కేరళ గోల్డ్ స్మగ్లింగ్: కొనసాగుతున్న ఎన్ఐఏ దర్యాప్తు

కేరళ ప్రభుత్వానే ఇరకాటంలో పెట్టిన గోల్డ్ స్మగ్లింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి కార్యాలయం పాత్రపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించడంతో సీఎం పినరయి విజయన్ స్పందించి ఇందుకు కారణమైన అధికారులపై వేటు వేశామన్నారు. మరోవైపు ప్రధాన నిందితులు స్వప్న సురేశ్, మరో నిందితుడు సందీప్ నాయర్‌లను 8 రోజులపాటు కస్టడీలోకి తీసుకున్న ఎన్ఐఏ విచారణ జరపుతోంది.

కేరళ గోల్డ్ స్మగ్లింగ్: కొనసాగుతున్న ఎన్ఐఏ దర్యాప్తు
Follow us

|

Updated on: Jul 14, 2020 | 5:54 PM

కేరళ ప్రభుత్వానే ఇరకాటంలో పెట్టిన గోల్డ్ స్మగ్లింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి కార్యాలయం పాత్రపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించడంతో సీఎం పినరయి విజయన్ స్పందించి ఇందుకు కారణమైన అధికారులపై వేటు వేశామన్నారు. మరోవైపు ప్రధాన నిందితులు స్వప్న సురేశ్, మరో నిందితుడు సందీప్ నాయర్‌లను 8 రోజులపాటు కస్టడీలోకి తీసుకున్న ఎన్ఐఏ విచారణ జరపుతోంది.

రాజకీయ దుమారం రేపుతున్న బంగారం స్మగ్లింగ్ కేసుతో ప్రతిపక్షాలు పినరయి విజయన్ సర్కారును ఇరుకునే పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో స్వప్న సురేశ్‌ను విధుల్లోకి తీసుకున్నందుకు సీఎం ప్రధాన కార్యదర్శి శివ శంకర్‌పై ఇప్పటికే సస్పెన్షన్ వేటు కూడా వేశారు. ఈ వ్యవహారంపై ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ సిఫార్సు మేరకు ఎన్ఐఏ విచారణ మొదలుపెట్టింది.

ఇటీవల యూనైటెడ్…ఇటీవల యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చిన కన్‌సైన్‌మెంట్ రూ.14.82 కోట్ల విలువైన 30 కేజీల బంగారాన్ని డిప్లమేటిక్ బ్యాగేజిగా చెప్తూ స్మగ్లింగ్ చేయడాన్ని తిరువనంతపురంలో కస్టమ్స్ అధికారులు ఇటీవల కనుగొన్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి యూఏఈ కాన్సులేట్‌లో పనిచేస్తున్న సరిత్ కుమార్, స్వప్న సురేశ్‌లను కస్టమ్స్ అధికారులు విచారించిన అనంతరం ఏన్ఐఏ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సీఎంవో నుంచి నేరుగా ఫోన్లు వెళ్లడం వల్లే.. బంగారం స్మగ్లింగ్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు కస్టమ్స్ నిర్థారణకు వచ్చింది. ఐటీ శాఖ కార్యదర్శి శివశంకర్‌తో స్వప్న సురేశ్ సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం విజయన్ తనవద్ద సెక్రటరీగా వున్న శివశంకర్‌ను తప్పించారు. ఆయన స్థానంలో కన్నూరు మాజీ కలెక్టర్ మీర్ మొహమ్మద్‌ను నియమించినట్లుగా తెలుస్తోంది.

ఈ బంగారం స్మగ్లింగ్ వ్యవహారం కేరళ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. గోల్డ్ స్మగ్లింగ్‌లో సీఎంవో పాత్ర ఉన్నట్లు కేరళ విపక్ష నేత రమేశ్ ఆరోపించారు. ప్రధాని మోడీకి లేఖ రాసిన రమేశ్.. యూఏఈ కాన్సులేట్ అధికారాలను దుర్వినియోగం చేస్తోందని పేర్కోన్నారు. నిస్పపక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలన్నారు. మరోవైపు సీఎం పదవికి విజయన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

కాగా, ప్రతిపక్షాల ఆరోపణలపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. కొంతమంది ముఖ్యమంత్రిని, సీఎం కార్యాలయాన్ని లాగడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు ముఖ్యమంత్రి. ఈ కేసును కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని విజయన్ సూచించారు.

ఇదిలావుండగా, కేరళ గోల్డ్ స్కామ్‌పై కొచ్చిలోని జాతీయ దర్యాప్తు సంస్థ కార్యాలయంలో దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసులో నిందితులు స్వప్న సురేశ్, సందీప్‌ నాయర్‌లను ప్రశ్నిస్తున్నారు. నిందితులను ప్రశ్నించడం కోసం ఆదాయపు పన్ను శాఖాధికారులు ఎన్ఐఏ కార్యాలయానికి వచ్చారు. కొచ్చిలోని ఎన్ఐఏ కోర్టు సోమవారం ఈ ఇద్దరు నిందితులను జూలై 21 వరకు ఎన్ఐఏ కస్టడీకి ఆదేశించింది. వీరిని 10 రోజులు కస్టడీకి అనుమతించాలని ఎన్ఐఏ కోరింది కానీ, జస్టిస్ పి. కృష్ణ కుమార్ 8 రోజుల కస్టడీని మాత్రమే అనుమతించారు.