అప్పుడాయన.. ఇప్పుడీయన.. ఎవరో ఒకరు అదే తీరు !

ప్రతీ ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చే నేత ఎవరో ఒకరు వుంటూనే వుంటారు. గత ప్రభుత్వ హయాంలో దెందులూరుకు చెందిన చింతమనేని ప్రభాకర్ తరచూ కేసులతో, గొడవలతో వార్తలకెక్కే వారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆ బాధ్యతలను నెల్లూరుకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీసుకున్నట్లు  కనిపిస్తోంది. అచ్చు గుద్దినట్లు అదే తీరు. పార్టీ అధినేతలకు నెత్తి నొప్పి పుట్టించే తీరు. చింతమనేని ప్రభాకర్.. తెలుగు దేశం పార్టీలో సీనియర్ నేత, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గ […]

అప్పుడాయన.. ఇప్పుడీయన.. ఎవరో ఒకరు అదే తీరు !
Rajesh Sharma

| Edited By: Anil kumar poka

Oct 05, 2019 | 6:18 PM

ప్రతీ ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చే నేత ఎవరో ఒకరు వుంటూనే వుంటారు. గత ప్రభుత్వ హయాంలో దెందులూరుకు చెందిన చింతమనేని ప్రభాకర్ తరచూ కేసులతో, గొడవలతో వార్తలకెక్కే వారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆ బాధ్యతలను నెల్లూరుకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీసుకున్నట్లు  కనిపిస్తోంది. అచ్చు గుద్దినట్లు అదే తీరు. పార్టీ అధినేతలకు నెత్తి నొప్పి పుట్టించే తీరు.

చింతమనేని ప్రభాకర్.. తెలుగు దేశం పార్టీలో సీనియర్ నేత, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కూడా.. అయితే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన ఈ ఎమ్మెల్యే… ఇప్పుడు కటకటాలపాలయ్యారు. అంతేకాదు… గతంలో చేసిన ఒక్కో కేసు ఇప్పుడు అతన్ని వెంటాడుతున్నాయి. ఈయనపై 1995లోనే ఏలూరు పోలీసు స్టేషన్లో రౌడీ షీట్ ఓపెన్ చేశారు పోలీసులు.

అయితే ఈ ఎమ్మెల్యే గారు.. గత 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన బాగోతాలు అన్నీ ఇన్నీ కావు.. మహిళా అధికారులపై కూడా దాడులకు దిగిన ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు.. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో కూడ అనేక సందర్భాల్లో ప్రభుత్వాధికారులపై చేయి చేసుకున్న ఆరోపణలపై పోలీసులు కేసులు నమోదు చేశారు అప్పట్లో. అయితే 2014 నుంచి అధికారంలో టీడీపీ ఉండటంతో.. ఈ ఎమ్మెల్యేను టచ్‌ చేయడానికి పోలీసులు కూడా ధైర్యం చేయలేక పోయారు.  1995లో చింతమనేనిపై తొలసారి ఏలూరు పోలీస్ ష్టేషన్ లో రౌడీ షీట్ ఓపెన్ చేశారు. అప్పటించి.. మొన్నటి కేసు వరకు కలిపితే మొత్తం నలభైకి పైగానే కేసులు చింతమనేనిపై వున్నాయి.

ఇక చింతమనేని ప్రభాకర్ కు తానేమీ తీసిపోలేదని చాటుకుంటున్నారు వైసీపీ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. తాజాగా నెల్లూరు రూరల్ మండలం కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులోని వెంకటాచలం మండలం ఎంపిడిఓ సరళ ఇంటిపై కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి దౌర్జన్యంచేశారని పోలీసులకు పిర్యాదు అందింది.. గొలగమూడి వద్ద ఉన్న ఓ లే అవుట్ కు నీటి కనెక్షన్ మంజూరు చేయలేదని ఈ దౌర్జన్యానికి పాల్పడ్డా డని తన ఇంటికి విద్యుత్తు, కేబుల్ కనెక్షన్లు తొలగించారని ఎంపీడీఓ సరళ పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో పేర్కొన్నారు.. నీటి పైపులను తొలగించేందుకు గుంతను తవ్వారు. దీంతో అధికారిని తనకు న్యాయం చేయాలంటూ నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

అంతకు ముందు పోలీసులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆమె స్టేషన్లోని చెట్టు కిందే కొంతసేపు నిరసన తెలిపారు. గొలగమూడిలో ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్రెడ్డి సమీప బంధువు కృష్ణారెడ్డి లేఅవుట్ వేశారు. అయితే దీనికి సంబంధించి నీటి కనెక్షన్ ఇవ్వాలని ఈ నెల ఒకటవ తేదీన ఫోన్లో బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి,  ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తనతో మాట్లాడారని రేపటిలోగా పని పూర్తి చేయాలని ఎమ్మెల్యే బెదిరించారని ఎంపీడివో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అయితే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనపై.వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని వాదిస్తున్నారు.

ఏదిఏమైనా దురుసు ప్రవర్తనతో రాజకీయాల్లో కొనసాగుతూ తానున్న పార్టీకే తలనొప్పులు తేవడంలో అటు చింతమనేని, ఇటు కోటంరెడ్డి ఎవరికి ఎవరు తీసిపోరని ఏపీ పాలిటిక్స్ ని దగ్గర్నించి గమనిస్తున్నవారు అభిప్రాయపడుతున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu