‘వర్క్ ఫ్రం హోం’ కాదు ఇక ‘వర్క్ ఫ్రం ఎనీ లొకేషన్’ కొత్త పద్ధతి
కొవిడ్ వైరస్ నుంచి తమ వినియోగదారులు, ఉద్యోగులను కాపాడుకొనేందుకు సంస్థలన్నీ కొత్తగా ఆలోచిస్తున్నాయి. ఇప్పటికే చాలా సంస్థలు వర్క్ ఫ్రం హోం విధానాన్ని అమలు తెచ్చాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మరో అడుగు ముందుకేసింది. తమ ఉద్యోగులు ఎక్కడి నుంచైనా (వర్క్ ఫ్రం ఎనీ లొకేషన్) పనిచేసే వ్యవస్థను తీసుకురానుంది. వినియోగదారుల కోసం కాంటాక్ట్ లెస్ డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ చర్యల వల్ల సంస్థకు కనీసం రూ.వెయ్యి కోట్లు మిగులుతాయని […]

కొవిడ్ వైరస్ నుంచి తమ వినియోగదారులు, ఉద్యోగులను కాపాడుకొనేందుకు సంస్థలన్నీ కొత్తగా ఆలోచిస్తున్నాయి. ఇప్పటికే చాలా సంస్థలు వర్క్ ఫ్రం హోం విధానాన్ని అమలు తెచ్చాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మరో అడుగు ముందుకేసింది.
తమ ఉద్యోగులు ఎక్కడి నుంచైనా (వర్క్ ఫ్రం ఎనీ లొకేషన్) పనిచేసే వ్యవస్థను తీసుకురానుంది. వినియోగదారుల కోసం కాంటాక్ట్ లెస్ డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ చర్యల వల్ల సంస్థకు కనీసం రూ.వెయ్యి కోట్లు మిగులుతాయని ఎస్‌బీఐ ఛైర్మన్ రజనీశ్ కుమార్ తెలిపారు. కొవిడ్-19 సమయంలో బిజినెస్ లో ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగుతున్నదని ఎస్‌బీఐ ఛైర్మన్ అన్నారు.
వినియోగదారులు ఎస్‌బీఐ యూనో వ్యాలెట్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారని రజనీశ్ తెలిపారు. ఏటీఎం కార్డులు లేకుండా నగదు చెల్లింపులు, ఇంటి వద్దకే నగదు పంపిణీ, చెక్కులు సేకరించడం వంటి కార్యక్రమాల్ని ప్రారంభించామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎస్‌బీఐలో రెండు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.