రామాయపట్నం అభివృద్ధి చేయాలంటే చట్టంలో మార్పులు తేవాలని రాజ్యసభలో టీజీ వెంకటేష్ ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.