రాజధాని @విశాఖ.. మంత్రి బుగ్గన

ఏపీ ప్రత్యేక అసెంబ్లీ  సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సభలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టారు. లెజిస్టేటివ్ క్యాపిటల్‌గా అమరావతి ఉంటుందని.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా.. కర్నూల్ జ్యూడిషియల్ క్యాపిటల్‌గా ఉండబోతుందన్నారు. సచివాలయం, రాజ్ భవన్ విశాఖలోనే ఉంటాయన్న మంత్రి బుగ్గన.. హైకోర్టుకు సంబంధించిన విభాగాలన్నీ కర్నూల్‌లోనే ఉంటాయని తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా లోకల్‌ జోన్ల ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. 4 జిల్లాలకు కలిపి ఒక జోనల్ డెవలప్ […]

రాజధాని @విశాఖ.. మంత్రి బుగ్గన
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 20, 2020 | 12:39 PM

ఏపీ ప్రత్యేక అసెంబ్లీ  సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సభలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టారు. లెజిస్టేటివ్ క్యాపిటల్‌గా అమరావతి ఉంటుందని.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా.. కర్నూల్ జ్యూడిషియల్ క్యాపిటల్‌గా ఉండబోతుందన్నారు. సచివాలయం, రాజ్ భవన్ విశాఖలోనే ఉంటాయన్న మంత్రి బుగ్గన.. హైకోర్టుకు సంబంధించిన విభాగాలన్నీ కర్నూల్‌లోనే ఉంటాయని తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా లోకల్‌ జోన్ల ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. 4 జిల్లాలకు కలిపి ఒక జోనల్ డెవలప్ మెంట్ బోర్డు ఏర్పాటు చేయనున్నారు.