బీ అలర్ట్.. ఇలా చేస్తే మీ వాట్సాప్ బ్లాక్ అవ్వడం ఖాయం..

సాధారణంగానే వాట్సాప్ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకుంటారు. ఇలా చేస్తే ఎలాంటి సమస్యలు ఎదురవ్వవు కానీ.. అలా కాకుండా ఆన్‌లైన్లో దొరికే వాట్సాప్ మాడిఫైడ్ వర్షన్ వాడితే కనుక డేంజర్ అని హెచ్చరిస్తోంది వాట్సాప్ కంపెనీ. మాడిఫైడ్ వాట్సాప్ యాప్ వాడితే ఖచ్చితంగా..

బీ అలర్ట్.. ఇలా చేస్తే మీ వాట్సాప్ బ్లాక్ అవ్వడం ఖాయం..
Follow us

| Edited By:

Updated on: Jul 14, 2020 | 5:28 PM

సాధారణంగానే వాట్సాప్ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకుంటారు. ఇలా చేస్తే ఎలాంటి సమస్యలు ఎదురవ్వవు కానీ.. అలా కాకుండా ఆన్‌లైన్లో దొరికే వాట్సాప్ మాడిఫైడ్ వర్షన్ వాడితే కనుక డేంజర్ అని హెచ్చరిస్తోంది వాట్సాప్ కంపెనీ. మాడిఫైడ్ వాట్సాప్ యాప్ వాడితే ఖచ్చితంగా మీరు పలు టెక్నికల్ సమస్యలు ఎదుర్కోవడం ఖాయమని చెబుతోంది ఈ సంస్థ. తాజాగా సోమవారం ఈ మాడిఫైడ్ వాట్సాప్ వినియోగం గురించి సూచనలు చేసింది.

మాడిఫైడ్ లేదా మాడెడ్ వాట్సాప్ వాడితే కనున మీ అకౌంట్ బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంది. వాట్సాప్‌కు సంబంధించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు వినియోగదారులకు తెలిపే వెబ్ ఇన్ఫో కూడా మాడిఫైడ్ వర్షన్ ఉపయోగించకూడదని సూచిస్తుంది. మాడెడ్ యాప్ అంటే డెవలపర్లు ఒరిజినల్ యాప్‌కు కొన్ని మార్పులు చేసి రిలీజ్ చేస్తారు. ఇవి ఆన్‌లైన్‌లో లభిస్తాయి. కంపెనీ రిలీజ్ చేసే యాప్ కాకుండా ఇలా మాడిఫైడ్ వంటి యాప్స్ వాడితే.. రిస్కులో పడే ఛాన్స్ ఉన్నట్లే. ఎందుకంటే ఇవి వాడటం ద్వారా సైబర్ నేరగాళ్లు ఈజీగా మీ వాట్సాప్ హిస్టరీని తీసుకోవచ్చు.

Latest Articles