మానవత్వానికి ప్రతీక..మూగజీవి కోసం 150కి.మీల ప్రయాణం

అసలే కరోనా కల్లోలం. ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటేనే వైరస్ భయంతో ప్రజలు వణికిపోతున్నారు. ఇటువంటి సమయంలో తోటి మనిషి ఆపదలో ఉన్నా సరే, సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రానటువంటి దుస్థితి. చివరకు..

మానవత్వానికి ప్రతీక..మూగజీవి కోసం 150కి.మీల ప్రయాణం
Follow us

|

Updated on: Jul 14, 2020 | 5:05 PM

అసలే కరోనా కల్లోలం. ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటేనే వైరస్ భయంతో ప్రజలు వణికిపోతున్నారు. ఇటువంటి సమయంలో తోటి మనిషి ఆపదలో ఉన్నా సరే, సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రానటువంటి దుస్థితి. చివరకు ఓ మనిషి నడిరోడ్డుపై పడిపోయి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నా ఎవరూ పట్టించుకోని దీనస్థితి. ఇలాంటి తరుణంలో కొందరు యువకులు చేసిన పనికి నెట్టిట్లో ప్రశంసల వర్షం కురుస్తోంది.

వరంగల్ జిల్లాలోని మారుమూల ప్రాంతమైన నారాయణ తండాలో వెలుగు చూసిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆదివారం రాత్రి సమయంలో నారాయణ తండాలో గల 70 అడుగుల బావిలో ప్రమాదవశాత్తు ఓ కుక్క పడిపోయింది. పైకి రాలేక ఆ కుక్క గొంతు చిచ్చుకుని అరవసాగింది. ఆ అరుపులు విన్న స్థానికులు రాత్రి 11.30 గంటల ప్రాంతంలో బావిలో పడ్డ కుక్కను గమనించారు. వెంటనే దాన్ని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో వారు హైదరాబాద్‌లోని ఓ జంతుసంరక్షణ సంస్థకు సమాచారం అందజేశారు.

దీంతో రంగంలోకి దిగిన సదరు సంస్థ నిర్వాహకులు ఆ కుక్క కోసం హైదరాబాద్ నుండి దాదాపుగా 150 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి నారాయణ తండాకు చేరుకున్నారు. రవాణా వసతులు కూడా సరిగా లేని సమయం కావటంతో సొంత వాహనంలోనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లు భారీ తాళ్ల సాయంతో బావిలోకి దిగి ఆ కుక్కను కాపాడారు. ఈ విషయం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. మనుషుల్లో మానవత్వానికి ఇదే నిదర్శనం అంటూ.. కుక్క కోసం ఆ యువకులు చేసిన సాయానికి జంతు ప్రేమికులు చాలా మంది లైకులు, కామెంట్లు చేస్తున్నారు.

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?