దేశ రాజధానిలో రెండో ప్లాస్మా సెంటర్ ప్రారంభం

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా రోగుల కోసం రెండో ప్లాస్మా సెంటర్‌ అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌, ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా, ఇతర ఉన్నతాధికారులతో కలిసి

దేశ రాజధానిలో రెండో ప్లాస్మా సెంటర్ ప్రారంభం
Follow us

|

Updated on: Jul 14, 2020 | 6:05 PM

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా రోగుల కోసం రెండో ప్లాస్మా సెంటర్‌ అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌, ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం ఈ ప్లాస్మా సెంటర్‌ని ప్రారంభించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న లోక్ నాయక్ ఆస్పత్రిలో ఈ రెండో ప్లాస్మా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేజీవ్రాల్‌ మాట్లాడుతూ, మొదటి ప్లాస్మా సెంటర్‌ విజయవంతమైందని తెలిపారు. అందుకే రెండో సెంటర్‌ను ఎల్‌ఎన్‌జీపీ వద్ద ప్రారంభించామని చెప్పారు.

ఇకపోతే, ఢిల్లీలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోందనీ.. అయినప్పటికీ ఏమాత్రం నిర్లక్ష్యం వహించడానికి వీల్లేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ‘‘కరోనా మళ్లీ ఎప్పుడు విరుచుకుపడుతుందో చెప్పలేమన్నారు. భౌతిక దూరం పాటిస్తూ..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఇప్పటి వరకు కరోనాపై పోరులో అందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్లే పరిస్థితి అదుపులోకి వచ్చిందని స్పష్టం చేశారు.