Kamma Community : కమ్మ సామాజికవర్గ ఆత్మీయసమ్మేళనంలో విజయసాయిరెడ్డి, ప్రభుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని వెల్లడి
Kamma community : కమ్మ సామాజికవర్గ ఆత్మీయసమ్మేళనంలో విజయసాయిరెడ్డి, ప్రభుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని వెల్లడి వైసీపీ ప్రభుత్వం ఏ సామాజికవర్గానికీ వ్యతిరేకం కాదని వైఆర్ఎస్ఆర్..
Kamma community : కమ్మ సామాజికవర్గ ఆత్మీయసమ్మేళనంలో విజయసాయిరెడ్డి, ప్రభుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని వెల్లడి వైసీపీ ప్రభుత్వం ఏ సామాజికవర్గానికీ వ్యతిరేకం కాదని వైఆర్ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. కులాల విషయంలో తమకు పెద్ద పట్టింపు ఉండదన్నారాయన. ఎవరైనా ఒకటే దృష్టితో చూస్తామన్నారు. నగర పాలక సంస్థ ఎన్నికలలో కులాలకు, మతాలకు అతీతంగా తమ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్ధించారు. జీవీఎంసీ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ గెలుపు తథ్యమన్నారు. విశాఖపట్నంలో ఇవాళ నిర్వహించిన కమ్మ సామాజిక వర్గ ఆత్మీయసమ్మేళనంలో విజయసాయిరెడ్డి పాల్గొన్న సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి సహకారం కావాలన్నా.. అన్ని విధాల తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత అయిన విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ ఎంవివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Read also : Gold features : ధరలు తగ్గుతున్నాయి.. బంగారం కొనేందుకు ఇది సరైన సమయమేనా? కొన్నాళ్లు ఆగితే బెటరా?