ప్రాణం తీసిన ఫుల్‌ బాటిల్‌ మద్యం పందెం

స్నేహితులు సరదాగా అన్న మాటల్ని సీరియస్‌గా తీసుకున్నాడు. 20 నిమిషాల్లో ఫుట్‌ బాటిల్‌ మొత్తం తాగేస్తానంటూ సవాల్‌ చేశాడు. అన్నట్టుగానే గటగటా మద్యం తాగిన అతడు. చివరికి ప్రాణాలను కోల్పోయాడు. నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది

  • Balaraju Goud
  • Publish Date - 2:55 pm, Tue, 14 July 20
ప్రాణం తీసిన ఫుల్‌ బాటిల్‌ మద్యం పందెం

స్నేహితులు సరదాగా అన్న మాటల్ని సీరియస్‌గా తీసుకున్నాడు. 20 నిమిషాల్లో ఫుట్‌ బాటిల్‌ మొత్తం తాగేస్తానంటూ సవాల్‌ చేశాడు. అన్నట్టుగానే గటగటా మద్యం తాగిన అతడు. చివరికి ప్రాణాలను కోల్పోయాడు. నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది

జిల్లాలోని మామడ మండలం అనంతపేటలో ప్రకాశం జిల్లా చెందిన ఖాజా రసూల్ లక్ష్మణ్‌చందా మండలం చింతలచందాలో తాపీ మేస్త్రీగా స్థిరపడ్డాడు. ఇతని భార్య, ఒక కుమారుడు ఉన్నారు. అయితే , కొంతమంది మిత్రులు విందు ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో 20 నిమిషాల్లో మద్యం పుల్ బాటిల్ తాగాలని మిత్రులు వేసిన పందానికి ఖాజా రసూల్(31) అనే వ్యక్తి బలయ్యాడు. వేగంగా మద్యం తాగే క్రమంలో రసూల్‌ కుప్పకూలిపోయాడు. మద్యాన్ని గటగటా గొంతులో పోసుకున్నాడు. ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్నేహితులు అతడిని వదిలేసి వెళ్లిపోయారు. రసూల్ ఎంతకీ నిద్ర లేవకపోవడంతో కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. అతిగా మద్యం తాగేలా రెచ్చగొట్టి రసూల్ మరణానికి కారకులైన రత్తయ్య, నాగూర్ బాషాపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.