AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INS Sandhayak : దేశీయంగా రూపకల్పన చేసి నిర్మించిన మొట్టమొదటి “ఐఎన్‌ఎస్ సంధాయక్” నిష్క్రమించే వేళ.. 40 ఏళ్ల ప్రస్థానానికి ఇక వీడ్కోలు

దేశీయంగా రూపకల్పన చేసి నిర్మించిన మొట్టమొదటి నౌక సంధాయక్. ఈ నౌకకు ఇవాళ్టితో (జూన్ 04 శుక్రవారం) శాశ్వతంగా విరామం..

INS Sandhayak : దేశీయంగా రూపకల్పన చేసి నిర్మించిన మొట్టమొదటి ఐఎన్‌ఎస్ సంధాయక్ నిష్క్రమించే వేళ.. 40 ఏళ్ల ప్రస్థానానికి ఇక వీడ్కోలు
Ins Sandhayak 2
Venkata Narayana
|

Updated on: Jun 04, 2021 | 12:27 PM

Share

“ఐఎన్‌ఎస్ సంధాయక్‌”. 40 సంవత్సరాల పాటు భారతమాతకు సేవలందించిన భారతీయ నావికా దళానికి చెందిన హైడ్రోగ్రాఫిక్ సర్వే షిప్‌. దేశీయంగా రూపకల్పన చేసి నిర్మించిన మొట్టమొదటి నౌక సంధాయక్. ఈ నౌకకు ఇవాళ్టితో (జూన్ 04 శుక్రవారం) శాశ్వతంగా విరామం ఇవ్వనున్నారు. ఐఎన్ఎస్ సంధాయక్ డీకమిషన్ కార్యక్రమం నావల్ డాక్యార్డ్ విశాఖపట్నంలో ఈ సాయంత్రం సమయంలో జరుగుతుంది. కొవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ స్టేషన్ అధికారులు.. ఇంకా నావికులు మాత్రమే హాజరై నిరాడంబరంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఐఎన్ఎస్ సంధాయక్ సేవలిక ముగిసాయనడానికి ప్రతీకగా శుక్రవారం సూర్యాస్తమయంలో ఆ నౌక వేదికగా నావల్ జెండా, కమిషనింగ్ పతాకాన్ని చివరిసారి అవనతం చేస్తారు. ఈఎన్ సి ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్, ఎవిఎస్ఎమ్, విఎస్ఎమ్ సమక్షంలో ఈ వీడ్కోలు కార్యక్రమం జరుగుతుంది. తన అద్భుతమైన 40 సంవత్సరాల ప్రస్థానంలో సంధాయక్ నౌకకు మొత్తంగా 22 మంది కమాండింగ్ అధికారులు మారారు. చివరి కమాండింగ్ ఆఫీసర్ 17 జూన్ 19 న నౌక బాధ్యతలు స్వీకరించారు.

భారత నావికాదళంలోని హైడ్రోగ్రాఫర్‌లు ఈ నౌక నుండే అనేక పాఠాలను నేర్చుకున్నారు. తద్వారా ద్వీపకల్ప జలాల పూర్తి హైడ్రోగ్రాఫిక్ కవరేజీకి ఈ నౌక పునాదులు వేసింది. అలాగే, విజయవంతమైన ఆ నౌక డిజైన్ భారత నావికాదళంలోని అన్ని సర్వే నౌకలకు ఇటీవలి వరకు వివిధ మార్పులు చేయడానికి మార్గం సుగమం చేసింది. ఈ నౌక దేశంలోని తూర్పు, పశ్చిమ తీరాలు, అండమాన్ సముద్ర జలాలు, పొరుగు దేశాలలో కూడా సుమారు 200 ప్రధాన హైడ్రోగ్రాఫిక్ సర్వేలు, అనేక చిన్న సర్వేలను చేపట్టింది. సర్వే మిషన్లు మాత్రమే కాకుండా, ఆపరేషన్ పవన్ – 1987 లో శ్రీలంకలో భారత శాంతి పరిరక్షక దళానికి సహాయం చేయడం, ఆపరేషన్ సరోంగ్, ఆపరేషన్ రెయిన్బో – 2004 లో సునామి తరువాత మానవతా సహాయం అందించడం.. తొలిసారిగా పాల్గొనడం వంటి అనేక ముఖ్యమైన కార్యకలాపాలలో ఈ నౌక చురుకుగా పాల్గొంది.

‘టైగర్-ట్రయంఫ్’ పేరుతో ఇండో-అమెరికా ఉమ్మడి నౌకా విన్యాసంలో కూడా ఈ నౌక పాల్గొంది. ‘సంధాయక్‌’ నౌక అప్పటి చీఫ్ హైడ్రోగ్రాఫర్ రియర్ అడ్మిరల్ ఎఫ్ఎల్ ఫ్రేజర్, ఎవిఎస్ఎమ్, పద్మశ్రీ నేతృత్వంలో రూపకల్పన జరిగింది. ఈ డిజైన్ ను నావల్ హెడ్ క్వార్టర్స్ రూపొందించగా ఓడ నిర్మాణం 1978 లో జిఆర్ఎస్ఇ కోల్‌కతా దగ్గర ప్రారంభమైంది. ఈ నౌకను 26 ఫిబ్రవరి 1981 న భారత నావికా దళంలోకి అప్పటి తూర్పు నావికా దళం (ఈఎన్సి) ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ అడ్మిరల్ ఎంకె రాయ్, ఎవిఎస్ఎమ్ ప్రవేశపెట్టారు.

Read also : Vijay Mallya Cries : ఎక్కడుంది చీటింగ్.. ! ఎందుకు పదేపదే మోసగాడంటారు..? లండన్ నుంచి గలమెత్తిన విజయ్ మాల్కా

Follow Us
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
జైపూర్‌లో రాయల్స్ రుద్రరూపం..ఢిల్లీ ముందు 226 పరుగుల భారీ లక్ష్యం
జైపూర్‌లో రాయల్స్ రుద్రరూపం..ఢిల్లీ ముందు 226 పరుగుల భారీ లక్ష్యం