AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్య మరణం తట్టుకోలేక భర్త ఆత్మహత్య

ప్రాణం కన్న ఎక్కవగా ప్రేమించాడు. అందరిని ఒప్పించి ఒక్కటయ్యారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట కాపురం ప్రశాంతంగా సాగుతోంది. వారి ప్రేమకు ప్రతిరూపంగా పండంటి బిడ్డ కూడా జన్మించాడు. అంతలోనే వారి సంతోషం అవిరైపోయింది. ప్రసవానంతరం భార్య మరణించింది. ఆ వేదనను తట్టుకోలేక భర్త కూడా లోకం విడిచి వెళ్లిపోయాడు.

భార్య మరణం తట్టుకోలేక భర్త ఆత్మహత్య
Balaraju Goud
|

Updated on: Jul 14, 2020 | 4:52 PM

Share

ప్రాణం కన్న ఎక్కవగా ప్రేమించాడు. అందరిని ఒప్పించి ఒక్కటయ్యారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట కాపురం ప్రశాంతంగా సాగుతోంది. వారి ప్రేమకు ప్రతిరూపంగా పండంటి బిడ్డ కూడా జన్మించాడు. అంతలోనే వారి సంతోషం అవిరైపోయింది. ప్రసవానంతరం భార్య మరణించింది. ఆ వేదనను తట్టుకోలేక భర్త కూడా లోకం విడిచి వెళ్లిపోయాడు. దీంతో రోజుల వయసు కలగిని పసిబిడ్డ అనాథగా మారాడు. ఆంధ్రప్రదేశ్ జరిగిన ఈ విషాద ఘటన అందరినీ కన్నీరు పెట్టించింది.

విశాఖ జిల్లా సింహాచలం కొండపైన ఉన్న గిరిజన గ్రామానికి చెందిన జలుమూరి శ్రావణ్‌కుమార్‌ (20), పొరిగింట్లో ఉండే అంబికను ప్రేమించి ఏడాది కిందట పెళ్లి చేసుకున్నారు. అంబిక గర్భం దాల్చింది. నెలలు నిండడంతో ప్రసవం కోసం ఈనెల 6న విశాఖ కేజీహెచ్‌లో చేర్పించారు. ఆమెకు డెలివరీ సమయంలో ఫిట్స్‌ రావడంతో సిజేరియన్‌ చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, జూలై 8వ తేదీన అంబిక తీవ్ర అస్వస్థతకు గురై మరణించింది. భార్య మృతితో శ్రావణ్ తీవ్రంగా కుంగిపోయాడు. ప్రాణం కన్న ఎక్కువగా ప్రేమించిన భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తీవ్ర మనస్థాపానికి గురైన శ్రావణ్‌కుమార్‌.. ఆదివారం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అయిదు రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ మరణించడంతో ఆ బాలుడు అనాథగా మారాడు. శ్రావణ్‌కుమార్‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఆయుషు తీరి తల్లి అకాల మరణం, క్షణికావేశంలో తండ్రి చావు ఆ పసిబాలుడిని ఒంటరిగా మార్చాయి.