రాపాకకు జనసేనాని భారీ షాక్..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు ఘాటు లేక రాశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులు అంశానికి మద్దతు తెల్పుతానంటూ రాపాక తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ.. రాపాక తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లుల్ని వ్యతిరేకించాలని నిర్ణయించినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన లేఖను కూడా పవన్ కల్యాణ్ రాపాకకు పంపారు. […]

రాపాకకు జనసేనాని భారీ షాక్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 20, 2020 | 2:49 PM

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు ఘాటు లేక రాశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులు అంశానికి మద్దతు తెల్పుతానంటూ రాపాక తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ.. రాపాక తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లుల్ని వ్యతిరేకించాలని నిర్ణయించినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన లేఖను కూడా పవన్ కల్యాణ్ రాపాకకు పంపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే.. ఏపీ డీసెంట్రలైజేషన్ అండ్ ఈక్వల్ డెవల‌ప్‌మెంట్ రిజియన్ యాక్ట్ 2020, అమరావతి మెట్రో డెవలప్‌మెంట్ యాక్ట్ 2020 బిల్లుల్ని వ్యతిరేకించాలని పవన్ ఆ లేఖలో పేర్కొన్నారు.అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని.. అదే సమయంలో పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. అయితే పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే.. ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.