వారి సమాచారమిస్తే రూ. 5వేలు ప్రోత్సాహకం: సీఎం కేసీఆర్
తెలంగాణలో నకిలీ విత్తనాలు అమ్మేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మంత్రులు, కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్..నకిలీ విత్తన వ్యాపారులు రైతు హంతకులని అన్నారు.
తెలంగాణలో నకిలీ విత్తనాలు అమ్మేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మంత్రులు, కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్..నకిలీ విత్తన వ్యాపారులు రైతు హంతకులని అన్నారు. నకిలీ విత్తనాల విషయంలో ఎవరినీ వదిలిపెట్టేది లేదని, నకిలీ విత్తన వ్యాపారులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆదేశించారు. అటువంటి నకిలీ విత్తనాల వల్లే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని మండిపడ్డారు. నకిలీ విత్తనాలు అమ్మేవారి సమాచారమిస్తే రూ. 5వేల ప్రోత్సాహకం ఇస్తామని..సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని కేసీఆర్ వెల్లడించారు.