Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేకుల షెడ్డుకు రూ.6 లక్షల కరెంట్ బిల్లు..!

మీరు కరెంట్.. ఆదా చేసినా.. లేక ఎక్కువ వినియోగించినా.. వారు వేసే బిల్లునే వేస్తారు. ఇదేంటని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు. వేసవికాలంలో.. అయితే.. ఓకే కరెంట్ బిల్లులు ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే.. ఎండవేడికి.. కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి. కానీ.. వర్షాకాలంలో.. అదీ ఓ చిన్నపాటి రేకుల షెడ్డుకు అక్షరాలా.. రూ.6 లక్షల కరెంట్ బిల్లు వేశారు అక్కడి అధికారులు. ఇది చూసిన ఆ షెడ్డులోని వ్యక్తులు, అక్కడి జనాలు షాక్ తిన్నారు. వివరాల్లోకి వెళ్తే.. […]

రేకుల షెడ్డుకు రూ.6 లక్షల కరెంట్ బిల్లు..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 17, 2019 | 9:21 AM

మీరు కరెంట్.. ఆదా చేసినా.. లేక ఎక్కువ వినియోగించినా.. వారు వేసే బిల్లునే వేస్తారు. ఇదేంటని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు. వేసవికాలంలో.. అయితే.. ఓకే కరెంట్ బిల్లులు ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే.. ఎండవేడికి.. కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి. కానీ.. వర్షాకాలంలో.. అదీ ఓ చిన్నపాటి రేకుల షెడ్డుకు అక్షరాలా.. రూ.6 లక్షల కరెంట్ బిల్లు వేశారు అక్కడి అధికారులు. ఇది చూసిన ఆ షెడ్డులోని వ్యక్తులు, అక్కడి జనాలు షాక్ తిన్నారు.

వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సంజయ్‌నగర్‌కు చెందిన మాస రాజయ్యకు ఆగష్టు నెలకు సంబంధించిన విద్యుత్ బిల్లు ఏకంగా రూ.6 లక్షలకు పైగా వచ్చింది. ఇదేంటని సంబంధించి అధికారులకు.. ఆ షెడ్డు యజమాని ప్రశ్నించగా.. వారు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇంత బిల్లు ఎలా వచ్చిందని తెలుసుకునే ప్రయత్నం కూడా అధికారులు చేయడం లేదని.. బాధిత వ్యక్తి రాజయ్య వాపోయాడు.

Power bill of Rs 6 lakh to a shed in Godavarikhani shocks everyone