మునిసిపాలిటీల్లో ఖాళీల భర్తీ పై మంత్రి కేటీఆర్ ఫోకస్

మునిసిపాలిటీల్లో ఖాళీల భర్తీ పైన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కసరత్తు మొదలు పెట్టారు. పట్టణ ప్రాంతాల్లో మార్పు లక్ష్యంగా ప్రభుత్వ ప్రణాళికలు సిద్ధం చేసింది. మునిసిపాలిటీల్లోని....

మునిసిపాలిటీల్లో ఖాళీల భర్తీ పై మంత్రి కేటీఆర్ ఫోకస్
Follow us

|

Updated on: Jul 14, 2020 | 2:09 PM

మునిసిపాలిటీల్లో ఖాళీల భర్తీ పైన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కసరత్తు మొదలు పెట్టారు. పట్టణ ప్రాంతాల్లో మార్పు లక్ష్యంగా ప్రభుత్వ ప్రణాళికలు సిద్ధం చేసింది. మునిసిపాలిటీల్లోని ఖాళీల భర్తీ పైన సమీక్ష సమావేశం నిర్వహించారు.పెరుగుతున్న పట్టణీకరణ, పట్టణాల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సిబ్బంది కేటాయింపు. ప్రస్తుతం ఉన్న సిబ్బందిని రేషన లైజ్ చేసిన తర్వాత పట్టణ ప్రజల అవసరాల మేరకు నూతన సిబ్బంది నియామకం. ఇంజనీరింగ్, ఇన్ ఫ్రా విభాగాలకు ప్రాధాన్యత వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

పరిపాలన వికేంద్రీకరణ స్ఫూర్తి మేరకు ప్రజలకు పాలన ప్రతిఫలాలు అందాలని అధికారులకు మంత్రి సూచించారు. నూతన పురపాలక చట్టం నియమ నిబంధనల మేరకు ప్రజలకు మరింత సౌకర్యవంతమైన పాలనను అందించేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

హైదరాబాద్ మరియు ఔటర్ రింగ్ రోడ్డు పరిసర మున్సిపాలిటీలు, జిల్లా కేంద్రాల్లో సిబ్బంది అవసరం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా మునిసిపాలిటీల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.

Latest Articles