Visakhapatnam Agency: తరాలు మారినా.. తప్పని డోలీ కష్టాలు.. ఏజెన్సీలో చికిత్స కోసం 20 కిమీ నడకయాతన.. వీడియో
Visakhapatnam Agency: తరాలు మారినా.. వారి తలరాతలు మారలేదు. దశాబ్ధాల.. వారి కష్టాలకు తెరపడలేదు. ప్రభుత్వాలు మారుతున్నా.. గిరిజనుల డోలి కష్టాల్లో ఎలాంటి మార్పులేదు.
Visakhapatnam Agency: తరాలు మారినా.. వారి తలరాతలు మారలేదు. దశాబ్ధాల.. వారి కష్టాలకు తెరపడలేదు. ప్రభుత్వాలు మారుతున్నా.. గిరిజనుల డోలి కష్టాల్లో ఎలాంటి మార్పులేదు. విశాఖ ఎజెన్సీలో తరచూ డోలీ కష్టాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే డెలివరీ కోసం ఇబ్బందులు పడుతున్న గర్భిణీలు, పాము కాటేసిన వైద్యం కోసం డోలీ పై కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటిన వైనాలను చూశాం. తాజగా సేమ్ టూ సేమ్ అలాంటి డోలీ కష్టమే కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. విశాఖపట్నం (Visakhapatnam) కొయ్యూరు మండలం యు.చీడిపాలెం పంచాయతీ తీగల మెట్ట గ్రామానికి చెందిన మాధవరావు.. ఉఫాదిలో భాగంగా చింతపండు సేకరించేందుకు చెట్టెక్కి ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే 20 కిలోమీటర్లు డోలీ సాయంతో కొండలు, గుట్టలు, వాగులు దాటుకుంటూ తూర్పు గోదావరి జిల్లా (East Godavari) వై. రామవరం ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చారు కుర్రాళ్లు. అష్టకష్టాలు పడి టైంకు మాధవరావును ఆస్పత్రికి చేర్చడంతో అతని ప్రాణాలను కాపాడామని చెప్పారు డాక్టర్లు. అయితే ఇలాంటి డోలీ కష్టాల్లో విషాదాలు కూడా చూశారు గిరిజనులు. కొన్ని సార్లు డోలీలో తరలించే క్రమంలో ప్రాణాలు పోయిన ఘటనలు ఉన్నాయని ఏజెన్సీ గిరిజనులు చెబుతున్నారు.
ఐదేళ్ల కొకసారి ప్రభుత్వాలు మారుతున్నా కష్టాలు తీర్చే నేతలే కరువయ్యారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా నేతలు రావడం వారి కష్టాలు వినడం..హామీలు గుమ్మరించడం.. చిరకు ఆ హామీలు నెరవేరకపోవడం వారికి మాములైపోయింది. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి ఏటా వందల కోట్ల నిధులు మంజూరవుతున్నా.. తమ కష్టాలకు తీర్చడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపిస్తున్నారు గిరిజనులు. కనీసం చాలా గ్రామాలకు రోడ్లు కూడా ఏర్పాటు చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డోలీ కష్టాలను అధికారులు ఇప్పటికైనా పట్టించుకోవాలంటూ విజ్ఙప్తి చేస్తున్నారు గిరిజనులు.
Also Read: